ఒడిశా రైలు ప్రమాదం అనంతరం రెస్క్యూ నిర్వహిస్తున్న ఒక బృందంలోని ఒకరు ఆ క్షణంలో వణికిపోయారు. మృతదేహాలలో నుంచి ఒక చెయ్యి అతని కాలును పట్టుకోవడంతో అతను నిలువెల్లా కంపించిపోయారు. గత శుక్రవారం (జూన్ 2) నాడు ఒడిశాలో రైలుప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ ప్రమాదంలో వందలమంది మృతి చెందారు. ఆ మృతదేహాలను ఒక స్కూలుగదిలో ఉంచారు. అక్కడ రెస్క్యూ నిర్వహిస్తున్న ఒక వ్యక్తి ఆ గదిలోకి వెళ్లగానే మృతదేహాల్లో నుంచి ఒక చేయి అతని కాలు పట్టుకుంది. దీంతో మొదట అతను భయపడిపోయారు. తరువాత తేరుకుని తన కాలు పట్టుకున్న శరీరాన్ని పరిశీలనగా చూశారు. అ శరీరంలోని రెండు కాళ్లూ తెగిపోయి ఉన్నాయి. అతని చేతులు సవ్యంగానే ఉన్నాయి. ఆ చేతులతోనే అతను రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న వ్యక్తి కాళ్లు పట్టుకుని, తనను రక్షించాలంటూ వేడుకున్నాడు.
దీనిని గమనించిన రెస్క్యూ సిబ్బంది వెంటనే బాధతుడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు బాధితునికి తక్షణం చికిత్స ప్రారంభించారు. ఇదిలావుండగా ప్రమాదం అనంతరం అధికారుల పరిశీలన, మృతదేహాలకు నిర్వహించిన పోస్టుమార్టం రిపోర్టులలో పలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మొత్తం 278 మంది మృతిచెందగా, 1200 మంది గాయపడ్డారు.
చదవండి: ఒక మృతదేహం కోసం ఐదుగురు వాదన
Comments
Please login to add a commentAdd a comment