తిరువనంతపురం: హైదరాబాద్ నుండి కేరళ వెళ్లిన అయ్యప్ప స్వాముల బస్సు ప్రమాదానికి గురైంది. శబరిమల ఘాట్ రోడ్డులో అదుపు తప్పి బస్సు బోల్తా పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా.. స్వాములు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి శబరిమల వెళ్లిన అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా పడింది. పంబా వెళ్తున్న క్రమంలో ఘాట్ రోడ్డులో బస్సు బోల్తా పడిపోవడంతో ప్రమాదం జరిగింది. పంపా నదికి 15 కిలోమీటర్ల దూరంలో బస్సు బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 22 మంది ఉన్నారు.
ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ రాజు అక్కడికక్కడే మృతిచెందగా.. స్వాములు గాయపడ్డారు. వీరిలో ఎనిమిది మంది స్వాములు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, క్షతగాత్రులను కొట్టాయం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అయ్యప్ప స్వాములను ఉప్పర్‌గూడకు చెందిన వారిగా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment