
సాక్షి, కడప : వైఎస్‌ఆర్ జిల్లా ఒంటిమిట్ట చెరువులో కలకలం సృష్టించిన మృతదేహాల ఆచూకీని పోలీసులు గుర్తించారు. మొత్తం ఐదు మృతదేహాలు లభించగా నలుగురు తమిళనాడులోని సేలం జిల్లా, కడు మదురైకి చెందిన మురుగేశణ్, కరియణ్ణన్, జయరాం, మురుగేశణ్‌గా గుర్తించారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పోలీసు వర్గాలు తెలిపాయి.
ఐదు మృతదేహాలకు సోమవారం రిమ్స్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. తమిళనాడు నుంచి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, మీడియా కూడా రిమ్స్‌కు చేరుకున్నారు. అయితే ఈ మరణాలపై ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ రక్షణ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఇవి ముమ్మాటికి హత్యలేనని ఆరోపించింది. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment