
సాక్షి,హైదరాబాద్: తీర్థ యాత్రలో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ పాతబస్తీ ఛత్రినాక నుంచి 23 మంది కలిసి ఒక ట్రావెల్ బస్సులో తీర్థయాత్రకు వెళ్లారు. వీరు ప్రయాణిస్తున్న బస్సు ఒడిశాలోని బరంపురం సమీపంలో ప్రమాదానికి గురైంది.
హైవేపై బస్సు ట్రక్కును ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం ధ్వంసమైంది. ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు ఇద్దరు యాత్రికులు మృతి చెందారు. మృతులను ఉదయ్‌సింగ్,క్రాంతిభాయ్, ఉప్పలయ్యగా గుర్తించారు.
ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. మొత్తం 20 మంది గాయాల పాలయ్యారు. గాయపడ్డ వారందరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment