![Car Accident On Samshabad Outer Ring Road Person Died](/styles/webp/s3/article_images/2024/08/6/Accident1.jpg.webp?itok=O71EaX-y)
సాక్షి,హైదరాబాద్: శంషాబాద్ ఔటర్‌రింగ్‌రోడ్డు(ఓఆర్‌ఆర్)పై మంగళవారం(ఆగస్టు 6) ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. వేగంగా ఢీకొట్టడంతో ఆ వ్యక్తి కారు అద్దంలో ఇరుక్కుపోయాడు.
ప్రమాద తీవ్రతకు వ్యక్తి తల తెగి కారు వెనకాల సీటులో పడిపోయింది. అద్దంలో ఇరుక్కుపోయిన వ్యక్తిని కారు కొంత దూరం వరకు లాక్కొని పోవడంతో తల తెగి పడింది. మృతుడు శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఉట్పల్లి గ్రామానికి చెందిన తోట్ల అంజయ్యగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment