
హైదరాబాద్: సికింద్రాబాద్ డెక్కన్ మాల్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. వీరి మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి గుర్తుపట్టలేని విధంగా కాలిపోయి బూడిద అయినట్లు తెలుస్తోంది. ఎముకలు, టీత్ పరీక్ష ద్వారానే ఈ బాడీస్‌ను గుర్తించే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. గురువారం అగ్నిప్రమాదం సంభవించినప్పుడు లోపల చిక్కుకున్న నలుగురిని సిబ్బంది కాపాడారు.
అయితే వసీం, జునైద్, జహీర్ అనే ముగ్గురు మాత్రం షెటర్లు మూసేందుకు మంటల్లోనే లోపలికి వెళ్లారు. నిన్న రాత్రి వరకు వాళ్ల ఆచూకీ తెలియరాలేదు. దీంతో శుక్రవారం ఉదయం మళ్లీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు అగ్నిమాపక సిబ్బంది. ఈ క్రమంలోనే ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే ఇవి వారివేనా కాదా? అని నిర్ధారించాల్సి ఉంది. మరోవైపు ఘటనా స్థలంలోనే గల్లంతైన యువకుల ఫోన్ సిగ్నల్స్ చూపిస్తున్నాయని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment