
సాక్షి, హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరు సమీపంలోని ఇంద్రాణినగర్ వద్ద అయిదు గుర్తుతెలియని మృతదేహాలు బయటపడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఓఆర్‌ఆర్ సమీపంలోని నిర్మానుష్యప్రాంతంలో ఇద్దరు పురుషులు, ఇద‍్దరు యువతులు(22), ఒక మహిళ(40) మృతదేహాలను గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
మృతుల్లో భార్యాభర్తలు, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు నిర్దారించారు. మృతులను పటాన్‌చెరు అమీన్‌పూర్ కు చెందిన ప్రభాకర్ రెడ్డి కుటుంబంగా గుర్తించారు. మృతులు.. ప్రభాకర్ రెడ్డి, మాధవి, హిందూజా, లక్ష్మీ, వర్షిత్ రెడ్డి. శ్రీశైలం వెళ్తున్నట్లు చెప్పిన వారు.. శవమై కనిపించారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కాగా రెండ్రోజుల క్రితం పటాన్‌చెరువు పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసుగా నమోదైనట్లు సమాచారం. మూడు రోజుల క్రితం వీరంతా ఎపీ 28 DM 3775 కారులో బయలుదేరారు. వీరెక్కడికి వెళ్లారో తెలియక బంధువులు పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశారు. మూడు రోజులుగా వీరంతా ఎక్కడికి వెళ్లారు అన్నది మిస్టరీగా మారింది. ఆర్థిక కారణాలు వల్లే వారు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది.
కొల్లూరు సమీపంలో మృతదేహాలు కలకలం
Comments
Please login to add a commentAdd a comment