గుర్తు తెలియని 5వేల మృతదేహాలు
సాక్షి, కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో గుర్తు తెలియని మృతదేహాలు సంఖ్య పెరిగిపోతోంది. తాజా రిపోర్టుల ప్రకారం 2016లో ఒక్క పశ్చిమ బెంగాల్‌లోనే సుమారు 5వేల గుర్తింపులేని మృతదేహాలు ఉన్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) తెలిపింది. ఇందులో అధికంగా రాజధాని కోల్‌కతా పరిసర ప్రాంతాల్లో జరిగిన పలు సంఘటనలు, ప్రమాదాల నుంచి తీసుకువచ్చినవేనని పేర్కొంది. అంతేకాకుండా వీటిలో ఎక్కువ శాతం హత్య కేసులే ఎక్కువగా ఉండటం విశేషం, వీటి ద్వారా రాష్ట్రంలో మర్డర్ కేసులు పెరిగిపోతున్నాయని ఎన్‌సీఆర్‌బీ ఆందోళన వ్యక్తం చేసింది. తాజా లెక్కల ప్రకారం మహారాష్ట్ర, తమిళనాడులు మొదటి స్థానాల్లో ఉన్నాయి.
రికవరీ చేసిన మృత దేహాల్లో ఎక్కువ శాతం రైలు పట్టాలు, నదీ తీరాల్లో దొరికినవే. వీటి మీద ఎవరూ ఫిర్యాదు చేయకపోవడం, ఎక్కువ గుర్తు తెలియని మృతదేహాల సంఖ్య పెరగిపోతోందని, అంతేకాకుండ మరిన్ని కేసుల్లో అసంపూర్తి సమాచారం ఉండటంతో కేసులను విచారించడంలో ఆలస్యమౌతోందని పోలీసు వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కోసం టెక్నాలజీనీ అభివృద్ధి పరిచినప్పటికి ఈ సమస్య ప్రభుత్వానికి సవాలుగా మారింది.
దీంతో ఈ సమస్యను అధిగమించేందుకు పోలీసులు సరికొత్త పద్దతిని అనుసస్తున్నారు. అన్ని పోలీసు స్టేషన్లలో దంతాలను భద్రపరిచే లైబ్రరీ ఏర్పాటు చేయనున్నట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వీటి ద్వారా డీఎన్‌ఏ పరీక్షల ద్వారా కేసులను పరిస్కరించే ఆలోచనల్లో పోలీసు యంత్రాంగం ఉన్నట్లు తెలిపారు.