![White Flag In Hand Pakistan Army Retrieves Body of 2 Soldiers - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/14/LOC-770x433.jpg.webp?itok=Eei1RC7X)
శ్రీనగర్: సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలకు పాల్పడటం పాక్‌కు కొత్తేమి కాదు. జమ్మూకశ్మీర్ విభజన తర్వాత పాక్ మరింత చెలరేగిపోయింది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే చాలా సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించింది. అందుకు తగ్గట్టుగానే భారీ మూల్యం చెల్లించుకుంటున్నప్పటికి తన తీరును మాత్రం మార్చుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 9,10 తేదీల్లో పీఓకేలోని హాజీపూర్ సెక్టార్ వద్ద పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించింది. అయితే ఈ దాడులను భారత సైన్యం ధీటుగా తిప్పికొట్టింది. ఈ దాడుల్లో ఇద్దరు పాక్ సైనికులు మృతి చెందారు.
వీరి శవాలను తీసుకెళ్లేందుకు పాక్ సైన్యం ప్రయత్నించినప్పటికి కుదరలేదు. దాంతో చేసేదేంలేక ఈ నెల 13న కాల్పులకు స్వస్థి పలికి.. తెల్ల జెండాలు చూపుతూ వచ్చి తమ సైనికుల మృతదేహాలను తీసుకెళ్లింది. తెల్ల జెండాలతో రావడంతో మృతదేహాలను తీసుకెళ్లడానికి భారత సైన్యం అంగీకరించింది.
Comments
Please login to add a commentAdd a comment