శనిగకుంట(మంగపేట) : సరదాగా ఆడుకునేందుకు వెళ్లిన ఇద్దరు చిన్నారులను చెరువు మింగేసింది. చెరువులో నీట మునిగి ఇద్దరు బాలికలు మృతిచెందిన సంఘటన మండలంలోని నర్సింహాసాగర్ పంచాయతీ పరిధిలోని శనిగకుంట గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. బాలికల తల్లిదండ్రుల కథనం ప్రకా రం.. గ్రామానికి చెందిన మంకిడి రాంబాబు, సత్యవతి దంపతుల కూతురు శ్రుతిలయ(8), యాలం లక్ష్మీనారాయణ, సుమలత దంపతుల కూతురు శ్వేత(9) స్థానిక ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నారు. ఇదే గ్రామ శివారులోని చెరువులో కొద్దిరోజులుగా కొందరు గ్రామస్తులు చేపలు పడుతున్నారు. పాఠశాల ఉపాధ్యాయుడు నాగేశ్వర్రావు మధ్యాహ్నం 12 గంటలకు పాఠశాలను మూసివేసి శనివారం తిమ్మంపేటలో జరిగిన స్కూల్‌కాంప్లెక్స్ మీటింగుకు వెళ్లాడు. దీంతో తమ కుటుంబ సభ్యులు చెరువులో పడుతున్న చేపలను చూసేందుకు కొందరు విద్యార్థులు వెళ్లగా వారితో శ్రుతిలయ, శ్వేత కూడా వెళ్లారు.
ఇంటిపై కప్పుకునే ఎట్టె గడ్డిని కోసేందుకు వెళ్లిన శ్రుతిలయ తల్లి సత్యవతి వారిద్దరిని చూసి చెరువుకు ఎందుకు వచ్చారని మందలించి ఇంటికి వెళ్లండని హెచ్చరించింది. దీంతో వారు వెనక్కి తిరగడంతో ఇంటికి వెళ్లారని భావించిన సత్యవతి సాయంత్రం వరకు పనిముగించుకుని ఇంటికి చేరుకుంది. సాయంత్రం 5 గంటల వరకు ఇద్దరు బాలికలు ఇంటికి రాకపోవడంతో గ్రామంలో ఎవరింటి వద్దరుునా ఉన్నారనే అనుమానంతో రాత్రి 10 గంటల వరకు ఊరంతా వెతికారు. అరుునా ఆచూకీ లభ్యం కాకపోవడంతో చెరువులో పడి ఉంటారా ? అనే అనుమానంతో బాలికల తల్లిదండ్రులు గ్రామస్తులతో రాత్రి 10.30 గంటల నుంచి నీటిలో వెతకగా రాత్రి ఒంటి గంట ప్రాంతంలో బాలికల మృతదేహాలు లభ్యమయ్యూరుు. సమాచారం అందుకున్న మంగపేట డిప్యూటీ తహసీల్దార్ పుల్యాల రాజయ్య, ఎస్సై ముస్కెం శ్రీనివాస్. ఏఎస్సై పిట్ట శ్యామ్‌సుందర్ వీఆర్వో ఎస్‌కే మున్వర్ ఆదివారం సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకుని పంచనామా చేశారు.
షాక్‌తో మృతిచెందారని మృతుల
తల్లిదండ్రుల అనుమానం
గ్రామంలోని కొందరు కొద్ది రోజులుగా కరెంటుతో చెరువులో చేపలు పడుతున్నారని, ఈ క్రమంలోనే చెరువులోకి దిగిన తమ పిల్లలు విద్యుత్ షాక్‌తో మృతి చెంది ఉంటారని శ్రుతిలయ తల్లిదండ్రులు మంకిడి రాంబాబు, సత్యవతి అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించారు. ఒడ్డు వెంట చనిపోరుున చేపలు ఏరుతున్న క్రమంలో ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులోపడి మృతిచెందారా ? లేక చేపల వేటకు వినియోగించిన కరెంటు షాక్‌తో మృతి చెందారా అనే విషయం పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ముక్కుపచ్చలారని చిన్నారులు చెరువులో పడి మృతిచెందిన సంఘటనతో శని గకుంట గ్రామంలో శనివారం అర్ధరాతి నుంచి ఆదివారం ఉదయం వరకు మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. చిన్నారుల తల్లిదండ్రుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించింది. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇద్దరు చిన్నారుల దుర్మరణం
Published Mon, Feb 16 2015 2:04 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
Advertisement