
పడారుపల్లి శివారులో వ్యక్తి దారుణహత్య
నెల్లూరు(క్రైమ్): ఓ గుర్తుతెలియని వ్యక్తి(35) దారుణహత్యకు గురైన ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది.
నెల్లూరు(క్రైమ్): ఓ గుర్తుతెలియని వ్యక్తి(35) దారుణహత్యకు గురైన ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. నెల్లూరు పడారుపల్లిలోని శివారులో జాతీయ రహదారికి సమీపంలో ముళ్లపొదల్లో దుర్గంధం వెదజల్లుతున్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సిటీ డీఎస్పీ పి.వెంకటనాథ్‌రెడ్డి, ఐదో నగర ఇన్‌స్పెక్టర్ ఎస్వీ రాజశేఖరరెడ్డి తమ సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
సుమారు 5.5 అడుగుల ఎత్తులో ఉన్న మృతుడు చామనఛాయ రంగులో, గడ్డంతో ఉన్నాడు. ముళ్లపొదల్లో కేవలం బనియను, డ్రా యర్‌తో ఉన్న మృతదేహాన్ని వెలికితీశారు. సమీపంలో మృతుడి ప్యాంటు, చొక్కా గుర్తించారు. గొంతు కోయడంతో పాటు ఛాతిపై ఆయుధంతో నరికిన ఆనవాళ్లు, చేతివేళ్లు తెగివున్నా యి. ఘటనా స్థలానికి కొద్దిదూరం వరకు రక్తపు మరకల ఆనవాళ్లు కనిపించాయి.
ఎక్కడో హతమార్చి..
ఘటన స్థలంలోని పరిస్థితుల ప్రకారం ఆ వ్యక్తిని ఎక్కడో హత్యచేసి జాతీయ రహదారికి సమీపంలోని ఈ ప్రాంతంలో పడేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహం దుర్వాసన వెదజల్లుతుండటంతో హత్య జరిగి రెండు రోజులైనట్లు పోలీసులు భావిస్తున్నారు. కత్తి లేదా గొడ్డలితో బలంగా నరకడం, పదునైన ఆయుధంతో గొంతుకోసి హత్యచేసి ఉంటారని పోలీసులు పేర్కొన్నారు.
హత్యచేసే సమయంలో చేతులు అడ్డం పెట్టడంతో చేతి వేళ్లు తెగి ఉంటాయని అనుమానిస్తున్నారు. పోలీసు జాగిలం మృతదేహం వద్ద నుంచి సమీపంలోని జాతీయ రహదారి వరకు వెళ్లి వెనక్కు వచ్చింది. దీనిని బట్టి ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేశారనే అనుమానం బలపడుతోంది. క్లూస్‌టీం ఘటనా స్థలంలో కొన్ని ఆధారాలు సేకరించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఐదో నగర ఇన్‌స్పెక్టర్ ఎస్వీ రాజశేఖరరెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.