Messenger of God
-
అక్టోబర్ 1న ఎంఎస్‌జీ-2
ఎంఎస్‌జీ (మెసెంజర్ ఆఫ్ గాడ్) గత ఏడాది వివాదాలకు గురై సంచలనం సృష్టించిన బాలీవుడ్ చిత్రం ఇది. ఎట్టకేలకు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రానికి గుర్మీత్ హీరో, దర్శకుడు. ఈయన పూర్తి పేరు సెయింట్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ జీ ఇసాన్ జీతూ ఆరోరా ఇసాన్. ఇకపోతే సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న కాలం ఇది. గుర్మీత్ ఎంఎస్‌జీ-2 పేరుతో సీక్వెల్ చిత్రం చేశారు. ఈ చిత్రానికి కథానాయకుడు, దర్శకుడు మాత్రమే కాకుండా సంగీతం, ఎడిటింగ్ అంటూ అదనపు బాధ్యతల్ని కూడా తన భుజస్కంధాలపైనే మోశారు. హకీకట్ ఎంటర్టెయిన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో ఎంఎస్‌జీ చిత్రం కంటే గ్రాఫిక్ సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలు బ్రహ్మాండంగా ఉంటాయంటున్నారు చిత్ర యూనిట్. ఈ నెల 18న హిందీలో విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న ఎంఎస్‌జీ-2 చిత్రాన్ని అక్టోబర్1న తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. -
రాంగోపాల్ వర్మకు నోటీసులు
హైదరాబాద్ : దర్శక, నిర్మాత రాంగోపాల్ వర్మపై ఉత్తరప్రదేశ్‌లోని లుధియానాలో కేసు నమోదు అయ్యింది. ఫిబ్రవరి 13న 'మెసెంజర్ ఆఫ్ గాడ్' సినిమాపై వర్మ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. వర్మ వివాదాస్పద ట్విట్లపై డేరా అనుచరుడు లుధియానా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు బుధవారం వర్మపై సెక్షన్ 66A కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఇద్దరు పోలీసులు... వర్మకు నోటీసులు అందించేందుకు ముంబయి చేరుకున్నారు. డేరా సచ్చా సౌద అధినేత గుర్మిత్‌రామ్ రహీం సింగ్ అలియాస్ డేరా బాబాను వర్మ 'గాడిద'గా అభివర్ణించిన విషయం తెలిసిందే. అలాగే క్లాస్ బ్రీడ్ అంటూ వివాదాస్పద పదజాలం వాడుతూ ట్వీట్ చేశారు. మరోవైపు సెక్షన్ 66Aను సోమవారం సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్మపై లుధియానా పోలీసులు పెట్టిన కేసు ఎంతవరకూ నిలుస్తుందో వేచి చూడాలి. Ram Rahim of MSG is a hybrid cross between an illusional Salman Khan,/Rajnikant and a delusional Saint/satan and a very real ass — Ram Gopal Varma (@RGVzoomin) February 13, 2015 Ram Rahim of MSG is an Ass but I don't mean Ass in a figurative nor literal way..nd if anyone doesn't understand this he's an Ass — Ram Gopal Varma (@RGVzoomin) February 13, 2015 -
విమర్శల చిత్రం విడుదలకు సిద్ధం
తమిళసినిమా: ఇటీవల పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొని కలకలం పుట్టించిన హిందీ చిత్రం మెసెంజర్ ఆఫ్ గాడ్ ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రం సెన్సార్ వ్యవహారంలో కేంద్ర సెన్సార్ బోర్డు చైర్మన్‌తో సహా 9మంది సభ్యులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. నటుడు గుమిత్ రామ్ రహీం సింగ్ హీరోగా నటించి సంగీతం, దర్శకత్వం బాధ్యతలు నిర్వహించిన ఈ చిత్రాన్ని హకిత్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మించింది. ఈ చిత్రాన్ని త్వరలో ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర దర్శక హీరో గుమిత్ రామ్ రహీం సింగ్ బుధవారం మద్యాహ్నం చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెప్పారు. యువతను దృష్టిలో పెట్టుకుని మెసెంజర్ ఆఫ్ గాడ్‌ను రూపొందించిన కథా చిత్రం అని అన్నారు. చిత్ర వివాదాంశం గురించి మాట్లాడుతూ ఇందులో ఏ మతాన్నీ కించపరిచే విధంగా సన్నివేశాలను పొందుపరచలేదన్నారు. అయితే కొందరు ముంబయి సిటీ సివిల్ కోర్టులో చిత్రానికి వ్యతిరేకంగా పిటీషన్‌దాఖలు చేశారని తరువాత ఆ కేసు హైకోర్టు సుప్రీంకోర్టు అంటూ విచారణకు వెళ్లడంతో సంచలనం అయ్యిందన్నారు. సుప్రీం కోర్టు చిన్న చిన్న కట్స్‌తో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు. చిత్రాన్ని అతి తక్కువ వ్యయంతో కేవలం 67 రోజుల్లోనే చిత్రీకరించినట్లు తెలిపారు. దీన్ని త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు గుమిత్రామ్ రహీం సింగ్ వెల్లడించారు. -
‘మెసెంజర్ ఆఫ్ గాడ్’పై చిచ్చు
* ఈ చిత్రానికి కేంద్రం అనుమతిపై * సెన్సార్ బోర్డులో రాజీనామాల పర్వం * ఒకే రోజు 9 మంది బోర్డు సభ్యుల రాజీనామా * రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డ కేంద్ర మంత్రి జైట్లీ * సినిమా ప్రదర్శనపై పంజాబ్ ప్రభుత్వం నిషేధం న్యూఢిల్లీ: డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌సింగ్ నటించిన వివాదాస్పద చిత్రం ‘మెసెంజర్ ఆఫ్ గాడ్’ విడుదల వ్యవహారంపై తలెత్తిన వివాదం రాజకీయరంగు పులుముకుంది. వివాదాస్పద అంశాలున్నాయన్న కారణంతో ఈ చిత్రం విడుదలకు తాము అనుమతి నిరాకరించినా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఫిలిం సర్టిఫికేషన్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎఫ్‌సీఏటీ) అనుమతించడంపై సెన్సార్ బోర్డు సభ్యులు రాజీనామాలపర్వానికి తెర లేపారు. కేంద్రం జోక్యంతో కలత చెంది బోర్డు చైర్పర్సన్ లీలా శాంసన్ గురువారం తన పదవికి రాజీనామా చేయగా ఆమెకు మద్దతుగా 9 మంది సభ్యులు శనివారం మూకుమ్మడి రాజీనామాలు చేశారు. సెన్సార్ బోర్డుపట్ల కేంద్ర వైఖరి నచ్చక బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు అరుంధతి నాగ్, ఐరా భాస్కర్, లోరా ప్రభు, పంకజ్ శర్మ, రాజీవ్ మసంద్, శేఖర్‌బాబు కంచెర్ల, షాజీ కరుణ్, శుభ్రా గుప్తా, టి.జి. త్యాగరాజన్‌లు కేంద్ర సమాచార, ప్రసారశాఖకు పంపిన ఉమ్మడి రాజీనామా లేఖలో పేర్కొన్నారు. దీంతో చైర్పర్సన్ సహా మొత్తం 24 మందిగల సెన్సార్ బోర్డు సభ్యుల సంఖ్య 14కు పడిపోయింది. మరికొందరు సభ్యులు కూడా రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మరోవైపు బోర్డు సభ్యుల తీరును కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ శనివారం తీవ్రంగా తప్పుబట్టారు. యూపీఏ హయాంలో నియమితులైన సభ్యులంతా మెసెంజర్ ఆఫ్ గాడ్ చిత్రానికి ఎఫ్‌సీఏటీ ఇచ్చిన అనుమతి వ్యవహారంతోపాటు రాజీనామాలపె రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు ఫేస్బుక్లో ‘రెబెల్స్ వితౌట్ ఎ కాజ్’ పేరిట ఆర్టికల్ పోస్ట్ చేశారు. సెన్సార్ బోర్డు నిర్ణయం నచ్చకుంటే ఎఫ్‌సీఏటీని ఆశ్రమించే హక్కు చట్టప్రకారం బాధిత నిర్మాతకు ఉంటుందని ఆయన గుర్తు చేశారు. సెన్సార్ బోర్డు నిర్ణయంతో ట్రిబ్యునల్ విభేదిస్తే అది బోర్డు స్వయంప్రతిపత్తిపై దాడి ఎలా అవుతుందని జైట్లీ ప్రశ్నించారు. ఇప్పటివరకూ తనతోపాటు సహాయ మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ సెన్సార్ బోర్డు వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. బోర్డులో అవినీతిపై లీలా శాంసన్ చేసిన ఆరోపణలపై జైట్లీ స్పందిస్తూ దీనిపై శాంసన్ ఒక్కసారి కూడా తనకు ఫిర్యాదు చేయలేదని...అయినా సెన్సార్ బోర్డులో అవినీతి ఉంటే అందుకు బోర్డు సభ్యులు తమను తామే నిందించుకోవాలన్నారు. కేంద్రం నిధులు మంజూరు చేయకపోవడం వల్లే గత 9 నెలల్లో బోర్డు ఒక్కసారి కూడా సమావేశం కాలేకపోయిందన్న శాంసన్ ఆరోపణలను కూడా జైట్లీ తోసిపుచ్చారు. తమ శాఖ నిధులు విడుదల చేసినా సెన్సార్ బోర్డు ఆ నిధులను ఖర్చు చేయకుండా వెనక్కి పంపిందని జైట్లీ పేర్కొన్నారు. బోర్డు సమావేశాలను నిర్వహించకుండా పనిచేయనందుకు శాంసన్ తనను తాను నిందించుకోవాలని విమర్శించారు. ప్రముఖ నటుడు అనుపమ్‌ఖేర్ నేతృత్వంలోని గత సెన్సార్ బోర్డును 2004లో ఏర్పడిన యూపీఏ ప్రభుత్వం రాజకీయ కారణాలతో రద్దు చేసినా తమ ప్రభుత్వం మాత్రం అటువంటి పని చేయలేదని జైట్లీ తెలిపారు. ప్రదర్శనకు పంజాబ్ సర్కార్ నో... రాష్ట్రంలో శాంతిభద్రతలు, ప్రజల మత విశ్వాసాలు దెబ్బతినరాదనే కారణాల దృష్ట్యా ఆదివారం విడుదల కావాల్సిన ‘మెసెంజర్ ఆఫ్ గాడ్’ ప్రదర్శనను ఆపేయాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించింది. సినిమా హాళ్లు సహా బహిరంగ, ప్రైవేటు ప్రదర్శనలకూ నిషేధం వర్తిస్తుందని ప్రకటించింది. చిత్రం ప్రదర్శనకు అనుమతిస్తే శాంతిభద్రతలకు భంగం వాటిల్లవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికలతో ఈ చర్య చేపట్టినట్లు పంజాబ్ ముఖ్యమంత్రి సలహాదారు హర్చరణ్ బైన్స్ తెలిపారు. ఈ చిత్రం తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ పలు సిక్కుల సంఘాలతోపాటు శిరోమణి అకాలీదళ్, ఐఎన్ఎల్డీ వంటి రాజకీయ పార్టీలు శనివారం పంజాబ్, హరియాణా, ఢిల్లీలలో నిరసనలకు దిగడం తెలిసిందే. ‘యూపీఏ వర్సెస్ ఎన్డీఏగా..’ సెన్సార్ బోర్డుతో నెలకొన్న సమస్యలను మోదీ సర్కారు... ఎన్డీఏ, యూపీఏ మధ్య రాజకీయ అంశంగా మారుస్తోందని కాంగ్రెస్ నేత, కేంద్ర సమాచార, ప్రసారశాఖ మాజీ మంత్రి మనీశ్ తివారీ విమర్శించారు. ఈ పరిణామాన్ని కేంద్రం రాజకీయం చేయాలనుకోవడం దురదృష్టకర, విచారకరమన్నారు. రాజకీయ కారణాలతోనే ప్రస్తుత సెన్సార్ బోర్డులో నియామకాలు జరిగాయని ప్రభుత్వం ఒకవేళ భావిస్తే గత ఎనిమిది నెలల్లోనే బోర్డు సభ్యులపై ఎందుకు వేటు వేయలేదని ప్రశ్నించారు. సినిమాలో ఏముంది..? ‘ద మెసెంజర్ ఆఫ్ గాడ్(దేవ దూత)’. కథ విషయానికి వస్తే.. పెద్ద సంఖ్యలో భక్తులు, అనుచరులు ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక నేత గురూజీ ఈ సినిమాలో హీరో. డ్రగ్స్, లింగ వివక్ష, మద్యపానం, వ్యభిచారం వంటి సామాజిక రుగ్మతలు రూపుమాపి, యువతను ఉద్ధరిస్తానంటూ గురూజీ సవాల్‌ను స్వీకరిస్తాడు. అయితే, సమాజానికి మంచి చేయడం సహించలేని కొందరు గురూజీని చంపేందుకు కుట్రలు పన్నడం, వాటిని గురూజీ ఎదుర్కోవడం. స్థూలంగా ఇదీ కథ. అయితే, ఈ సినిమా ద్వారా గుర్మీత్ సింగ్ తనను తాను దేవుడిగా చిత్రీకరించుకున్నట్లుగా ఉందని సెన్సార్ బోర్డు సభ్యులు భావించినట్లు సమాచారం. చిత్రంలో తర్కవిరుద్ధమైన గురూజీ లీలలపైనా అభ్యంతరాలు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు.. డేరా వర్గానికి, సిక్కు సంస్థలు దళ్ ఖల్సా, శిరోమణి అకాలీదళ్‌లకు ఎప్పుడూ పొసగని కారణంగా కూడా ఈ సినిమాపై వ్యతిరేకత, నిరసనలు పెరగడానికి దారితీసింది. -
కొనసాగుతున్న రాజీనామాల పరంపర
సెన్సార్ బోర్డు సభ్యుల రాజీనామాల పరంపర కొనసాగుతోంది. 'మెసెంజర్ ఆఫ్ గాడ్' సినిమా సర్టిఫికేషన్ క్లియరెన్స్ నేపథ్యంలో సెన్సార్ బోర్డులో చోటుచేసుకున్న నాటకీయ పరిణామాలతో బోర్డు సభ్యులు 9 మంది శనివారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖకి సమర్పించారు. భాస్కర్, లోరా ప్రభు, పంకజ్ శర్మ, టీజీ త్యాగరాజన్, మమంగ్ దాయ్, సుబ్రాగుప్త, రాజీవ్ మసంద్లతో పాటు మరో ఇద్దరు సభ్యులు రాజీనామా లేఖలు పంపారు. బోర్డు చైర్మన్ లీలా శాంసన్ శుక్రవారం తన రాజీనామా ఇచ్చిన విషయం తెలిసిందే. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ హీరోగా నటించిన 'మెసెంజర్ ఆఫ్ గాడ్'పై ఎటువంటి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ, అధికారం లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె తన లేఖలో వివరించారు. మంత్రిత్వ శాఖ చోక్యం, అవినీతి మూలంగానే రాజీనామాలు చేయాల్సి వచ్చిందని చైర్మన్, సభ్యుల వాదన. సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ నుంచి ఎటువంటి నిధులు కానీ, మద్ధతు ఉండేది కాదని లేఖలలో పేర్కొన్నారు. ఏ ఒక్క నిర్ణయం తమకు అనుకూలంగా తీసుకోలేదని ఆ శాఖ తీరుని వెల్లడించారు. కాగా ఈ పరిణామాలపై రాజవర్థన్ సింగ్ రాథోడ్ స్పందిస్తూ సినిమాల సర్టిఫికేషన్ విషయంలో ప్రభుత్వం జోక్యం ఉండదని, ఆవిషయాలకు తాము ఎప్పుడూ దూరంగా ఉంటామని అన్నారు. -
మంత్రుల జోక్యం నచ్చకే.. లీలా శాంసన్
న్యూఢిల్లీ: గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కీలకపాత్ర పోషించిన వివాదాస్పద చిత్రం 'మెస్సెంజర్ ఆఫ్ గాడ్'కి సెన్సార్ బోర్డు సర్టిఫికేషన్ ఇచ్చింది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ఎక్కడా వెల్లడించలేదు. సినిమా ధ్రువీకరణ అప్పీళ్ల ట్రిబ్యునల్, సెన్సార్ బోర్డు చీఫ్ లీలా శాంసన్ ఈ క్లియరెన్స్ నేపథ్యంలో రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకి తెలిపినట్లు ఆమె చెప్పారు. సినిమాల సర్టిఫికేషన్ విషయాల్లో మంత్రుల జోక్యం చేసుకోవడం నచ్చని కారణంగా లీలా శాంసన్ తన పదవికి రాజీనామా చేశారు. 'మెస్సెంజర్ ఆఫ్ గాడ్' శుక్రవారం రోజు విడుదల కావాల్సి ఉంది. కాగా సెన్సార్ బోర్డు క్లియరెన్స్ విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. బోర్డు విషయాల్లో మంత్రులు జోక్యం చేసుకోవడం హాస్యాస్పదంగా మారిందని లీలా అన్నారు. మంత్రిత్వశాఖ నియమించిన ప్యానెల్ సభ్యులు, అధికారుల అవినీతి, జోక్యం కారణంగా రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. గత తొమ్మిది నెలలుగా మంత్రిత్వశాఖ మాకు నిధులు ఇవ్వకపోగా, బోర్డు సమావేశాలకు అనుమతివ్వలేదని లీలా చెప్పారు. తన రాజీనామాపై వెనక్కి తగ్గేది లేదని ఆమె స్పష్టం చేశారు.