ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన రాజేంద్రనగర్ హిమాయత్‌సాగర్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో శనివారం చోటుచేసుకుంది.
శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న మినీ డీసీఎం వాహనం రోడ్డు పక్కన నిల్చొని ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో డీసీఎం డ్రైవర్ సహా మరో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా.. క్యాబిన్‌లో ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన పోలీసులు క్షతగాత్రులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.