సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలకు పాల్పడటం పాక్‌కు కొత్తేమి కాదు. జమ్మూకశ్మీర్ విభజన తర్వాత పాక్ మరింత చెలరేగిపోయింది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే చాలా సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించింది. అందుకు తగ్గట్టుగానే భారీ మూల్యం చెల్లించుకుంటున్నప్పటికి తన తీరును మాత్రం మార్చుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 9,10 తేదీల్లో పీఓకేలోని హాజీపూర్ సెక్టార్ వద్ద పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించింది. అయితే ఈ దాడులను భారత సైన్యం ధీటుగా తిప్పికొట్టింది. ఈ దాడుల్లో ఇద్దరు పాక్ సైనికులు మృతి చెందారు.