డేరాలో ప్రత్యేక కరెన్సీ
Published Sun, Aug 27 2017 4:12 PM | Last Updated on Tue, Sep 12 2017 1:07 AM
సిర్సాః డేరా సచా సౌథా ప్రధాన కార్యాలయంలో గుర్మీత్ సింగ్ అనుచరులు ఏకంగా ప్రత్యేక కరెన్సీని రూపొందించుకున్నారు. వేయిఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దుకాణాలు, సంస్థల్లో చిల్లర కొరతను అథిగమించేందుకు రూ 10, రూ5 ప్లాస్టిక కాయిన్లు, టోకెన్లను కస్టమర్లకు ఇస్తున్నారు. వీటిపై ధన్‌ధన్ సద్గురు...డేరా సచా సౌథా సిర్సా అని రాసి ఉంటుంది. ఈ టోకెన్లు, కాయిన్లను కస్టమర్లు సచ్ షాపుల్లో చూపించి తర్వాత తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉదాహరణకు ఓ కస్టమర్ రూ 70 విలువైన ఏదైనా వస్తువును కొనుగోలు చేసి షాపు ఓనర్‌కు రూ 100 ఇస్తే మిగిలిన రూ 30కి మూడు పది రూపాయల విలువైన ప్లాస్టిక టోకెన్లను ఇస్తారు. ఈ ప్లాస్టిక్ కాయిన్లకు భిన్న రంగుల కోడ్‌ను షాపు ఓనర్లు మెయింటైన్ చేస్తున్నారు.
డేరా చీఫ్ గుర్మీత్‌ను రేప్ కేసులో సీబీఐ కోర్టు దోషిగా తేచ్చిన క్రమంలో డేరా క్యాంపస్‌ను సందర్శించేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులకూ భారత కరెన్సీ స్థానంలో ప్లాస్టిక్ కాయిన్స్ ఇవ్వడం గమనార్హం. మరోవైపు డేరా ప్రాంగణాన్ని సైన్యం స్వాధీనం చేసుకోవడంతో గతంలో తనకు ఇచ్చిన రూ 10 విలువైన ఇలాంటి మూడు కాయిన్లను ఉపయోగించలేకపోతున్నానని సమీప బెగూ గ్రామానికి చెందిన ముఖేష్ కుమార్ పేర్కొన్నారు.
Advertisement