white flag of surrender
-
తెల్ల జెండాలతో వచ్చి శవాలను తీసుకెళ్లారు
న్యూఢిల్లీ: భారత సైన్యాన్ని కాల్పులతో ఎదుర్కోలేక పాకిస్తాన్ ఆర్మీ తెల్ల జెండాతో హాజిపిర్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖలోకి ప్రవేశించింది. భారత్–పాక్ సైన్యాల మధ్య జరిగిన కాల్పుల్లో మరణించిన తమ సైనికుల మృతదేహాలను తీసుకెళ్లేందుకు పాక్ ఆర్మీ ఈ పద్ధతిని ఎంచుకుంది. దీనికి ముందు పాక్ ఎల్ఓసీలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని విస్మరించి కాల్పులు జరిపింది. దీంతో భారత ఆర్మీ కూడా తిరిగి కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఈ నెల 10న పాక్ సైనికుడు గులాం రసూల్ మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు పాక్ తిరిగి కాల్పులు జరుపుతూ చొరబడాలని ప్రయత్నించింది. భారత సైన్యం తిరిగి కాల్పులు జరపడంతో మరో సైనికుడు మృతిచెందాడు. దీంతో రెండు రోజుల తర్వాత పాక్ సైన్యం తెల్ల జెండాతో ముందుకొచ్చింది. తెల్ల జెండా పట్టుకొని ఉంటే కాల్పులు జరపబోమని సంకేతం. ఈ జెండాతో మరణించిన తమ సైనికుల మృతదేహాలను తీసుకెళ్లింది. మరణించిన ఇద్దరినీ పంజాబ్‌కు చెందిన ముస్లింలుగా భావిస్తున్నారు. జూలై 30–31న కీరన్ సెక్టార్లో జరిగిన కాల్పుల్లో దాదాపు ఏడు మంది పాక్ సైనికులు మరణించినప్పటికీ, పాక్ వారి మృతదేహాలను తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు. బహుశా వారు కశ్మీర్ నేపథ్యం ఉన్నవారుగానీ, పాకిస్తాన్‌లోని ఉత్తర లైట్ ఇన్ఫాంట్రీకి చెందిన వారు అయి ఉండవచ్చని ఆర్మీ వర్గాలు తెలిపాయి. కేవలం పంజాబీ పాకిస్తానీలు మరణిస్తేనే పాక్ ముందుకు వస్తుందని విమర్శించారు. -
తెల్ల జెండాలతో వచ్చి.. శవాలను తీసుకెళ్లారు
-
తెల్ల జెండాలతో వచ్చి.. శవాలను తీసుకెళ్లారు
శ్రీనగర్: సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలకు పాల్పడటం పాక్‌కు కొత్తేమి కాదు. జమ్మూకశ్మీర్ విభజన తర్వాత పాక్ మరింత చెలరేగిపోయింది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే చాలా సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించింది. అందుకు తగ్గట్టుగానే భారీ మూల్యం చెల్లించుకుంటున్నప్పటికి తన తీరును మాత్రం మార్చుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 9,10 తేదీల్లో పీఓకేలోని హాజీపూర్ సెక్టార్ వద్ద పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించింది. అయితే ఈ దాడులను భారత సైన్యం ధీటుగా తిప్పికొట్టింది. ఈ దాడుల్లో ఇద్దరు పాక్ సైనికులు మృతి చెందారు. వీరి శవాలను తీసుకెళ్లేందుకు పాక్ సైన్యం ప్రయత్నించినప్పటికి కుదరలేదు. దాంతో చేసేదేంలేక ఈ నెల 13న కాల్పులకు స్వస్థి పలికి.. తెల్ల జెండాలు చూపుతూ వచ్చి తమ సైనికుల మృతదేహాలను తీసుకెళ్లింది. తెల్ల జెండాలతో రావడంతో మృతదేహాలను తీసుకెళ్లడానికి భారత సైన్యం అంగీకరించింది. -
'బరాక్ ఒబామా చేతులెత్తేశారు'
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై భారత సంతతికి చెందిన లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్ధిక వ్యవస్థను గట్టెక్కించడంలో విఫలమైన ఒబామా చేతులెత్తేశారని జిందాల్ ఆరోపించారు. అర్ధిక వ్యవస్థ బలోపేతానికి పూర్తిస్థాయిలో కృషి చేయకుండా.. పరిమితమైన కార్యనిర్వహక చర్యల దృష్టిపెడుతున్నారని జిందాల్ విమర్శించారు. ప్రస్తుత ఆర్ధిక వ్యవస్థను కనీస వేతన అర్ధిక వ్యవస్థ ప్రకటించడం ఓటిమి ఒప్పుకుంటూ తెల్ల జెండాను ఎగురవేయమేనని జిందాల్ వ్యాఖ్యలు చేశారు. ఒబామాతో జరిగిన వివిధ రాష్టాల గవర్నర్ల సమావేశంలో జిందాల్ మాట్లాడుతూ.. ఉభయ పక్షాల సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. అమెరికా ఆర్ధిక వ్యవస్థ మరింత పురోగతి సాధించడానికి అవకాశముంది అనే అభిప్రాయాన్ని జిందాల్ వ్యక్తం చేశారు. ఫెడరల్ కాంట్రాక్టర్లకు గంటకు 10.10 డాలర్ల కనీస వేతనాన్ని చెల్లించాలని ఒబామా కార్యనిర్వాహక నిర్ణయం తీసుకోవడాన్ని జిందాల్ తప్పుపట్టారు. తప్పుడు నిర్ణయాలను తీసుకోవడానికి వైట్ హౌజ్ తన శక్తులను వినియోగిస్తోంది అని జిందాల్ ఆరోపించారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా రేసులో ఉన్న జిందాల్ వ్యాఖ్యలు సంచలనం రేపాయి.