ORR Accidents: విషాదం నింపుతున్న రోడ్డు ప్రమాదాలు | Massive Car Accidents in Hyderabad Outer Ring Road | Sakshi
Sakshi News home page

ORR Accidents: విషాదం నింపుతున్న రోడ్డు ప్రమాదాలు

Published Sat, Feb 24 2024 9:36 AM | Last Updated on Sat, Feb 24 2024 10:45 AM

Massive Car Accidents in Hyderabad Outer Ring Road - Sakshi

సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని రోడ్లతో పాటు ఔటర్‌ రింగ్‌ రోడ్‌ (ఓఆర్‌ఆర్‌) సైతం అనేక మంది ప్రముఖులను బలిగొన్నాయి. అక్కడ జరిగిన ఘోర ప్రమాదాల్లో వీఐపీలతో పాటు వారి కుటుంబీకులూ మృత్యువాతపడ్డారు. బాబూమోహన్‌ కుమారుడు పవన్‌ కుమార్‌ నుంచి ఎమ్మెల్యే లాస్య నందిత వరకు ఇలా అర్థాంతరంగా ఊపిరి ఆగిన వాళ్లు ఎందరో ఉన్నారు. ఈ రోడ్డు ప్రమాదాల విషయంలో కొందరు ప్రయాణిస్తున్న వాహనాలు మితిమీరిన వేగంతో ఉండటం,  మరికొందరు సీటు బెల్ట్‌లు, హెల్మెట్లు ధరించకపోవడం వారి పాలిట శాపాలయ్యాయి.  

2000 ఏప్రిల్‌ 22: మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌ నుంచి తిరిగి వస్తూ శంషాబాద్‌ సమీపంలోని పాల్మాకుల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నాటి మంత్రి పి.ఇంద్రారెడ్డి అసువులు బాశారు. 

2003 అక్టోబర్‌ 12: అప్పటి రాష్ట్ర కారి్మక శాఖ మంత్రి బాబూమోహన్‌ పెద్ద కుమారుడు పి.పవన్‌కుమార్‌ రసూల్‌పుర నుంచి జూబ్లీహిల్స్‌కు బైక్‌పై వస్తుండగా... జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ వద్ద రోడ్‌ డివైడర్‌ను ఢీ కొట్టడంతో మృత్యువాతపడ్డాడు. 

2010 జూన్‌ 20: ప్రముఖ సినీనటుడు, బీజేపీ నేత కోట శ్రీనివాసరావు కుమారుడు ప్రసాద్‌ హైదరాబాద్‌ శివార్లలోని ఓఆర్‌ఆర్‌పై జరిగిన ప్రమాదంలో కన్నుమూశారు. ఈయన ప్రయాణిస్తున్న హైస్పీడ్‌ ద్విచక్ర వాహనం మరో వాహనాన్ని ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.  

2011 సెపె్టంబర్‌ 11: హైదరాబాద్‌ శివార్లలోని ఔటర్‌ రింగ్‌రోడ్‌పైన పుప్పాలగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ కుమారుడు అయాజుద్దీన్‌ కన్నుమూశాడు.  

2011 డిసెంబర్‌ 20: మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమారుడు ప్రతీక్‌రెడ్డి సహా నలుగురు ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్‌ శివార్లలోని మెదక్‌ జిల్లా కొల్లూర్‌ వద్ద ఔటర్‌ రింగ్‌ రోడ్‌పై ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ప్రతీక్‌తో పాటు సుజిత్‌కుమార్, చంద్రారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. 

2012 ఆగస్టు 21: మాజీ మంత్రి పులి వీరన్న కుమారుడు ప్రవీణ్‌ తేజ ఓఆర్‌ఆర్‌పై దుర్మరణం చెందాడు. ఈయన ప్రయాణిస్తున్న కారు టరి్నంగ్‌ తీసుకుంటూ అదుపుతప్పి బోల్తా పడింది.  

2015 నవంబర్‌ 25: మాజీ డీజీపీ, ప్రభుత్వ సలహాదారు పేర్వారం రాములు మనుమడు వరుణ్‌ పవార్, బంధువు రాహుల్‌ పవార్‌ సహా ముగ్గురు మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న కారు ఓఆర్‌ఆర్‌పై ముందు వెళ్తున్న పాల వ్యాన్‌ను బలంగా ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది.  

2016 మే 17: మాజీ మంత్రి, ఏపీ ఆప్కాబ్‌ చైర్మన్‌ పిన్నమనేని వెంకటేశ్వరరావు ప్రయాణిస్తున్న కారు ఓఆర్‌ఆర్‌ రెయిలింగ్‌ను (క్రాష్‌ బ్యారియర్‌) బోల్తా కొట్టిన ఘటనలో ఆయన భార్య సాహిత్యవాణి, డ్రైవర్‌ స్వామిదాసు అక్కడిక్కడే కన్నుమూశారు. 

2017 మే 10: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ రోడ్‌  నెం.36లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నారాయణ విద్యాసంస్థల అధినేత, అప్పటి ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ శాఖ మంత్రి పి.నారాయణ కుమారుడు పి.నిశిత్‌ నారాయణ, అతడి స్నేహితుడు కామని రాజా రవిచంద్ర దుర్మరణం పాలయ్యారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement