
టోక్యో(జపాన్) : ఒక మనిషిని హత్య చేయడానికే చాలా ధైర్యం ఉండాలి. అలాంటిది హత్య చేసి ఆ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన జపాన్‌లో చోటుచేసుకుంది. ‘మొదటిసారి హత్య చేసి ఆ డెడ్ బాడీని ముక్కలుగా నరకటానికి మూడు రోజులు పట్టింది... రెండోసారి మాత్రం ఒక్కరోజులో పని పూర్తయింది.’ ఓ యువకుడు పోలీసుల విచారణలో ఈ విషయాన్ని చెప్పాడు. జపాన్‌లో ఓ యువకుడు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా తొమ్మిదిమంది దారుణంగా హత్య చేశాడు.
నేరాలు అతి తక్కువగా జరిగే జపాన్‌లో అతడు దారుణహత్యలకు పాల్పడ్డాడు. అంతటితో అగకుండా ఆ మృతదేహాలను ముక్కలుగా నరికి తన అపార్టుమెంట్ ఫ్లాట్లో పడేశాడు. తకహీరో షయిరాయిషి(27) అనే వ్యక్తి బాలికలను, మహిళలను మాయమాటలు చెప్పి తన అపార్టుమెంట్‌కు రప్పించుకుని లైంగికదాడికి పాల్పడేవాడు. వారి వద్ద ఉన్న డబ్బు, ఇతర విలువైన వస్తువులు లాక్కునేవాడు. అనంతరం చంపేసి వారి తల, మొండెం, కాళ్లు, చేతులు.. శరీర భాగాలన్నీ ముక్కలుగా నరికిపడేసేవాడు.
ఈ ఏడాది ఆగస్టు నుంచి ఈ దారుణమారణకాండకు పాల్పడుతున్నాడు. అతని బారిన పడిన వారిలో ఎనిమిది మంది యువతులు, ఒక పురుషుడు ఉన్నారు. హతుల్లో ఒక యువతి తన బాయ్ ఫ్రెండ్ ను వెంటబెట్టుకుని అక్కడికి రాగా తకహిరో అతడి ఉసురు కూగా తీసుకున్నాడు. మహిళల అదృశ్యంపై ఫిర్యాదులు అందటంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి రూంలో తలలు, చేతులు, మిగతా, శరీర భాగాలు ఎక్కడపడితే అక్కడ విసిరేసినట్లుగా పడి ఉన్నాయని పోలీసులు చెప్పారు. అంతేకాక దాదాపు 240 ఎముకలు లభ్యమయ్యాయని వారు తెలిపారు. శరీర భాగాలను డీఎన్ఏ టెస్టుకు పంపి మృతులను గుర్తించినట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment