న్యూఢిల్లీ :మణిపూర్ హింసలో మృతి చెంది ఎవరూ క్లెయిమ్ చేయని మృతదేహాలకు సామూహిక అంత్యక్రియలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. సుప్రీం కోర్టు అపాయింట్ చేసిన కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం మార్చురీల్లో మగ్గుతున్న 175 మృతదేహాల్లో 169 మృతదేహాల వివరాలను గుర్తిచారు. ఆరు అన్‌ఐడెంటిఫైడ్‌గా మిగిలిపోయాయి.169 గుర్తించిన మృతదేహాల్లో 81 బాడీలను కుటుంబ సభ్యులు క్లెయిమ్ చేయగా 88 ఎవరూ క్లెయిమ్ చేయలేదు.
మార్చురీల్లో మగ్గిపోతున్న మృతదేహాల పరిస్థితిపై సుప్రీంకోర్టుకు కమిటీ నివేదక ఇచ్చింది.దీనిపై సీజేఐ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని బెంచ్ విచారణ జరిపింది.క్లెయిమ్ చేయని మృతదేహాలను మార్చురీలో నిరవధికంగా ఉంచడం సరికాదని అభిప్రాయపడింది.
మృతదేహాలను ఖననం లేదా దహనం చేయడానికిగాను మణిపూర్ ప్రభుత్వం 9 ప్రదేశాలను ఎంపిక చేసిందని కోర్టు తెలిపింది.క్లెయిమ్ చేసిన మృతదేహాలకు సంబంధించి అంత్యకక్రియలను వారి బంధువులు ఈ 9 ప్రదేశాల్లో ఎక్కడైనా చేసుకోవచ్చని పేర్కొంది.ఇక గుర్తించి క్లెయిమ్ చేయని మృతదేహాల అంత్యక్రియల సమాచారాన్ని వారి బంధువులకు తెలపాలని ఆదేశించింది. వారం రోజుల్లోపు ఎవరూ రాకపోతే ప్రభుత్వమే అంత్యక్రియలు చేయొచ్చని తెలిపింది.
షెడ్యల్ తెగల జాబితాలో గిరిజనులు కాని మైతేయి సామాజిక వర్గాన్ని కలిపే విషయాన్ని పరిశీలించాలని హై కోర్టు ఇచ్చిన తీర్పుపై ఈ ఏడాది మేలో మణిపూర్‌లో భారీ ఎత్తున హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఈ హింసలో మొత్తం 170 మంది మరణించగా వందల మంది గాయపడ్డారు.
ఇదీచదవండి..నీదే దయ.. దేవుని ముందు ప్రణమిల్లిన ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్
Comments
Please login to add a commentAdd a comment