కోహ్లీ-గుర్మిత్.. ఓ స్పెషల్ బంధం
సాక్షి, న్యూఢిల్లీ: డేరా సచ్ఛా సౌదా నేత గుర్మిత్ రామ్ రహీం సింగ్ అనుచరులు ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో అలజడిని సృష్టిస్తున్నారు. అత్యాచార కేసులో ఆయన్ని దోషిగా సీబీఐ కోర్టు తీర్పు వెలువరించిన మరుక్షణం నుంచే హింసను రాజేస్తున్నారు. హింసాత్మక ఘటనలతో పంజాబ్, హర్యానాలు అట్టుడికిపోతున్నాయి. ఇంకోవైపు సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ హల్ చల్ చేస్తోంది.
అయితే గుర్మిత్ పరమ భక్తుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఒకరనే విషయం చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. కోహ్లీ సక్సెస్ సీక్రెట్ తానేనని గతంలో చాలాసార్లు గుర‍్మిత్ స్వయంగా చెప్పుకున్నారు. నిరంతర సాధన చేయాలని సూచించటంతోనే కోహ్లీ ఈస్థాయిలో ఉన్నాడంటూ గతేడాది ఓ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. అంతేకాదు స్టార్ బాక్సర్ విజయేందర్ సింగ్ ప్రపంచ స్థాయి బాక్సర్ అయ్యేందుకు కూడా తానే కారణమంటూ ప్రకటించుకున్నారు కూడా. ఇక ఇప్పుడు గుర్మిత్ లైంగికదాడి కేసులో అరెస్టయ్యాక ఆ పాత వీడియోను దులిపి వైరల్ చేస్తున్నారు.
కోహ్లీ, అశిష్ నెహ్రా మరియు విజయ్ దహియాలు అందులో తనకు తాను దైవంగా చెప్పుకునే గుర్మిత్ ను కొలుస్తున్నట్లు అందులో ఉంది. ప్రత్యేకంగా మోకాళ్ల మీద వినయంగా కూర్చుని ఆశీర్వాదం తీసుకున్నాడు కోహ్లీ. వీడియో పాతదే అయినా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వీడియోతో ట్రోల్ చేసేస్తున్నారు.