మార్చురీలో శవాలకు ప్రాణం పోసే యత్నం! | 2 Bodies Kept In Rock Salt At Maharashtra Morgue Probe Started | Sakshi
Sakshi News home page

ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

Published Mon, Aug 19 2019 10:18 AM | Last Updated on Mon, Aug 19 2019 10:34 AM

2 Bodies Kept In Rock Salt At Maharashtra Morgue Probe Started - Sakshi

ముంబై : జలగాన్‌లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో చనిపోయిన ఇద్దరు యువకులను బ్రతికించటానికి ప్రయత్నం జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. యువకుల శవాలను పూర్తిగా ఉప్పులో దాచిపెట్టి ఉంచిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావటంతో ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు జలగాన్‌ ప్రభుత్వ ఆసుపత్రి అధికారులకు లేఖ రాశారు. దీనిపై  ఎమ్‌ఐడీసీ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ రంజిత్‌ శిర్‌సత్‌ మాట్లాడుతూ.. ‘‘ పూర్తి వివరాలు తెలిసే వరకు ఏ విషయాన్ని ధ్రువీకరంచలేము.

ఇప్పటికే మేము ఆసుపత్రి డీన్‌కు లేఖ రాశాము. మాస్టర్‌ కాలనీకి చెందిన ఇద్దరు యువకులు శుక్రవారం నీటిలో మునిగి చనిపోయారు. అదే రోజు వారి మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌ నిమిత్తం జలగాన్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరి ఆ రోజు రాత్రి మార్చురీలో ఏం జరిగిందో మాకు తెలియద’’ని ఆయన అన్నారు. అయితే ఆ ఇద్దరు యువకుల మృతదేహాలకు శనివారం ఉదయమే అంత్యక్రియలు పూర్తి కావటం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement