Morgue
-
40 అస్తిపంజరాలతో ఇల్లు డెకరేషన్.. తీగలాగితే..
వాషింగ్టన్: అమెరికాలో ఎఫ్.బి.ఐ అధికారులకి ఒక విచిత్రమైన కేసు ఎదురైంది. కెంటక్కీలోని ఒక వ్యక్తి మీద అనుమానంతో అతడి తలుపు తట్టి లోపల ఎవరున్నారని అడగగా నేను, నాతో పాటు చనిపోయిన నా స్నేహితులు ఉన్నారని చెప్పడంతో అధికారులు ఖంగుతిన్నారు. ఇంటి లోపలికి వెళ్లి తనిఖీలు నిర్వహించగా మొత్తం 40 పుర్రెలు, వెన్నుపూసలు చక్కగా అలంకరించి ఉన్నాయి. దీంతో అధికారులు అతడిని వెంటనే అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ఇటీవల హార్వార్డ్ మెడికల్ స్కూల్ శవాగారం నుండి చాలా వరకు మృతదేహాల అవశేషాలు దొంగిలించబడుతున్నాయని ఎఫ్.బి.ఐకి ఫిర్యాదు చేశారు సదరు స్కూలు సిబ్బంది. అప్పటి నుండి కేసు దర్యాప్తు చేసున్న ఎఫ్.బి.ఐ అధికారులకు కెంటక్కీకి చెందిన జేమ్స్ నాట్(39) పై అనుమానం వచ్చింది. పోలీసులు అతడి తలుపు తట్టి లోపల ఎవరున్నారని అడగగా చనిపోయిన నా స్నేహితులు ఉన్నారని విచిత్రమైన సమాధానమిచ్చాడట. ఇంకేముంది పోలీసులు దౌర్జన్యంగా ఇంటిలోకి చొరబడి చూస్తే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇంటి నిండా ఎక్కడ చూసినా ఆస్తిపంజరాలు, పుర్రెలే. ఫర్నీచర్ చుట్టూ మానవ అవశేషాలను చక్కగా అలంకరించుకున్నాడట జేమ్స్. ఒక హార్వార్డ్ స్కూలుకు సంబంధించిన బ్యాగ్ కూడా అక్కడ దొరకడంతో తాము వెతుకుతున్న నేరస్తులలో జేమ్స్ ఉండి ఉంటాడని అనుమానంతో దర్యాప్తు చేశారు అధికారులు. తీగలాగితే.. జేమ్స్ నాట్ ఇల్లంతా తనిఖీలు నిర్వహించగా మొత్తం 40 పుర్రెలు, వెన్నుపూసలు దొరికాయి. అతడి పేస్ బుక్ మెసేజులన్నీ పరిశీలించగా అతడు జెరెమి పాలీ అనే వ్యక్తితో మానవ అవశేషాల కొనుగోలుకు సంబంధించి లావాదేవీలు నడుపుతున్న విషయం బయటపడింది. ఇంటిలో కొన్ని మారణాయుధాలు కూడా దొరకడంతో అక్రమ్మగా ఆయుధాలు కలిగి ఉన్నాడన్న నెపంతోనూ, నిషేధిత వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉన్నాడన్న నేరం కింద జేమ్స్ నాట్ ని అరెస్టు చేశారు. జెరెమి పాలీ కోసం గాలిస్తున్నారు. జెరెమి పాలీ, జేమ్స్ నాట్ వీరంతా మానవ అవశేషాలను విక్రయించే ముఠాకు చెందిన వారిని.. వీరు శరీరంలోని ఎముకల తోపాటు చర్మాన్ని కూడా అమ్ముకుంటారని తెలిపారు ఎఫ్.బి.ఐ అధికారులు. ఇది కూడా చదవండి: భారత ప్రధానికి ఫ్రాన్స్ అధ్యక్షుడి అపురూప కానుక.. -
Odisha Train Accident: ఆ తండ్రి నమ్మకమే కొడుకుని బతికించింది!
ఒడిస్సా బాలాసోర్‌లో వందలాది ప్రాణాలు బలిగొన్న ఆ రైలు ప్రమాదం ఎన్నో కుటుంబాలను చిదిమేసింది. ఎందరికో తీరని విషాదాన్ని మిగిల్చింది. కొందరూ మాత్రం ఆ ప్రమాదాన్ని ఎదుర్కొని మృత్యుంజయులై ప్రాణలతో బయటపడిన వారు కూడా ఉన్నారు. అంతటి భయానక విషాదంలోని తన వాళ్లు బతికే ఉండాలన్న ఆరాటం, ఆశతో గాలించిన కొందరి ఆశలు, ప్రయత్నాలు సఫలమయ్యాయి. వారి ప్రేమ, తపనే ఆయా వ్యక్తులకు ఊపిరి పోసి మృత్యుజయులుగా తిరిగొచ్చేలా చేసిందా!.. అన్నట్లుగా జరిగిందో ఓ ఉదంతం. ఆ తండ్రి నమ్మకమే విధే చిన్నబోయేలా గెలచింది. కొడుకు ప్రాణాలను కాపాడుకోగలిగే చేసింది ఆ తండ్రి ఆశ. అసలేం జరిగిందంటే..పశ్చిమ బెంగాల్‌లోన హౌరాకు చెందిన హేలరామ్ అనే దుకాణదారుడు తన 24 ఏళ్ల కొడుకు బిస్వజిత్ మాలిక్‌ని కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కించేందుకు శుక్రవారం షాలిమార్ స్టేష్‌న్‌కు వచ్చాడు. కొడుకుని కోరమండల్ రైలు ఎక్కించి వీడ్కోలు పలికి వెనుదిరిగి వచ్చిన కొద్ది నిమిషాల్లోనే రైలు ప్రమాదం గురించి విని షాక్ అయ్యాడు. వెంటనే కొడుకుకి ఫోన్ చేస్తే తాను చాలా గాయాలతో బాధపడుతున్నట్లు చెప్పాడు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హేలరామ్ ఓ అంబులెన్స్ డ్రైవర్ పలాష్ పండిట్‌ను ఏర్పాటు చేసుకుని.. తన బావ దీపక్ దాస్‌తో కలిసి ఒడిశాకు బయలుదేరాడు. సుమారు 230 కిలోమీటర్లు ప్రయాణించి.. ప్రమాదం జరిగిన ప్రాంతానికి రాత్రికల్లా చేరుకున్నారు. ఆ రాత్రే ప్రాణాలతో బయటపడిన వారికి చికిత్స అందిస్తున్న ప్రతి ఆస్పత్రిని సందర్శించిన ఏం ప్రయోజనం లేకపోయింది ఆ తండ్రికి . కొడుకు ఎక్కడ ఉన్నాడన్నది కానరాలేదు. అయితే అధికారులు హేలారామ్‌ని మృతదేహాలను ఉంచిన తాత్కాలిక మార్చరీ(బహనాగా హైస్కూల్) వద్దకు వెళ్లమని సూచించారు. నిజానికి సాధారణ పౌరులు ఎవర్నీ అక్కడకు వెళ్లనివ్వడం లేదు. బాధితుల బంధువులకు మాత్రమే అనుమతి. సరిగ్గా అక్కడకు హేలారామ్ చేరుకునేసరికి..ఇంతలో ఆ శవాల మధ్యలోంచి ఓ చేయి కదలడం ప్రారంభించింది. దీంతో అక్కడి వాతావరణం కాస్త గందరగోళంగా మారిపోయింది. అదృష్టవశాత్తు ఆ చేయి కదిలిన వ్యక్తే హేలరామ్ కొడుకు బిస్వజిత్‌గా తేలింది. ప్రమాదం జరిగిన రెండో రోజుకి తన కొడుకు ఆచూకిని కనిపెట్టగలిగాడు హేలారామ్. దీంతో ఆ తండ్రి తాను తీసుకొచ్చిన అంబులెన్స్‌లో బాలాసోర్ ఆస్పత్రికి కొడుకుని తీసుకుకెళ్లగా.. వారు కొన్ని ఇంజెక్షన్లు ఇచ్చి.. కటక్ మెడికల్ కాలేజికి తీసుకెళ్లమని రిఫర్ చేశారు. హుటాహుటినా అతడిని ఆ అంబులెన్స్‌లోనే కోల్‌కతాలోని సదరు ఆస్పత్రికి తరలించారు. అతని కాలికి అయ్యిన గాయాలకు శస్త్ర చికిత్సలు చేశారు. ప్రస్తుతం ఇంకా కొన్ని గాయాలతో బాధపడుతున్నట్లు అతడి తండ్రి చెప్పుకొచ్చాడు. నాన్ మెడికల్ సహయక బృందం అతను అపాస్మారక స్థితిలో ఉండటంతో.. చనిపోయాడని తప్పుగా భావించి శవాలు ఉండే చోటే పెట్టినట్లు అధికారులు చెప్పినట్లు వెల్లడించాడు హేలరామ్. ఎలాగైతే తన కొడుకు ప్రాణాలతో ఉంటాడన్న ఆ తండ్రి ఏకంగా అంబులెన్స్ మాట్లుడుకుని తీసుకెళ్లాడు. రెండు రోజులు శవాల మధ్య అపస్మారక స్థితిలో పడి ఉన్న అతడి కొడుకుని.. ఆ తండ్రి నమ్మకమే ఊపిరి పోసి మృత్యుంజయుడై తిరిగొచ్చేలా చేసింది. (చదవండి: లిక్కర్ స్కాం కేసు: మనీష్ సిసోడియాకు చుక్కెదురు) -
వింత ఘటన: బతికి ఉండగానే మార్చురీకి... కంగుతిన్న వైద్యులు
ఒక వ్యక్తిని బతికి ఉండగానే మార్చురీకి పంపించింది ఓ ఆస్పత్రి. చనిపోయింది ఒకరోజు అయితే మరో రోజు చనిపోయినట్లు మరణ ధృవీకరణ పత్రాన్ని ఇచ్చింది. దీంతో ఆస్సత్రి వర్గాలు కోర్టు చుట్టూ తిరుగుతున్నాయి. ఈ ఘటన యూకేలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....55 ఏళ్ల ఆస్ట్రేలియన్ వ్యక్తి రీడ్ని యూకేలో పెర్త్‌లోని రాకింగ్హామ్ ఆస్పత్రి చనిపోయాడని నిర్ధారించి మార్చురీకి తరలించింది. ఐతే సదరు వ్యక్తి మృతదేహాన్ని తరలించడానికి ముందు కుటుంబ సభ్యులుకు సమాచారం కూడా అందించింది. ఐతే ధృవీకరణ పత్రం వెంటనే జారీ చేయలేదు. వాస్తవానికి రీడ్ అనే వ్యక్తిని మార్చురుకి సజీవంగా ఉండగానే తరలించారు. ఈ విషయం మార్చురీలో వైద్యులు శవపరీక్ష జరుపుతుండగా బయటపడింది. ఈ మేరకు వైద్యుడు పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా ఆ మృతదేహాన్ని చూసి అనుమానం వచ్చింది. ఎందుకంటే ఆ మృతదేహం ఉన్న స్థితి చాలా సేపటి క్రితం చనిపోయిన వ్యక్తిలా లేదు కొద్ది నిమిషాల ముందు చనిపోయినట్లు అనిపించింది. పైగా సదరు వ్యక్తి మృతదేహాన్ని ప్యాక్ చేసిన కవర్ విప్పి ఉందని, కవర్‌పై రక్తం పడి ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయినట్లు తెలిపాడు వైద్యుడు. బహుశా ఆ వ్యక్తి బతికే ఉండవచ్చని ఆ కవర్ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించి ఉండవచ్చని అన్నారు. అందువల్లే కవర్ని ఓపెన్ చేసి ఉందని దానిపై రక్తపు మరకలు ఉన్నాయని అన్నారు. పైగా ఆ రక్తం బతికి ఉన్న వ్యక్తి శరీరంలోని రక్తం మాదిరిగా ఉందని అన్నారు. తాము పోస్ట్‌మార్టం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి చనిపోయి చాలాసేపు కాలేదని, కొద్ది నిమిషాల వ్యవధిలోనే మరణించినట్లు వైద్యులు పోస్ట్‌మార్టం నివేదికలో తెలిపారు. అదీగాక అతను సెప్టెంబర్ 5న చనిపోతే...6న చనిపోయినట్లు మరణ ధృవీకరణ పత్రాన్ని ఇచ్చింది రాకింగ్హామ్ ఆస్పత్రి. దీంతో ఈ ఘటనపై యూకే కరోనరీ కోర్టు దర్యాప్తు ప్రారంభించింది. మరోవైపు ఆస్పత్రి వర్గాలు ఈ ఘటనను కప్పి పుచ్చుకునేందుకు యత్నించాయి కూడా. అంతేగాదు మరణధృవీకరణ పత్రాన్ని వెనక్కి తీసుకుంటామని ఆస్పత్రి వర్గాలు కోర్టుని అభ్యర్థించాయి కూడా. దీంతో కరోనరి కోర్టు సదరు వ్యక్తి మరణం అసహజంగా ఉందని పోస్ట్‌మార్టం నివేదిక ఆస్పత్రి వర్గాలు చెబుతున్న దానికి భిన్నంగా ఉందంటూ దర్యాప్తు ప్రారంభించటమే కాకుండా బాధ్యులపై కఠిన చర్యుల తీసుకుంటామని స్పష్టం చేసింది. (చదవండి: విధ్వంసం.. క్రిమియా-రష్యాను కలిపే వంతెనపై భారీ పేలుడు) -
మార్చురీలో శవాలకు ప్రాణం పోసే యత్నం!
ముంబై : జలగాన్లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో చనిపోయిన ఇద్దరు యువకులను బ్రతికించటానికి ప్రయత్నం జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. యువకుల శవాలను పూర్తిగా ఉప్పులో దాచిపెట్టి ఉంచిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావటంతో ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు జలగాన్ ప్రభుత్వ ఆసుపత్రి అధికారులకు లేఖ రాశారు. దీనిపై ఎమ్ఐడీసీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రంజిత్ శిర్సత్ మాట్లాడుతూ.. ‘‘ పూర్తి వివరాలు తెలిసే వరకు ఏ విషయాన్ని ధ్రువీకరంచలేము. ఇప్పటికే మేము ఆసుపత్రి డీన్‌కు లేఖ రాశాము. మాస్టర్ కాలనీకి చెందిన ఇద్దరు యువకులు శుక్రవారం నీటిలో మునిగి చనిపోయారు. అదే రోజు వారి మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ నిమిత్తం జలగాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరి ఆ రోజు రాత్రి మార్చురీలో ఏం జరిగిందో మాకు తెలియద’’ని ఆయన అన్నారు. అయితే ఆ ఇద్దరు యువకుల మృతదేహాలకు శనివారం ఉదయమే అంత్యక్రియలు పూర్తి కావటం గమనార్హం. -
మహిళ శవంతో సెక్స్!
అర్జెంటీనాః రోజురోజుకూ మానవత్వం మంట కలసిపోతోంది. మనుషులు మృగాలుగా మారిపోతున్నారు. తోటి మనిషిని మనిషిగా గుర్తించకపోగా వారిపై దారుణాలకు ఒడిగట్టడానికీ వెనుకాడటం లేదు. ఘోర కృత్యాలకు పాల్పడ్డంలో మనుషులనే కాదు... శవాలనూ వదలడం లేదు. అర్జెంటీనాలో జరిగిన ఓ దారుణ ఘటన అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. మనిషిలోని పశుత్వానికి పరాకాష్టగా పరిణమించింది. అర్జెంటీనా పోలీసులు... ఆస్పత్రిలో పశుత్వం ప్రదర్శించిన ఓ మానవ మృగాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆస్పత్రిలోని మార్చురీ గది తలుపులు బద్దలుకొట్టి, భద్రపరచిన ఓ మహిళ మృత దేహంపై అఘాయిత్యానికి పాల్పడటమే కాక సెక్స్ కోరిక తీరక అసంతృప్తితో ఉన్న 22 ఏళ్ళ వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపారు. శవమైధునం అంటే ఇష్టం ఉండటంతోనే తాను ఆస్సత్రిలో మహిళపై ఆఘాయిత్యం చేశానని నిందితుడు అధికారులకు వివరించినట్లు పోలీసులు తెలియజేశారు. అయితే జరిగిన ఘటనకు ఆస్పత్రి సిబ్బంది సహా, అధికారులు ఆశ్చర్యపోయారు. ఆస్పత్రిలోని మార్చురీ ఫ్రీజర్ నుంచి శవాన్ని బయటకు తీసి, మైధునం సలుపుతున్న విషయాన్ని గమనించిన సిబ్బంది నిశ్చేష్టులయ్యారు. వెంటనే అలారం మోగించారు. అక్కడకు వచ్చిన పోలీసులను చూసి కూడ ఆ వ్యక్తి వెరవలేదు. అరెస్టు చేస్తారని భయపడక పోగా... అధికారులతో తన కోరికను వివరించినట్లు అర్జెంటీనా ఓరాన్ లోని శాన్ విన్సెంటె డి పాల్ ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. అర్థరాత్రి తర్వాత ఆ పట్టణానికి బస్సులో చేరుకున్నఅతడు సెక్యూరిటీ లేని సమయాన్ని గమనించి అఘాయిత్యానికి పాల్పడినట్లు వివరించారు.