
జీరో కార్బన్ ఉద్గారాల వైపు అడుగులు వేస్తూ.. ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ 'ప్యూర్ ఈవీ' (Pure EV) పునరుత్పత్పాదక శక్తి ద్వారా విద్యుత్ బిల్లులను గణనీయంగా తగ్గించుకుంది. తెలంగాణలోని కంపెనీ సదుపాయంతో డీజీ అండ్ గ్రిడ్‌తో కూడిన 500 కిలోవాట్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్.. 125 కిలోవాట్ సిస్టం వంటి వాటిని ఏకీకృతం చేయడం ద్వారా.. ఎనర్జీ ఎఫిషియన్సీలలో సరికొత్త మైలురాయిని సాధించింది. మునుపటి ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే.. విద్యుత్ బిల్లులకు సంబంధించిన ఖర్చులలో 60 శాతం, డీజీ ఇంధన బిల్లులలో 65 శాతం తగ్గింపును నమోదు చేసింది.
సోలార్ ఇన్‌స్టాలేషన్ అనేది కంపెనీ కార్యకలాపాలను శక్తివంతం చేయడానికి.. పునరుత్పాదక శక్తిని వినియోగించుకోవడానికి మాత్రమే కాకుండా గ్రిడ్ నుంచి విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించడానికి సహాయం చేస్తుంది. 500 KWh పూర్తిగా కొత్త బ్యాటరీలను కలిగి ఉంటుంది. అంటే పాత బ్యాటరీల స్థానంలో లేటెస్ట్ జనరేషన్ బ్యాటరీలను అమర్చింది. ఇది పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. పూర్తిగా ఎలక్రిక్, సోలార్ వంటి వాటిని ఉపయోగించడం వల్ల కాలుష్య తీవ్రతను తగ్గించవచ్చు.
పునరుత్పాదక శక్తిని ఉపయోగించుకునే శక్తిని కంపెనీ పొందినందుకు చాలా సంతోషిస్తున్నాము. ఇది పర్యావరణానికి అనుకూలంగా ఉండటమే కాకుండా.. ఖర్చులను కూడా గణనీయంగా తగ్గించడంలో సహాయపడుతుందని ప్యూర్ వ్యవస్థాపకుడు & మేనేజింగ్ డైరెక్టర్ డా. నిశాంత్ దొంగరి అన్నారు. లేటెస్ట్ పవర్ స్టోరేజ్ టెక్నాలజీతో కలిసి సోలార్ పవర్ (Solar Power) ఉపయోగించడం ద్వారా.. మేము భవిష్యత్తులో గొప్ప పురోగతిని సాధించవచ్చని ఆయన అన్నారు. అంతే కాకుండా జీరో కార్బన్ ఉద్గారాలు మా లక్ష్యం అని అన్నారు.