outer ring road hyderabad
-
ORR Accidents: విషాదం నింపుతున్న రోడ్డు ప్రమాదాలు
సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని రోడ్లతో పాటు ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) సైతం అనేక మంది ప్రముఖులను బలిగొన్నాయి. అక్కడ జరిగిన ఘోర ప్రమాదాల్లో వీఐపీలతో పాటు వారి కుటుంబీకులూ మృత్యువాతపడ్డారు. బాబూమోహన్ కుమారుడు పవన్ కుమార్ నుంచి ఎమ్మెల్యే లాస్య నందిత వరకు ఇలా అర్థాంతరంగా ఊపిరి ఆగిన వాళ్లు ఎందరో ఉన్నారు. ఈ రోడ్డు ప్రమాదాల విషయంలో కొందరు ప్రయాణిస్తున్న వాహనాలు మితిమీరిన వేగంతో ఉండటం, మరికొందరు సీటు బెల్ట్‌లు, హెల్మెట్లు ధరించకపోవడం వారి పాలిట శాపాలయ్యాయి. 2000 ఏప్రిల్ 22: మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ నుంచి తిరిగి వస్తూ శంషాబాద్ సమీపంలోని పాల్మాకుల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నాటి మంత్రి పి.ఇంద్రారెడ్డి అసువులు బాశారు. 2003 అక్టోబర్ 12: అప్పటి రాష్ట్ర కారి్మక శాఖ మంత్రి బాబూమోహన్ పెద్ద కుమారుడు పి.పవన్‌కుమార్ రసూల్‌పుర నుంచి జూబ్లీహిల్స్‌కు బైక్‌పై వస్తుండగా... జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద రోడ్ డివైడర్‌ను ఢీ కొట్టడంతో మృత్యువాతపడ్డాడు. 2010 జూన్ 20: ప్రముఖ సినీనటుడు, బీజేపీ నేత కోట శ్రీనివాసరావు కుమారుడు ప్రసాద్ హైదరాబాద్ శివార్లలోని ఓఆర్ఆర్పై జరిగిన ప్రమాదంలో కన్నుమూశారు. ఈయన ప్రయాణిస్తున్న హైస్పీడ్ ద్విచక్ర వాహనం మరో వాహనాన్ని ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 2011 సెపె్టంబర్ 11: హైదరాబాద్ శివార్లలోని ఔటర్ రింగ్రోడ్పైన పుప్పాలగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కుమారుడు అయాజుద్దీన్ కన్నుమూశాడు. 2011 డిసెంబర్ 20: మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమారుడు ప్రతీక్‌రెడ్డి సహా నలుగురు ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్ శివార్లలోని మెదక్ జిల్లా కొల్లూర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్‌పై ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ప్రతీక్‌తో పాటు సుజిత్‌కుమార్, చంద్రారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. 2012 ఆగస్టు 21: మాజీ మంత్రి పులి వీరన్న కుమారుడు ప్రవీణ్ తేజ ఓఆర్ఆర్పై దుర్మరణం చెందాడు. ఈయన ప్రయాణిస్తున్న కారు టరి్నంగ్ తీసుకుంటూ అదుపుతప్పి బోల్తా పడింది. 2015 నవంబర్ 25: మాజీ డీజీపీ, ప్రభుత్వ సలహాదారు పేర్వారం రాములు మనుమడు వరుణ్ పవార్, బంధువు రాహుల్ పవార్ సహా ముగ్గురు మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న కారు ఓఆర్ఆర్పై ముందు వెళ్తున్న పాల వ్యాన్‌ను బలంగా ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. 2016 మే 17: మాజీ మంత్రి, ఏపీ ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు ప్రయాణిస్తున్న కారు ఓఆర్ఆర్ రెయిలింగ్‌ను (క్రాష్ బ్యారియర్) బోల్తా కొట్టిన ఘటనలో ఆయన భార్య సాహిత్యవాణి, డ్రైవర్ స్వామిదాసు అక్కడిక్కడే కన్నుమూశారు. 2017 మే 10: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నారాయణ విద్యాసంస్థల అధినేత, అప్పటి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ కుమారుడు పి.నిశిత్ నారాయణ, అతడి స్నేహితుడు కామని రాజా రవిచంద్ర దుర్మరణం పాలయ్యారు. -
అర్థరాత్రి నుంచి ఓఆర్ఆర్పై రాకపోకలు
సాక్షి, హైదరాబాద్ : లాక్డౌన్ కారణంగా రాకపోకలు నిషేధించిన ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)పై బుధవారం అర్థరాత్రి నుంచి వాహనాలకు అనుమతి లభించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ రోజు అర్థరాత్రి నుంచి ఓఆర్ఆర్పై వాహనాల రాకపోకలను అనుమతించాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ), హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్( హెచ్‌జీసీఎల్) నిర్ణయించాయి. అయితే ప్రజా ఆరోగ్య రక్షణ చర్యల్లో భాగంగా ఓఆర్ఆర్పై టోల్గేట్ నిర్వహణ సిబ్బంది భద్రతా చర్యలు పాటించాలని నిర్దేశించింది. (ఎమ్మెల్యేను బలిగొన్న మహమ్మారి) కాగా ఓఆర్ఆర్ టోట్ప్లాజాల వద్ద ఫాస్ట్‌టాగ్ నిబందనలు పాటించాల్సి ఉంటుంది. డిజిటల్ పేమెంట్ పద్ధతిలో ఫాస్ట్‌టాగ్ చెల్లింపులకు అవకాశం ఉంటుంది. వాహనదారులు వీలైనంత మేరకు నగదు రహిత లావాదేవీలకు ముందుకు రావాలని హెచ్ఎండీఎ సూచించింది. అయితే కర్ఫ్యూ అమలులో ఉన్న వేళలు (రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ) ఓఆర్ఆర్పై కార్లను అనుమతించడం జరగదు. ఓఆర్ఆర్పై ప్రయాణించే సరకు రవాణా వాహనాల(గూడ్స్ వెహికిల్స్)లో ప్రయాణీకులు ఉన్నట్లుగా టోల్‌ప్లాజా సిబ్బంది గుర్తిస్తే స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందజేయాలని సిబ్బందిని హెచ్ఎండీఏ అధికారులు ఆదేశించారు. (చైనా భయం.. భారత్‌కు వరం ) ‘ఔటర్’పై రైట్ రైట్! -
టాలీవుడ్ యంగ్ హీరోకు ప్రమాదం..!
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌తరుణ్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు నార్సింగ్ సమీపంలో అల్కాపూర్ వద్ద ఔటర్ రింగ్‌రోడ్డుపై ప్రమాదానికి గురైంది. ఈ ఘటన మంగళవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. రాజ్‌తరుణ్ ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడినట్టు తెలిసింది. కారు రోడ్డు పక్కన ఉన్న ప్రహారీ గోడను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. యాక్సిడెంట్ అనంతరం ఆయన వేరే కారులో వెళ్లిపోయినట్టు స్థానికులు చెప్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, కారును రోడ్డు పక్కనే వదిలేసి వెళ్లడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దిల్ రాజు ప్రొడక్షన్లో ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమాలో రాజ్‌తరుణ్ నటిస్తున్నారు. అయితే, ఈ ప్రమాదం నటుడు తరుణ్ కారుకు జరిగినట్టు వార్తలు రావడంతో ఆయన ఖండించారు. -
ట్యాంకర్ బోల్తా...వేల లీటర్ల పాలు వృథా
మేడ్చల్ జిల్లా: ఘట్కేసర్ మండలం ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) వద్ద ఓ పాల ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పాల ట్యాంకర్ డ్రైవర్ వెంకటేశ్వర రావు(40) గాయాలు కావడంతో దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. బోల్తా పడ్డ ట్యాంకర్లో పాలు నిండుగా ఉండటంతో పాలన్నీ వృధాగా పోయాయి. సుమారు పదిహేను వేల లీటర్ల పాలు వృధాగా పోయి ఉంటాయని అంచనా. బోల్తా పడిన ట్యాంకర్ గుంటూరుకు చెందిన శ్రీలక్ష్మి ట్రేడర్స్‌కు చెందిన పాల ట్యాంకర్‌గా గుర్తించారు. మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి నుంచి హైదరాబాద్‌లోని హెరిటేజ్ సంస్థకు పాలను తెస్తున్న క్రమంలో ఈ సంఘటన జరిగింది. -
దారుణ విషాదం..దర్యాప్తు ముమ్మరం
-
దారుణ విషాదం.. దర్యాప్తు ముమ్మరం
సాక్షి, హైదరాబాద్: ఔటర్‌పై ఐదుగురు మృతి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అసలేం జరిగిందన్న అంశంపై నార్సింగి పోలీసులు దృష్టిసారించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు బుధవారం చందానగర్‌లోని ప్రభాకర్‌రెడ్డి కార్యాలయానికి వెళ్లారు. అతడి ఆత్మహత్యకు సంబంధించి కీలక ఆధారాలు దొరికే అవకాశముందని భావిస్తున్నారు. ప్రభాకర్‌రెడ్డి సెల్‌ఫోన్‌ను ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల సెల్ఫోన్ల గురించి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మిగతావారి సెల్ఫోన్లను ప్రభాకర్‌రెడ్డి కావాలనే మాయం చేసినట్టు పోలీసులు గుర్తించారని సమాచారం. ప్రభాకర్‌రెడ్డికి సంబంధించిన ఆర్థిక లావాదేవిల గురించి కుటుంబ సభ్యులు, బంధువులను అడిగి తెలుసుకుంటున్నారు. షేర్ మార్కెట్ వ్యాపారంలో నష్టపోయాడు, ఎంతమంది పేర్లతో షేర్ ఖాతాలు నిర్వహిస్తున్నాడనే వివరాలు ఆరా తీస్తున్నారు. అశోక్‌నగర్‌లోని ప్రభాకర్‌రెడ్డి ఇంటి నుంచి ల్యాప్‌టాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ప్రభాకర్‌రెడ్డి కారులో ప్రయాణించిన మార్గాల్లో సీసీ కెమెరాల ఫుటేజీని నార్సింగి పోలీసులు పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఉన్న కొల్లూరు సమీపంలో ప్రభాకర్‌రెడ్డి, ఆయన భార్య, కొడుకు, పిన్ని, ఆమె కూతురు విగతజీవులుగా పడివుండటాన్ని మంగళవారం గుర్తించారు. తనతోపాటు ఉన్న నలుగురికి విషమిచ్చి తర్వాత ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. షేర్ల మార్కెట్లో వచ్చిన నష్టాల కారణంగానే ప్రభాకర్‌రెడ్డి ఈ దారుణానికి పాల్పడినట్టు భావిస్తున్నారు. -
‘ఏం జరిగిందో పోలీసులే చెప్పాలి’
-
‘ఏం జరిగిందో పోలీసులే చెప్పాలి’
హైదరాబాద్: నగర శివార్లలోని కొల్లూరు సమీపంలో వెలుగుచూసిన ఐదుగురి మృతి కేసులో దర్యాప్తు చేపట్టామని డీసీపీ విశ్వప్రసాద్ తెలిపారు. మృతులు పటాన్చెరు అమీన్‌పూర్‌కు చెందిన ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులుగా గుర్తించామన్నారు. వీరికి మృతికి కారణాలు ఇంకా తెలియలేదన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు చూడటానికి వెళ్తున్నట్టు చెప్పి కారులో వెళ్లారని వెల్లడించారు. ప్రభాకర్‌రెడ్డి, ఆయన బంధువు రవీందర్‌రెడ్డి, అతడి భార్య లక్ష్మికి డిమాట్ ఖాతాలున్నాయని.. వీటి ద్వారా రూ. కోటి 30 లక్షల విలువైన షేర్లు కొనుగోలు చేసినట్టు తెలిపారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరు దగ్గర ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో మంగళవారం ఐదు మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మృతులు రెండు కుటుంబాలకు చెందినవారిగా గుర్తించారు. వీరు ఆత్మహత్య చేసుకున్నారా, ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, తన కొడుకు షేర్ మార్కెట్ వ్యాపారం నిర్వహిస్తున్నాడని, ఇందులో నష్టాలు వచ్చాయని ప్రభాకర్‌రెడ్డి తండ్రి మహిపాల్‌రెడ్డి తెలిపారు. ఆర్థిక లావాదేవిల కారణంగా కొంతకాలంగా బాధల్లో ఉన్నాడని, దసరాకు కూడా తమ ఇంటికి రాలేదని వెల్లడించారు. షేర్ మార్కెట్లో ఎలాంటి నష్టం వచ్చినా అధైర్యపడొద్దని చాలాసార్లు చెప్పినట్టు ప్రభాకర్‌రెడ్డి బంధువు రవీందర్‌రెడ్డి తెలిపారు. ‘నా వ్యాపారాన్ని ప్రభాకర్‌రెడ్డి, నా భార్య లక్ష్మి చూసుకుంటోంది. వ్యాపారంలో నష్టం వచ్చిన సంగతి నాకు తెలియదు. ఎంత నష్టం వచ్చినా ఆత్మహత్య చేసుకునే మనస్తత్వం ఆమెదికాదు. ప్రభాకర్‌రెడ్డి చాలా మంచి వ్యక్తి. ఏం జరిగిందో పోలీసులే చెప్పాలి. మేం ఆర్థికంగా నష్టాల్లో లేము. బాగానే ఉన్నామ’ని రవీందర్‌రెడ్డి చెప్పారు. -
షాక్: ఓఆర్ఆర్ వద్ద అయిదు మృతదేహాలు..
సాక్షి, హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరు సమీపంలోని ఇంద్రాణినగర్ వద్ద అయిదు గుర్తుతెలియని మృతదేహాలు బయటపడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఓఆర్ఆర్ సమీపంలోని నిర్మానుష్యప్రాంతంలో ఇద్దరు పురుషులు, ఇద్దరు యువతులు(22), ఒక మహిళ(40) మృతదేహాలను గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో భార్యాభర్తలు, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు నిర్దారించారు. మృతులను పటాన్చెరు అమీన్పూర్ కు చెందిన ప్రభాకర్ రెడ్డి కుటుంబంగా గుర్తించారు. మృతులు.. ప్రభాకర్ రెడ్డి, మాధవి, హిందూజా, లక్ష్మీ, వర్షిత్ రెడ్డి. శ్రీశైలం వెళ్తున్నట్లు చెప్పిన వారు.. శవమై కనిపించారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా రెండ్రోజుల క్రితం పటాన్చెరువు పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసుగా నమోదైనట్లు సమాచారం. మూడు రోజుల క్రితం వీరంతా ఎపీ 28 DM 3775 కారులో బయలుదేరారు. వీరెక్కడికి వెళ్లారో తెలియక బంధువులు పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశారు. మూడు రోజులుగా వీరంతా ఎక్కడికి వెళ్లారు అన్నది మిస్టరీగా మారింది. ఆర్థిక కారణాలు వల్లే వారు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. కొల్లూరు సమీపంలో మృతదేహాలు కలకలం -
కారు బోల్తా: ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాలు
శంషాబాద్ ఔటర్‌రింగురోడ్డుపై శుక్రవారం ఉదయం కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. తోటి వాహనదారులు వెంటనే స్పందించి వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అలాగే వరంగల్ జిల్లాలో వర్దన్నపేట మండలం పంపిణి గ్రామంలో శుక్రవారం ఉదయం ఓ ట్రాలీ రెండు లారీల మధ్య ఇరుక్కుంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు.