మృతదేహాల పక్కన నిద్రిస్తున్న రిక్షా కార్మికుడు
నెల్లూరు, కావలిఅర్బన్: స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదురుగా ట్రంకురోడ్డు మీద చెక్క రిక్షాలోని రెండు మృతదేహాలు కలకలం సృష్టించాయి. వివరాల్లోకి వెళ్తే.. కావలి పరసర ప్రాంతాల్లో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మృతి చెందారు. వీటికి ఏరియా వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించా రు. అనాథ శవాలు కావడంతో మున్సిపల్ సిబ్బం ది ఆ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిం చాల్సి ఉంది. శ్మశానికి తరలించడానికి వీటిని ఓ రిక్షా కార్మికుడికి అప్పగించారు.
అయితే అతను ట్రంకురోడ్డులో వెళ్తూ మధ్యలో మద్యం షాపు కనిపించడంతో ఆగి ఫూటుగా మద్యం తాగేసి పడిపోయాడు. సుమారు 2 గంటల పాటు ట్రంకురోడ్డు పక్కనే మద్యం మత్తులో నిద్రించాడు. రిక్షాపై మృతదేహాలు ఉండడం, దుర్గంధం వెదజల్లుతుండడంతో అటువైపుగా వెళ్తున్న వాహనాదారులు, పాదచారులు గుర్తించి భయాందోలళనకు గురయ్యారు. మద్యం మత్తులో నుంచి తేరుకున్న రిక్షా కార్మికుడు మృతదేహాలను శ్మశానవాటికకు తరలించాడు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి ఘటను చోటు చేసుకుందని స్థానికులు మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment