Gurmeet
-
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ నటి
రామాయణం సీరియల్ నటి దెబీనా బొనర్జీ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె భర్త, నటుడు గుర్మీత్ చౌదరి తెలిపారు. రెండోసారి పేరెంట్స్‌గా ప్రమోట్ అయినందుకు సంతోషంగా ఉందని, అందరి ప్రేమాభిమానాలు, ఆశీస్సులు కావాలంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. కాగా ‘అమ్మాయిలు అబ్బాయిలు’ అనే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన డెబీనా ఆతర్వాత రెండు, మూడు సినిమాల్లోనూ నటించింది. కానీ వెండితెరపై కంటే బుల్లితెరపైనే ఎక్కువగా గుర్తింపు పొందింది. రామాయణం సీరియల్‌తో మరింత పాపులర్ అయిన డెబీనా ఈ సీరియల్లో రాముడిగా నటించిన గుర్మీత్ చౌదరినే 2011లో పెళ్లాడింది. ఈ ఏడాది మొదటి బిడ్డకు జన్మనిచ్చిన డెబీనా తాజాగా రెండోసారి బేబీ గర్ల్‌కు జన్మనిచ్చింది. దీనికి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ను షేర్ చేయడంతో పలువురు సెలబ్రిటీలు సహా నెటిజన్లు ఈ జంటకు శుభాకంక్షలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Gurmeet Choudhary (@guruchoudhary) -
డేరాలో ప్రత్యేక కరెన్సీ
సిర్సాః డేరా సచా సౌథా ప్రధాన కార్యాలయంలో గుర్మీత్ సింగ్ అనుచరులు ఏకంగా ప్రత్యేక కరెన్సీని రూపొందించుకున్నారు. వేయిఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దుకాణాలు, సంస్థల్లో చిల్లర కొరతను అథిగమించేందుకు రూ 10, రూ5 ప్లాస్టిక కాయిన్లు, టోకెన్లను కస్టమర్లకు ఇస్తున్నారు. వీటిపై ధన్‌ధన్ సద్గురు...డేరా సచా సౌథా సిర్సా అని రాసి ఉంటుంది. ఈ టోకెన్లు, కాయిన్లను కస్టమర్లు సచ్ షాపుల్లో చూపించి తర్వాత తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉదాహరణకు ఓ కస్టమర్ రూ 70 విలువైన ఏదైనా వస్తువును కొనుగోలు చేసి షాపు ఓనర్‌కు రూ 100 ఇస్తే మిగిలిన రూ 30కి మూడు పది రూపాయల విలువైన ప్లాస్టిక టోకెన్లను ఇస్తారు. ఈ ప్లాస్టిక్ కాయిన్లకు భిన్న రంగుల కోడ్‌ను షాపు ఓనర్లు మెయింటైన్ చేస్తున్నారు. డేరా చీఫ్ గుర్మీత్‌ను రేప్ కేసులో సీబీఐ కోర్టు దోషిగా తేచ్చిన క్రమంలో డేరా క్యాంపస్‌ను సందర్శించేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులకూ భారత కరెన్సీ స్థానంలో ప్లాస్టిక్ కాయిన్స్ ఇవ్వడం గమనార్హం. మరోవైపు డేరా ప్రాంగణాన్ని సైన్యం స్వాధీనం చేసుకోవడంతో గతంలో తనకు ఇచ్చిన రూ 10 విలువైన ఇలాంటి మూడు కాయిన్లను ఉపయోగించలేకపోతున్నానని సమీప బెగూ గ్రామానికి చెందిన ముఖేష్ కుమార్ పేర్కొన్నారు. -
అక్టోబర్ 1న ఎంఎస్‌జీ-2
ఎంఎస్‌జీ (మెసెంజర్ ఆఫ్ గాడ్) గత ఏడాది వివాదాలకు గురై సంచలనం సృష్టించిన బాలీవుడ్ చిత్రం ఇది. ఎట్టకేలకు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రానికి గుర్మీత్ హీరో, దర్శకుడు. ఈయన పూర్తి పేరు సెయింట్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ జీ ఇసాన్ జీతూ ఆరోరా ఇసాన్. ఇకపోతే సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న కాలం ఇది. గుర్మీత్ ఎంఎస్‌జీ-2 పేరుతో సీక్వెల్ చిత్రం చేశారు. ఈ చిత్రానికి కథానాయకుడు, దర్శకుడు మాత్రమే కాకుండా సంగీతం, ఎడిటింగ్ అంటూ అదనపు బాధ్యతల్ని కూడా తన భుజస్కంధాలపైనే మోశారు. హకీకట్ ఎంటర్టెయిన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో ఎంఎస్‌జీ చిత్రం కంటే గ్రాఫిక్ సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలు బ్రహ్మాండంగా ఉంటాయంటున్నారు చిత్ర యూనిట్. ఈ నెల 18న హిందీలో విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న ఎంఎస్‌జీ-2 చిత్రాన్ని అక్టోబర్1న తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.