అక్టోబర్ 1న ఎంఎస్‌జీ-2 | MSG - 2 on October 1 | Sakshi
Sakshi News home page

అక్టోబర్ 1న ఎంఎస్‌జీ-2

Published Wed, Sep 30 2015 2:36 AM | Last Updated on Sun, Sep 3 2017 10:11 AM

అక్టోబర్ 1న ఎంఎస్‌జీ-2

అక్టోబర్ 1న ఎంఎస్‌జీ-2

ఎంఎస్‌జీ (మెసెంజర్ ఆఫ్ గాడ్) గత ఏడాది వివాదాలకు గురై సంచలనం సృష్టించిన బాలీవుడ్ చిత్రం ఇది. ఎట్టకేలకు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రానికి గుర్మీత్ హీరో, దర్శకుడు. ఈయన పూర్తి పేరు సెయింట్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ జీ ఇసాన్ జీతూ ఆరోరా ఇసాన్. ఇకపోతే సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న కాలం ఇది. గుర్మీత్ ఎంఎస్‌జీ-2 పేరుతో సీక్వెల్ చిత్రం చేశారు. ఈ చిత్రానికి కథానాయకుడు, దర్శకుడు మాత్రమే కాకుండా సంగీతం, ఎడిటింగ్ అంటూ అదనపు బాధ్యతల్ని కూడా తన భుజస్కంధాలపైనే మోశారు.

హకీకట్ ఎంటర్‌టెయిన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో ఎంఎస్‌జీ చిత్రం కంటే గ్రాఫిక్ సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలు బ్రహ్మాండంగా ఉంటాయంటున్నారు చిత్ర యూనిట్. ఈ నెల 18న హిందీలో విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న ఎంఎస్‌జీ-2 చిత్రాన్ని అక్టోబర్1న తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement