తొవ్వేకొద్ది గుర్మీత్ బాబా పాపాల పుట్ట పగులుతోంది. డేరా సచ్చా సౌదా పేరుతో తనకంటూ ప్రత్యేక ప్రపంచాన్ని తయారు చేసుకున్న గుర్మీత్ బాగోతాలు ఒక్కొక్కటీ వెలుగుచూస్తున్నాయి. ప్లాస్టిక్ కరెన్సీ, ప్రపంచ వింతల నమూనాలు, సినిమా షూటింగ్ కోసం ప్రత్యేక సెట్‌లు, ప్రత్యేక ఆయుధ కారాగారం, ఇలా అన్నీ ఏర్పాటు చేసుకున్నాడు.