
సాక్షి,చండీగర్: డేరా బాబా దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్, ఇతర నిందితులు పవన్, ఆదిత్యా ఇన్సాన్‌లపై అంతర్జాతీయ అలర్ట్‌ను ప్రకటించినట్టు హర్యానా డీజీపీ బీఎస్ సంధూ శనివారం వెల్లడించారు. వీరిని పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేశామని చెప్పారు. అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ సింగ్‌కు వీరు సన్నిహితులు. కాగా, పోలీసులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని, విచారణ స్వతంత్రంగా సాగుతున్నదని డీజీపీ తెలిపారు.
హనీప్రీత్, పవన్ ఇన్సాన్, ఆదిత్య ఇన్సాన్‌ల ప్రైవేట్ ఆస్తులను అటాచ్ చేస్తామని చెప్పారు. డేరా చీఫ్‌ను రేప్ కేసులో దోషిగా నిర్థారించిన అనంతరం చెలరేగిన అల్లర్లపై విచారణ సరైన దిశలో సాగుతున్నదన్నారు.