బెల్లంపల్లి: ఆదిలాబాద్ జిల్లా మందమర్రి ఏరియా శాంతిఖని భూగర్భ బొగ్గుగనిలో జరిగిన ప్రమాదంలో చనిపోయిన కార్మికుల మృతదేహాలను వెలికితీయడం లో అసాధారణమైన జాప్యం జరుగుతోంది. గని ప్రమాదం జరిగి (గురువారం సాయంత్రం 6 గంటల వరకు) 27 గంటలు గడిచాయి. మృతదేహాలు బయట కు తీసుకురావడంలో తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి.
బుధవారం మధ్యాహ్నం గనిలోని 52 లెవెల్ వన్ డీప్ వద్ద జంక్షన్ ఫాల్ జరగడంతో ఆర్‌బీసీ కార్మికులు పోల్సాని హన్మంతరావు, రమావత్ కిష్టయ్య, మేషన్ మేస్త్రీ గాలిపల్లి పోశం.. బండ కింద నలిగి మృతి చెందిన సంగతి తెలిసిందే. సహాయక చర్యలు గురువారం కొనసాగుతూనే ఉన్నాయి. బండరాళ్లు కూలడంతో సహాయ కచర్యలు చేపట్టడంలో రెస్క్యూసిబ్బంది శ్రమిస్తున్నారు.
భూగర్భంలోనే కార్మికుల మృతదేహాలు
Published Fri, Apr 15 2016 4:38 AM | Last Updated on Sun, Sep 3 2017 9:55 PM
Advertisement
Advertisement