outer ring road accident
-
ఔటర్ రింగురోడ్డుపై కారు దగ్ధం
-
‘ఓఆర్ఆర్’పై ఘోర రోడ్డు ప్రమాదం.. తల తెగిపడి వ్యక్తి మృతి
సాక్షి,హైదరాబాద్: శంషాబాద్ ఔటర్‌రింగ్‌రోడ్డు(ఓఆర్ఆర్)పై మంగళవారం(ఆగస్టు 6) ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. వేగంగా ఢీకొట్టడంతో ఆ వ్యక్తి కారు అద్దంలో ఇరుక్కుపోయాడు. ప్రమాద తీవ్రతకు వ్యక్తి తల తెగి కారు వెనకాల సీటులో పడిపోయింది. అద్దంలో ఇరుక్కుపోయిన వ్యక్తిని కారు కొంత దూరం వరకు లాక్కొని పోవడంతో తల తెగి పడింది. మృతుడు శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఉట్పల్లి గ్రామానికి చెందిన తోట్ల అంజయ్యగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఔటర్ రింగ్ రోడ్డులో బస్సు బోల్తా.. ఇద్దరు మృతి
సాక్షి,హైదరాబాద్ : హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి ఔటర్ రింగు రోడ్డు మీదుగా ముంబాయి వెళుతున్న మార్నింగ్ స్టార్ బస్సు నార్సింగ్ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 2 ప్రయాణికులు మృతి చెందారు. 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ క్షతగాత్రులను అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు బస్సు ప్రమాదం 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
ORR Accidents: విషాదం నింపుతున్న రోడ్డు ప్రమాదాలు
సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని రోడ్లతో పాటు ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) సైతం అనేక మంది ప్రముఖులను బలిగొన్నాయి. అక్కడ జరిగిన ఘోర ప్రమాదాల్లో వీఐపీలతో పాటు వారి కుటుంబీకులూ మృత్యువాతపడ్డారు. బాబూమోహన్ కుమారుడు పవన్ కుమార్ నుంచి ఎమ్మెల్యే లాస్య నందిత వరకు ఇలా అర్థాంతరంగా ఊపిరి ఆగిన వాళ్లు ఎందరో ఉన్నారు. ఈ రోడ్డు ప్రమాదాల విషయంలో కొందరు ప్రయాణిస్తున్న వాహనాలు మితిమీరిన వేగంతో ఉండటం, మరికొందరు సీటు బెల్ట్‌లు, హెల్మెట్లు ధరించకపోవడం వారి పాలిట శాపాలయ్యాయి. 2000 ఏప్రిల్ 22: మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ నుంచి తిరిగి వస్తూ శంషాబాద్ సమీపంలోని పాల్మాకుల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నాటి మంత్రి పి.ఇంద్రారెడ్డి అసువులు బాశారు. 2003 అక్టోబర్ 12: అప్పటి రాష్ట్ర కారి్మక శాఖ మంత్రి బాబూమోహన్ పెద్ద కుమారుడు పి.పవన్‌కుమార్ రసూల్‌పుర నుంచి జూబ్లీహిల్స్‌కు బైక్‌పై వస్తుండగా... జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద రోడ్ డివైడర్‌ను ఢీ కొట్టడంతో మృత్యువాతపడ్డాడు. 2010 జూన్ 20: ప్రముఖ సినీనటుడు, బీజేపీ నేత కోట శ్రీనివాసరావు కుమారుడు ప్రసాద్ హైదరాబాద్ శివార్లలోని ఓఆర్ఆర్పై జరిగిన ప్రమాదంలో కన్నుమూశారు. ఈయన ప్రయాణిస్తున్న హైస్పీడ్ ద్విచక్ర వాహనం మరో వాహనాన్ని ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 2011 సెపె్టంబర్ 11: హైదరాబాద్ శివార్లలోని ఔటర్ రింగ్రోడ్పైన పుప్పాలగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కుమారుడు అయాజుద్దీన్ కన్నుమూశాడు. 2011 డిసెంబర్ 20: మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమారుడు ప్రతీక్‌రెడ్డి సహా నలుగురు ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్ శివార్లలోని మెదక్ జిల్లా కొల్లూర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్‌పై ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ప్రతీక్‌తో పాటు సుజిత్‌కుమార్, చంద్రారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. 2012 ఆగస్టు 21: మాజీ మంత్రి పులి వీరన్న కుమారుడు ప్రవీణ్ తేజ ఓఆర్ఆర్పై దుర్మరణం చెందాడు. ఈయన ప్రయాణిస్తున్న కారు టరి్నంగ్ తీసుకుంటూ అదుపుతప్పి బోల్తా పడింది. 2015 నవంబర్ 25: మాజీ డీజీపీ, ప్రభుత్వ సలహాదారు పేర్వారం రాములు మనుమడు వరుణ్ పవార్, బంధువు రాహుల్ పవార్ సహా ముగ్గురు మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న కారు ఓఆర్ఆర్పై ముందు వెళ్తున్న పాల వ్యాన్‌ను బలంగా ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. 2016 మే 17: మాజీ మంత్రి, ఏపీ ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు ప్రయాణిస్తున్న కారు ఓఆర్ఆర్ రెయిలింగ్‌ను (క్రాష్ బ్యారియర్) బోల్తా కొట్టిన ఘటనలో ఆయన భార్య సాహిత్యవాణి, డ్రైవర్ స్వామిదాసు అక్కడిక్కడే కన్నుమూశారు. 2017 మే 10: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నారాయణ విద్యాసంస్థల అధినేత, అప్పటి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ కుమారుడు పి.నిశిత్ నారాయణ, అతడి స్నేహితుడు కామని రాజా రవిచంద్ర దుర్మరణం పాలయ్యారు. -
574 ప్రమాదాల్లో 273 దుర్మరణం
ఔటర్.. డేంజర్ జిల్లాలోని పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలోని ఔటర్ రింగ్ రోడ్డు అంటేనే జిల్లా ప్రజలు అమ్మో.. అంటున్నారు. తరుచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో బెంబేలెత్తిపోతున్నారు. నవంబర్ 10వ తేదీన పాటి వద్ద జరిగిన ప్రమాదంలో ఆరుగురు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయినా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రమాదాలను అరికట్టడంలో విఫలమవుతున్నారు. స్పీడ్ గన్స్ ఏర్పాటు చేసినా అవి వేగ నియంత్రణకు ఫలితాలివ్వడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే జిల్లాలోని జాతీయ రహదారులు గుంతలమయంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది జిల్లాలో జరిగిన 574 ప్రమాదాల్లో 273 మృతి చెందగా 566 మంది క్షతగాత్రులయ్యారు. సంగారెడ్డి అర్బన్: ఔటర్ రింగ్‌రోడ్డుపై లాక్డౌన్లో మినహా తరుచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అతివేగమే కారణమని అధికారులు అంచనావేస్తున్నారు. పటాన్చెరు నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం కావడం, జిల్లా కేంద్రంతో పాటు ముంబాయి, ఆంధ్రాకు ఔటర్ రింగురోడ్డు మీదుగా లక్షల్లో వాహనాలు వెళ్తుంటాయి. అతివేగంతో కొన్ని చోట్ల ప్రమాదాలు జరుగుతుండగా, ఆగి ఉన్న వాహనాలను ఢీ కొట్టి మృత్యువాత పడ్డ సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుత శీతాకాలంలో పొగమంచు వల్ల తెల్లవారు జామున, రాత్రుల్లో ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. వేగాన్ని నియత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సూచిక బోర్డులూ కరువు.. జిల్లాలో జాతీయ రహదారులు, ఆర్అండ్బీ, పంచాయితీరాజ్ రోడ్లపై మూలమలుపులు ఉండటంతో అతివేగంతో వెళ్తున్న వాహనాలు అదుపుతప్పి బోల్తాపడుతున్నాయి. పాదాచారులను, ద్విచక్రవాహనాదారులను ఢీ కొట్టిన సందర్భాలు ఉన్నాయి. అకోలా–నాందేడ్ జాతీయరహదారి శివ్వంపేట వద్ద ఉన్న మూల మలుపు వద్ద తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. చౌటకూర్ వద్ద, అన్నాసాగర్ చెరువు సమీపంలో పసల్‌వాదీ, సంగారెడ్డి సమీపంలో మూలమలుపులతో ప్రమాదం పొంచి ఉంది. ఎంఎన్ఆర్ చౌరస్తా నుంచి పటన్‌చెరు మండలం గణేష్‌గడ్డ వరకు సూమారు 10 మూలమలుపులు ఉన్నాయి. ఇస్మాయిల్‌ఖాన్‌పేట గ్రామంలో ఉన్న ప్రమాదకర మూలమలుపులతో పాదాచారులు మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి. ఆర్‌అండ్‌రోడ్లు, పంచాయితీరోడ్లపై ఉన్న మూల మలుపుల వద్ద సూచికబోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అసంపూర్తిగా 65వ నంబర్ జాతీయ రహదారి పనులు.. 65వ నంబర్ జాతీయ రహదారి పనులు అసంపూర్తిగా ఉండటంతో అతివేగంగా వెళ్తున్న వాహనాలు అదుపుతప్పి బోల్తాపడుతున్నాయి. మల్కాపూర్ చౌరస్తాలో నిర్మిస్తున్న అండర్‌పాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు మూడు ఏళ్లకుపైగా అవుతున్నా పూర్తి కావడం లేదు. మల్లేపల్లి శివారులో ఉన్న బీరు పరిశ్రమల నుంచి ప్రతిరోజు లోడుతో భారీ వాహనాలు వస్తుంటాయి. అసంపూర్తిగా ఉండటంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పెద్దాపూర్‌లో సర్వీస్‌రోడ్డు అసంపూ ర్తిగా ఉంది. దీంతో ప్రయాణికుల బాధలు వర్ణనాతీతం. డ్రైవర్లు అప్రమత్తంగా వాహనాలు నడపాలి డ్రైవర్లు అప్రమత్తంగా ఉండి తమ వాహనాలను జాగ్రత్తగా నడపాలి. అతివేగం పనికిరాదు. కోవిడ్–19 కారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను తగ్గించాం. కొందరు డ్రైవర్లు రోడ్ల వెంబడి వాహనాలను ఇస్టానుసారంగా పార్కింగ్ చేస్తున్నారు. ఇది సరైన పద్దతి కాదు. అతివేగంతో డ్రైవింగ్ చేసే వాహనాలను కట్టడి చేయడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేస్తూన్నాం. అతివేగం, అజాగ్రత్త, డ్రంక్‌అండ్‌డ్రైవ్ చేసి ప్రమాదాలకు కారణం కాకూడదు. – చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్పీ -
అయ్యో అనన్య.. ఎంత ఘోరం!
శంషాబాద్ రూరల్(రాజేంద్రనగర్): అతి వేగం ఓ విద్యార్థిని ప్రాణాలు బలితీసుకుంది. స్నేహితుడి పుట్టినరోజు కావడంతో కేక్ కట్ చేసి విందు కోసం వెళుతుండగా.. కారు అదుపు తప్పింది. డివైడర్‌ను దాటి 50 మీటర్ల వరకూ పల్టీలు కొట్టింది. దీంతో కారులో ఉన్న ఓ యువతి మృత్యువాత పడగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున శంషాబాద్ మండలం బుర్జుగడ్డ తండా సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే కారులో మద్యం బాటిళ్లు లభ్యం కావడంతో ప్రమాదానికి అతివేగంతోపాటు తాగి నడపడం కూడా కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఢిల్లీకి చెందిన అనన్య గోయల్(21) హైదరాబాద్ యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈమెకు నేపాల్ వాసి నిఖిత స్నేహితురాలు. ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కళాశాలలో ఎంబీఏ చదివేటప్పటి నుంచి వీరిద్దరూ ఒకే రూమ్‌లో ఉండేవారు. జోధ్‌పూర్ వాసి జతిన్ పవార్ వీరితో కలసి ఎంబీఏ చదివాడు. ప్రస్తుతం నిఖిత హైదరాబాద్‌లోనే ఉద్యోగాన్వేషణలో ఉంది. జతిన్ కొండాపూర్‌లోని కేపీఎంజీ కంపెనీలో ఇన్‌కంట్యాక్స్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. డివైడర్‌పై నుంచి పల్టీలు కొట్టి.. సోమవారం జతిన్ పుట్టిన రోజు కావడంతో కొండాపూర్‌లో స్నేహితులతో కలసి కేక్ కట్ చేశారు. అక్కడికి అనన్య, నిఖిత వెళ్లారు. కేక్ కటింగ్ అనంతరం విందు కోసం బయలుదేరారు. జతిన్ వీరిద్దరితో కలసి కారులో కొం డాపూర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వచ్చి పెద్ద గోల్కొండ వద్ద జంక్షన్ నుంచి కిందకు దిగారు. అక్కడి నుంచి పీ–వన్ రోడ్డు మార్గంలో పాల్మాకుల వైపు వెళ్తున్నారు. బుర్జుగడ్డ తండా సమీపంలోకి రాగానే మూల మలుపు వద్ద కారు అదుపుతప్పింది. రోడ్డు డివైడర్‌పై నుంచి పల్టీలు కొడుతూ కుడి వైపు ఉన్న రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు వెనుక సీట్లో కూర్చున్న అనన్య తలకు బలమైన గాయాలవ్వగా.. నిఖిత, జతిన్ గాయపడ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ముగ్గురిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అనన్య మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనన్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రాణాలు కాపాడిన సీటు బెల్టు కారు డివైడర్‌పై నుంచి 50 మీటర్ల దూరం వరకు వెళ్లి రోడ్డు అవతలి వైపు పడింది. ఈ సమయంలో జతిన్ డ్రైవింగ్ చేస్తుండగా.. నిఖిత ముందు సీట్లో కూర్చుంది. వీరిద్దరూ సీటు బెల్టు పెట్టుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వెనక సీట్లో కూర్చున్న అనన్య సీటు బెల్టు ధరించకపోవడంతో కారు బోల్తా పడిన సమయంలో కింద పడి తలకు తీవ్ర గాయాలై మృతి చెందింది. కాగా, కారు నడుపుతున్న జతిన్ మద్యం సేవించినట్లు అనుమానిస్తున్నారు. కారులో ఖాళీ మద్యం సీసాలు బయటపడటంతో జతిన్ రక్త నమూనాలను సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయ్యో అనన్య.. ఎంత ఘోరం! -
ఓఆర్ఆర్పై కారు బోల్తా : యువతి మృతి
-
ఔటర్‌పై రోడ్డు ప్రమాదం..ఇద్దరి మృతి
హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన రాజేంద్రనగర్ హిమాయత్‌సాగర్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో శనివారం చోటుచేసుకుంది. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న మినీ డీసీఎం వాహనం రోడ్డు పక్కన నిల్చొని ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో డీసీఎం డ్రైవర్ సహా మరో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా.. క్యాబిన్లో ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన పోలీసులు క్షతగాత్రులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. -
శంషాబాద్ ఔటర్‌రింగ్ రోడ్డుపై ప్రమాదం
రంగారెడ్డి: జిల్లాలో బుధవారం తెల్లవారుజామున శంషాబాద్ ఔటర్‌రింగ్ రోడ్డు సమీపంలో పెద్ద గోల్కొండ వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ఈ రోడ్డుప్రమాదంలో ఒకరు మృతిచెందగా, నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఆగివున్న లారీని మరో లారీ వచ్చి ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో లోడ్ తో ఉన్న లారీ బోల్తా పడింది. బోల్తా పడిన లారీలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. అయితే విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలిసింది. కాగా, గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. -
ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం, ఐదుగురు మృతి
హైదరాబాద్ : నగర శివారులోని ఔటర్‌రింగ్ రోడ్డుపై తరచూ రోడ్డుప్రమాదాలు సంభవిస్తున్నాయి. తాజాగా తుక్కుగూడలో ఔటర్‌రింగ్ రోడ్డుపై శుక్రవారం ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని ఓ కారు ఢీకొనడంతో ఐదుగురు అక్కడిక్కడే దుర్మరణం చెందారు మరో నలుగురి పరిస్థితి విషమం ఉంది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు మగవాళ్లు ఉన్నారు. మృతులది మహారాష్ట్రకు చెందిన వాళ్లుగా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
ఔటర్‌పై టెర్రర్
శంషాబాద్, న్యూస్‌లైన్: ఔటర్ రింగు రోడ్డుపై బైకును కారు ఢీకొన్న ప్రమాదంలో దంపతులు దుర్మరణం పాలయ్యారు. శంషాబాద్ మండలంలోని హుడా కాలనీ సమీపంలో ఆదివారం రాత్రి ఈ ప్రమాదంచోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. శంషాబాద్ మండలం బహదూర్‌గూడకు చెందిన దంపతులు దేవులపల్లి సామెల్(50), లక్ష్మి(45)లు ఆదివారం రాత్రి రాజేంద్రనగర్ నుంచి శంషాబాద్‌కు ఔటర్ రింగు రోడ్డుపై రాంగ్ రూట్లో వస్తున్నారు. కాగా ఔటర్‌పైకి ద్విచక్ర వాహనాల అనుమతి లేకున్నా వీరి టోల్గేట్ సిబ్బందికి తెలియకుండా ఎక్కారు. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వైపు వెళుతున్న ఓ కారు హుడా కాలనీ సమీపంలో వీరి బైకును అతివేగంగా ఢీకొంది. ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కారులో ప్రయాణిస్తున్న వారు వాహనాన్ని రోడ్డుపైనే వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు. కారు మణికొండ గ్రామానికి చెందినదిగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. కారు అతివేగంగా బైకును ఢీకొనడంతో పూర్తిగా నుజ్జునుజ్జయింది. కాగా, బైకులో ఉన్న పత్రాల ద్వారా ఈ వాహనం ఛత్రినాక ప్రాంతానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక క్లస్టర్ ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది.