
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సంచలన ఉదంతం చోటుచేసుకుంది. రంగపురి ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. తండ్రే కూతుళ్లను హత్య చేసి, ఆపై తాను విషం తాగి, ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఈ ఘటనలో సల్ఫా మాత్రలు తాగి తండ్రి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నలుగురు కూతుళ్లలో ఒక కుమార్తె అంధురాలు. మరో కుమార్తె కూడా అంగవైకల్యంతో బాధపడుతోంది. సంఘటనా స్థలంలో సల్ఫేట్ సాచెట్లను పోలీసులు గుర్తించారు. ఒక గదిలోని డబుల్ బెడ్‌పై కుమార్తెల మృతదేహాలు పడి ఉండగా, రెండో గదిలో తండ్రి మృతదేహం లభ్యమైంది. అయిదుగురి నోటి నుండి తెల్లటి నురగ వచ్చినట్లు కనిపిస్తోంది. వీరందరి మెడకు ఎర్రటి దారం కట్టివుంది.
ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ ఇంటి యజమాని, తండ్రి హీరాలాల్(50) కార్పెంటర్‌గా పనిచేస్తుండగా, ఏడాది క్రితం అతని భార్య క్యాన్సర్‌తో మృతిచెందింది. ఈ నెల 24 నుంచి ఇంటి తలుపులు లోపలి నుంచి తాళం వేసి ఉన్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఇంటి తాళం పగులగొట్టగా, వారికి లోపల ఐదు మృతదేహాలు కనిపించాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: భవనంపై నుంచి దూకి మహిళ ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment