మహిళ శవంతో సెక్స్! | Man arrested..after 'breaking into hospital morgue to have sex with a dead woman' | Sakshi
Sakshi News home page

మహిళ శవంతో సెక్స్!

Published Fri, May 6 2016 7:18 AM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

మహిళ శవంతో సెక్స్! - Sakshi

మహిళ శవంతో సెక్స్!

అర్జెంటీనాః రోజురోజుకూ మానవత్వం మంట కలసిపోతోంది. మనుషులు మృగాలుగా మారిపోతున్నారు. తోటి మనిషిని మనిషిగా గుర్తించకపోగా వారిపై దారుణాలకు ఒడిగట్టడానికీ వెనుకాడటం లేదు. ఘోర కృత్యాలకు పాల్పడ్డంలో మనుషులనే కాదు... శవాలనూ వదలడం లేదు. అర్జెంటీనాలో జరిగిన ఓ దారుణ ఘటన అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. మనిషిలోని పశుత్వానికి పరాకాష్టగా పరిణమించింది.

అర్జెంటీనా పోలీసులు... ఆస్పత్రిలో  పశుత్వం ప్రదర్శించిన ఓ మానవ మృగాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆస్పత్రిలోని మార్చురీ గది తలుపులు బద్దలుకొట్టి,  భద్రపరచిన ఓ మహిళ మృత దేహంపై అఘాయిత్యానికి పాల్పడటమే కాక సెక్స్ కోరిక తీరక అసంతృప్తితో ఉన్న 22 ఏళ్ళ  వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపారు. శవమైధునం అంటే ఇష్టం ఉండటంతోనే తాను ఆస్సత్రిలో మహిళపై ఆఘాయిత్యం చేశానని నిందితుడు అధికారులకు వివరించినట్లు పోలీసులు తెలియజేశారు. అయితే జరిగిన ఘటనకు ఆస్పత్రి సిబ్బంది సహా, అధికారులు ఆశ్చర్యపోయారు.

ఆస్పత్రిలోని మార్చురీ ఫ్రీజర్ నుంచి శవాన్ని బయటకు తీసి, మైధునం సలుపుతున్న విషయాన్ని గమనించిన  సిబ్బంది నిశ్చేష్టులయ్యారు.  వెంటనే అలారం మోగించారు. అక్కడకు వచ్చిన పోలీసులను చూసి కూడ ఆ వ్యక్తి  వెరవలేదు. అరెస్టు చేస్తారని భయపడక పోగా... అధికారులతో తన కోరికను వివరించినట్లు అర్జెంటీనా ఓరాన్ లోని శాన్ విన్సెంటె డి పాల్ ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. అర్థరాత్రి తర్వాత ఆ పట్టణానికి బస్సులో చేరుకున్నఅతడు సెక్యూరిటీ లేని సమయాన్ని గమనించి అఘాయిత్యానికి పాల్పడినట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement