ఆకర్షణో..? ప్రేమో..? తెలుసుకునే లోపే... | dead bodies found at the alwal railway track | Sakshi
Sakshi News home page

ఆకర్షణో..? ప్రేమో..? తెలుసుకునే లోపే...

Published Thu, Jan 8 2015 2:34 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

ఆకర్షణో..? ప్రేమో..? తెలుసుకునే లోపే... - Sakshi

ఆకర్షణో..? ప్రేమో..? తెలుసుకునే లోపే...

* సిద్దిపేటకు చెందిన ప్రేమ జంట హైదరాబాద్‌లో ఆత్మహత్య
* అల్వాల్ రైల్వేట్రాక్ వద్ద కనిపించిన మృతదేహాలు

సిద్దిపేట రూరల్/అర్బన్: తెలిసీతెలియని వయసులో ఓ అమ్మాయి.. మరో అబ్బాయి మదిలో రూపుదాల్చిన ‘ఆకర్షణ’ మొగ్గలు.. ప్రేమ పేరుతో పువ్వులుగా వికసించాయి. అది ఆకర్షణో..? ప్రేమో..? తెలుసుకునే లోపే వీరిని ఆవహించిన ఆందోళన భూతం ఆత్మహత్యకు ఉసిగొల్పింది. ఫలితంగా నవమాసాలు మోసిన తల్లులకు.. కంటికి రెప్పలా కాపాడుకున్న తండ్రులకు తీరని శోకం మిగిలింది. ఆ యువ జంట నడుమ చోటు చేసుకున్న నాలుగు నెలల పరిచయం.. ప్రేమగా మారింది..
 
వివాహం చేసుకుందామంటే కులం, పెద్దరికం అడ్డుగా నిలిచాయి.. ఇంట్లో వారిని ఒప్పించలేక.. విడిగా ఉండలేక ఆ ప్రేమికులిద్దరూ ఈ లోకాన్నే వదిలేశారు. తమ ప్రేమను నిరాకరించిన తల్లిదండ్రులకు కోలుకోలేని శిక్ష విధించారు. సిద్దిపేటకు చెందిన విజయ్ (20),  మాధవి (18) బుధవారం హైదరాబాద్‌లోని అల్వాల్ వద్ద రైల్వే ట్రాక్‌పై ప్రాణాలు వదిలారు.

నాలుగు నెలల పాటు ఆశల పల్లకీలో ఊరేగిన ప్రేమ ప్రయాణం.. రైలు పట్టాలపై వీరిని విగత జీవులుగా మిగిల్చింది. మృతులిద్దరూ పట్టణంలోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేసే వారు. ప్రేమ జంట మరణవార్త సిద్దిపేటవాసులను కలచివేసింది. కన్నబిడ్డలను కోల్పోయిన వారి రోదనలతో మోయిన్‌పురా, గణేష్‌నగర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement