samshabad
-
‘ఓఆర్ఆర్’పై ఘోర రోడ్డు ప్రమాదం.. తల తెగిపడి వ్యక్తి మృతి
సాక్షి,హైదరాబాద్: శంషాబాద్ ఔటర్‌రింగ్‌రోడ్డు(ఓఆర్ఆర్)పై మంగళవారం(ఆగస్టు 6) ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. వేగంగా ఢీకొట్టడంతో ఆ వ్యక్తి కారు అద్దంలో ఇరుక్కుపోయాడు. ప్రమాద తీవ్రతకు వ్యక్తి తల తెగి కారు వెనకాల సీటులో పడిపోయింది. అద్దంలో ఇరుక్కుపోయిన వ్యక్తిని కారు కొంత దూరం వరకు లాక్కొని పోవడంతో తల తెగి పడింది. మృతుడు శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఉట్పల్లి గ్రామానికి చెందిన తోట్ల అంజయ్యగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అప్సర కేసులో పోలీసులు కీలక నిర్ణయం సాయి కృష్ణను..!
-
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి మెట్రో రైల్.. త్వరలో శంకుస్థాపన..
-
డబుల్ వీసాలు.. ఏజెంట్ల మోసాలు
44 women Flying To Kuwait Were Caught At RGI : ఏజెంట్లు తప్పుదారి పట్టించడంతో రెండు వీసాలతో కువైట్ వెళ్లేందుకు ప్రయత్నించిన 44 మంది మహిళలు శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడ్డారు. వారిని ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గోవా రాష్ట్రాలకు చెందిన 44 మంది మహిళలు మంగళవారం తెల్లవారుజామున కువైట్ వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. ఇమిగ్రేషన్ అధికారుల తనిఖీల్లో మహిళలు ముందుగా విజిట్ వీసాలు చూపించారు. కువైట్‌కు ఎందుకు వెళ్తున్నారని అధికారులు ప్రశ్నించ గా కొందరు ఉపాధి నిమిత్తం వెళ్తున్నట్టు చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు వారి వద్ద ఉన్న అన్ని పత్రాలను పరిశీలించారు. మహిళలందరి వద్ద విజిట్ వీసాలతో పాటు వర్క్ వీసాలు కూడా లభ్యమయ్యాయి. ఏజెంట్ల సాయంతో బయల్దేరి న మహిళలకు రెండు వీసాలతో వెళ్లడం నేర మని కూడా తెలియదు. ఉపాధి దొరుకుతుందన్న ఆశతో ఏజెంట్లు సమకూర్చిన రెండు వీసాలతో కువైట్‌కు బయల్దేరారు. వారంతా ఉపాధి నిమిత్తం వెళ్తున్న వారిగా నిర్ధారించుకున్న అధికారులు ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించగా దర్యాప్తు ప్రారంభించారు. వారికి తెలియకుండా.. మూడు రాష్ట్రాలకు చెందిన మహిళలందరు కూడా ఒకే విమానంలో కువైట్‌కు వెళ్లేందుకు వచ్చారు. వీరంతా ఆయా ప్రాంతాల సబ్‌ఏజెంట్లతో పాటు ప్రధాన ఏజెంట్లకు అనుసం ధానంగా వీసాలు పొందినట్లు పోలీసుల ద ర్యాప్తులో తేలింది. ప్రధాన ఏజెంట్ ముంబై కి చెందినట్టు గుర్తించారని సమాచారం. గతంలో కూడా సదరు ఏజెంట్ ద్వారా వెళ్లిన మహిళలు ఇదే తరహా మోసానికి గురయ్యా రు. ఒక్కొక్కరు సుమారు రెండు నుంచి రూ.3 లక్షల వరకు చెల్లించినట్లు సమాచారం. వీసాల్లో ఉన్న పొరపాట్లను మహిళలకు తెలియకుండానే ఏజెంట్లు ఈ వ్యవహారాన్ని నడిపించినట్లు పోలీసులు భావిస్తున్నారు. విజిట్ వీసాను ఇక్కడ బయలుదేరే సమ యంలో చూపించాలని, వర్క్ వీసాలను కు వైట్‌లో చూపించాలని మహిళలకు ఏజెంట్లు చెప్పినట్లు సమాచారం. మహిళల్లో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల వారున్నారు. రెండు వీసాలు ఎందుకు..? పదో తరగతి కన్నా తక్కువ విద్యార్హత కలిగిన వారు కొన్ని దేశాల్లో ఉపాధి నిమిత్తం వెళ్లడానికి ఇమిగ్రేషన్ చట్టం 1983 ప్రకారం ఈసీఆర్ (ఇమిగ్రేషన్ చెకింగ్ రిక్వైర్డ్)లో భాగంగా ప్రొటెక్షన్ ఆఫ్ ఇమిగ్రేషన్ పత్రాన్ని కలిగి ఉండాలి. ఈ ప్రక్రియను పూర్తి చేయకుండానే కార్మికులను పెద్ద ఎత్తున ఏజెంట్లు తరలిస్తుంటారు. అక్కడికి వెళ్లిన తర్వాత వర్కింగ్ వీసాలను వాడుకునేందుకు వాటిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏజెంట్లపై కేసు ఉపాధి నిమిత్తం వెళ్తున్న మహిళలకు ఏజెంట్లు విజిట్ వీసాలు జారీ చేశారు. వర్కింగ్ వీసాలకు ఈసీ ఆర్ లేకుండా వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే వారికి విజిట్ వీసాలతో పాటు వర్కింగ్ వీసాలు అందజేశారు. ఏజెంట్లపైనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. మహిళలను బాధితులుగానే పరిగణిస్తున్నాం. – విజయ్‌కుమార్, సీఐ, ఆర్జీఐఏ అయోమయంగా ఉంది.. మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఉపా ధి నిమిత్తం కువైట్ వెళ్లడానికి వచ్చాం.. మా వద్ద రెండు వీసాలున్నాయని అధికారులు నిలిపివేసి పోలీస్‌స్టేషన్‌కు పంపారు. గతంలో లాక్డౌన్లో కూడా వీసాలు రద్దయ్యాయి. ఇప్పుడేమో ఇలా.. అంతా అయోమయంగా ఉంది. – బాధిత మహిళ -
ఎన్నిసార్లు చెప్పినా అంతే..! ఒకరింట్లో విందు.. మరొకరింట్లో నిద్ర బందు
సాక్షి, శంషాబాద్: ఒకరి ఇంట్లోని శుభకార్యం మరో ఇంటికి తీవ్ర ఇబ్బందిని కలిగిస్తోంది. ఓ వైపు టపాసుల మోత.. మరో వైపు శబ్దాల హోరుతో పలు ఫంక్షన్‌హాళ్ల వద్ద అర్ధరాత్రి వరకు జరుగుతున్న కార్యక్రమాలకు సమీప కాలనీల ప్రజలు నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తోంది. ఒకే చోట ఐదు.. ►శంషాబాద్‌లోని సిద్ధంతి, నక్షత్ర, సాయినగర్ కాలనీ సమీపంలో ఒకే చోట ఐదు ఫంక్షన్‌హాళ్లు ఉన్నాయి. ఒకే చోట అధిక సంఖ్యలో ఇవి ఉండటం వల్ల ఎలాంటి కార్యక్రమాలు జరిగినా సమీప కాలనీ వాసులకు వీటి శబ్దం కారణంగా తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. పలుసార్లు ఫిర్యాదు.. ►అనుమతి లేకుండానే అర్ధరాత్రి వరకు పెద్ద ఎత్తున సౌండ్ బాక్సుల శబ్దాలు, టపాసుల మోతతో పరిస్థితి దారుణంగా మారుతోంది. ఈ విషయంపై కాలనీ వాసులు పలుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకే సారి అన్ని ఫంక్షన్‌హాళ్లలో వేడుకలు జరిగినప్పుడు శబ్దం తీవ్రత మరింతగా బాధిస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లేజర్ కాంతులపై నిషేధం.. ►విమానాశ్రయానికి సుమారు 8 కిలో మీటర్ల వరకు ఎలాంటి లేజర్ కాంతులు ఏర్పాటు చేయకూడదని గతంలో అనేకసార్లు ఎయిర్‌పోర్టు అధికారులతో పాటు స్థానిక సంస్థలు కూడా ఫంక్షన్ హాళ్లకు నోటీసులు జారీ చేశాయి. గతంలో పోలీసుల దృష్టి పెట్టినప్పుడు కొంత మేర తగ్గించి తిరిగి యథాతథంగా కొనసాగిస్తున్నారని వాపోతున్నారు. తెల్లవారే వరకు శబ్ధాలు.. ఒక్కోసారి రాత్రి నుంచి తెల్లారే వరకు కూడా శబ్దాల హోరు తగ్గడం లేదు. టపాసుల మోతతో పాటు సౌండ్ బాక్సుల్లో మితిమీరిన శబ్దం ఫంక్షన్ హాళ్ల నుంచి వెలువడుతోంది. వీటిని నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. – రాజిరెడ్డి, సాయినగర్ కాలనీ -
పురపాలనలోకి శంషాబాద్
శంషాబాద్: అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుతో ప్రపంచపటంలో చోటు సంపాదించుకున్న శంషాబాద్ మేజర్ గ్రామపంచాయతీ ఆదివారం నుంచి పురపాలనలోకి అడుగులు పెట్టింది. అరవై ఏళ్ల గ్రామీణ పాలన శనివారంతో ముగిసింది. 1959 అక్టోబరు 29 శంషాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ పాలన ప్రారంభమై 2019 ఏప్రిల్ 20 నాటికి ముగిసింది. అరవై ఏళ్ల వ్యవధిలో మొత్తం 8 మంది సర్పంచ్‌లుగా పనిచేశారు. ఇందులో మామిడి దయానంద్‌రెడ్డి 1970 నుంచి 1988 వరకు రికార్డు స్థాయిలో సర్పంచ్‌గా పనిచేశారు. ఆ తర్వాత కూడా మరో దఫా 1995 నుంచి 2001 వరకు ఐదేళ్ల పాటు శంషాబాద్ సర్పంచ్‌గా పనిచేశారు. అందరోని అబాదీగా.. శంషాబాద్ గ్రామాన్ని నిజాం పాలనలో అందరోని అబాదీగా పిలిచేవారని పూర్వీకులు చెబుతుంటారు. గ్రామానికి నాలుగు వైపులా గౌనీలు (పెద్ద ఎత్తున దర్వాజాలు) ఉండి చుట్టూ పెద్ద ప్రహరీ గోడ ఉండేది. ఆ తర్వాత నిజాం బంధువులైన శంషాద్‌బేగం పేరిట దీనిని శంషాబాద్‌గా మార్చినట్లు చరిత్ర చెబుతోంది. చారిత్రక కట్టాడాలకు నెలవు శంషాబాద్ చారిత్ర కట్టడాలకు నెలవైన ప్రాంతం. శంషాబాద్ పాత గ్రామంలో పాత పోలీస్‌స్టేషకు సుమారు వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. ఈ కట్టడానికి ఇప్పటికే ‘హెరిటేజ్’ గుర్తింపు కూడా దక్కింది. నేటికీ ఠాణాగా ఈ భవనం సేవలందిస్తోంది. పాలరాతి కొండపై వెలిసిన చోళరాజుల కాలం నాటి సిద్దులగుట్ట దేవాయలం ఎంతో ప్రసిద్ధి చెందింది. సంతానం కోసం ఇక్కడ మొక్కుకుంటే సంతానం కలుగుతుందని నమ్మకం. ఇక్కడ మొక్కుకున్న వారికి సంతానం కలిగితే పిల్లలకు సిద్దప్ప, సిద్దులు, సిద్దేశ్వర్ నామకరణ చేస్తూ ఉంటారు. శంషాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాలో ఈ పేర్లతో వందల సంఖ్యల్లో ఉంటారు. శంషాబాద్ మొదటి సర్పంచ్ సిద్దప్ప అయితే.. చివరి సర్పంచ్ సిద్దేశ్వర్ కావడం కూడా ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక ఆలయానికి సమీపంలో ఉన్న వేట బంగళా కూడా నేటికీ రాజదర్పాని ఒలకబోస్తోంది. దీంతో పాటు శంషాబాద్ (ఉందానగర్) రైల్వేస్టేషన్ పాతభవనం కూడా ఎంతో చారిత్రాత్మకమైనది. దీంతో దశాబ్దాలకాలంగా శంషాబాద్ ప్రజలకు వైద్యసేవలందించిన పాత బంగళా కూడా నాడు ‘ముసాఫిర్ ఖానా’ ప్రయాణికుల విడిది కేంద్రంగా కొనసాగిందని చరిత్రలో ఉంది. ఇలా ఎన్నో చరిత్రలకు శంషాబాద్ వేదికగా మారింది. మినీభారత్‌గా... శంషాబాద్‌కు పారిశ్రామిక వాడతో పాటు 2008 మార్చి 23 నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రారంభం కావడంతో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇక్క జీవనం సాగిస్తున్నారు. సమీపంలో పారిశ్రామిక వాడ సైతం ఉడడంతో శంషాబాద్ జనాభా గత పదేళ్లలో భారీగా పెరిగింది. శంషాబాద్ పట్టణంతో పాటు ప్రస్తుత మున్సిపాలిటీ పరిధిలోని అన్ని గ్రామాలు కలుపుకుని సుమారు యాభైవేలకు పైగా జనాభా ఉంది. దీనికి తోడు వాణిజ్య, వ్యాపారా కేంద్రాలతో నిత్యం రాకపోకలు సాగించే వారు వేలల్లో ఉంటారు. నిబంధనలు తూచ్.. చారిత్రాత్మకమైనన శంషాబాద్‌లో అక్రమ కట్టడాలు ఎక్కువగానే వెలస్తున్నాయి. 111 జీవో నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమార్కులు వందల సంఖ్యలో భారీ నిర్మాణాలను చేపట్టారు. పట్టణంలోని ఫిరంగి నాలాను మురుగుకాల్వలా మార్చారు. ఫిరంగినాలాను ఆక్రమంచి నిర్మాణాలు చేపట్టినా పట్టించుకునే వారే లేకుండా పోయారు. దీంతో ఇక్కడ ఫిరంగి నాలా ఉనికి ప్రశ్నార్థంకగా మారుతోంది. యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపట్టడం వాటికి కావాల్సిన నీటి వసతి కోసం విచ్చలవిడిగా బోర్లు వేయడం ఇక్కడ పరిపాటిగా మారింది. రహదారులపై కూడా బోర్లు వేసే దారుణ పరిస్థితులు శంషాబాద్‌లో నిత్యకత్యంగా మారుతున్నాయి. కొత్త పాలనలోకి అడుగులు పెట్టిన సందర్భంగానైనా అడ్డుకట్టపడుతుందా.. అందుకు అనుగుణంగా అధికార వ్యవస్థ పనిచేస్తుందా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తొలి కమిషనర్‌గా.. శంషాబాద్ మేజర్ గ్రామ పంచాయతీతో పాటు గొల్లపల్లి, తొండుపల్లి, ఊట్పల్లి, సాతంరాయి కొత్వాల్గూడతో కలిపిన శంషాబాద్ మున్సిపాలిటీకి తొలి కమిషనర్‌గా చాముండేశ్వరీ నియమితులయ్యారు. ఇప్పటికే ఆమె మున్సిపాలిటీలో భాగమైన గొల్లపల్లి, తొండుపల్లి, ఊట్పల్లిలో పురపాలనను ప్రారభించారు. పౌరుల భాగస్వామ్యంతో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తొలి కమిషనర్ అన్నారు. -
పసికందు మృతదేహం కుక్కలపాలు
శంషాబాద్: ఓ పసికందు మృతదేహాన్ని వీధికుక్కలు పీక్కుతిన్న సంఘటన శంషాబాద్ వీకర్ సెక్షన్ కాలనీలో గురువారం కలకలం రేపింది. బతికున్న పసి కందునే గుర్తు తెలియని వ్యక్తులు పడేసి ఉం డొచ్చని భావించిన స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వీధి కుక్కలను పసికందు మృతదేహం వద్ద నుంచి తరిమేసిన స్థానికులు అక్కడి నుంచి స్థానిక ప్రభుత్వాసుపత్రి వద్దకు వెళ్లి వాకబు చేయగా అసలు విషయం బయటపడింది. ఈనెల 15న మధ్యాహ్నం రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్‌దేవ్‌పల్లి బస్తీ నుంచి గర్భిణి సునిధికుమార్ ఆమె భర్త రజనిసుమన్ శంషాబాద్ ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. నొప్పులు వస్తున్న ఆమెను పరిశీలించిన ఆస్పత్రి వైద్యులు.. గర్భంలో ఉన్న శిశువు మృతిచెందినట్లుగా గుర్తించారు. సాయంత్రం ఆరుగంటలకు ఆడ మృతశిశువును బయటికి తీసి వారికి అప్పగించారు. అయితే, భార్యాభర్తలు మాత్రం ఆ శిశువును ఆస్పత్రికి సంబంధించిన కొందరు సిబ్బందికి డబ్బులు ఇచ్చి ఖననం చేయాల్సిందిగా చెప్పి వెళ్లిపోయారు. దీంతో సిబ్బంది ఆస్పత్రి సమీపంలో మాములుగా గుంత తీసి అక్కడే పూడ్చిపెట్టారు. అయితే, సిబ్బంది సరిగా పూడ్చకపోవడంతో గురువారం ఉదయం కుక్కలు పసికందు మృతదేహాన్ని బయటకు లాగి నోటకరుక్కొని వీకర్ సెక్షన్ కాలనీకి పరుగులు పెట్టాయి. మృతదేహాన్ని తింటుండగా స్థానికులు వాటిని తరిమివేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆస్పత్రి సిబ్బంది, వైద్యులను విచారించారు. మృతదేహానికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. పసికందు మృతదేహాన్ని వదిలేసి వెళ్లపోయిన వారు కూడా కేవలం పేర్లు మాత్రమే చెప్పారని, ఎలాంటి గుర్తింపు పత్రాలు కూడా ఇవ్వలేదని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పాఠశాల విద్యార్థుల పందేలు!
శంషాబాద్: శంషాబాద్‌లో ఐపీఎల్ పందేలు జోరుగా సాగుతున్నాయి. పాఠశాల విద్యార్థులు కూడా ఐపీఎల్ పందేలు కాస్తున్నారు. డబ్బుల విషయంలో తేడాలు వస్తే ఘర్షణకు దిగుతున్నారు. తాజాగా మధురానగర్, ఆర్బీనగర్కు చెందిన కొందరు విద్యార్థులు ఐపీఎల్ పందెం డబ్బుల విషయమై గొడవలకు దిగారు. ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా కొట్టుకున్నారు. ఇదే విషయమై తాజాగా గురువారం కూడా మరో ఇద్దరు విద్యార్థులు గొడవపడ్డారు. విషయం తెలుసుకున్న కాలనీలో కొందరు వ్యక్తులు ఆ విద్యార్థులను మందలించి సర్దిచెప్పారు. పందేలుకాసే విద్యార్థులంతా ఏడో తరగతి నుంచి పదోతరగతి లోపు విద్యార్థులే. స్థానికంగా ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ తీరుగా ఐపీఎల్ పందేల ఉచ్చులో చిక్కుకుపోతున్న తీరుతో తల్లిదండ్రులు సైతం భయాందోళనకు గురవుతున్నారు. మొహిన్ మహల్లాలో.. పట్టణంలో మొహిన్ మహల్లా బస్తీ ఐపీఎల్‌తో పాటు సాధారణ క్రికెట్ పోటీల పందెలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. గతంలో పలుమార్లు ఇక్కడ ఐపీఎల్ పందెం రాయుళ్లను స్థానిక పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ నిఘా కొరవడడడంతో ప్రతిరోజు లక్షల రూపాయల బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. బెట్టింగ్‌ల ఉచ్చులో చిక్కుకుపోయిన కొందరు యువకులు ఇప్పటికే లక్షల రూపాయల్లో అప్పుల పాలయ్యారు. గతంలో ఐపీఎల్ పందెలుకాసి ఏకంగా ఆస్తులు అమ్ముకుని రోడ్డుపాలైన వ్యక్తులు స్థానికంగా పదుల సంఖ్యల్లోనే ఉన్నారు. ఇటీవల ఐపీఎల్ ప్రారంభం కావడంతో స్థానికంగా పందేల జోరు కొనసాగుతోంది. రెండురోజుల కిందట పందెంలో డబ్బులు కాసి ఓడిపోయిన వ్యక్తి దళారీకి డబ్బులు చెల్లించకపోవడంతో ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్న సంఘటన కూడా చోటు చేసుకుంది. ఐపీఎల్ బెట్టింగ్‌లలో స్థానికంగా కొందరు యువకులు దళారులుగా ఉండి నగరంలో బెట్టింగ్ నిర్వహించే వారితో అనుసంధానంగా దందా నడిపిస్తున్నారు. పందెం కాసే వారికి వీరే డబ్బు సమకూర్చుతున్నారు. తీరా డబ్బులు చెల్లించలేని పరిస్థితులు వచ్చే సమయానికి దాడులు కూడా చేస్తున్నారు. బెట్టింగ్‌లపై పోలీసుల నిఘాను పటిష్టం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
వాట్సాప్ మెసేజ్‌తో ఇరు వర్గాల ఘర్షణ
శంషాబాద్‌రూరల్(రాజేంద్రనగర్) : వాట్సాప్ మెసేజ్‌లో చిన్న తప్పు కారణంగా ఇద్దరు యువకుల మధ్య చెలరేగిన వివాదం తండాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. మండలంలోని మదన్‌పల్లి పాతతండాలో బుధవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. తండాకు చెందిన బంజారా యూత్ సభ్యులు స్థానికంగా ఉన్న ఆలయం వద్ద బుధవారం రాత్రి సమావేశమయ్యారు. సంఘంలోని సభ్యుడు మున్నా ఈ సమావేశానికి రాకపోవడంతో మరో సభ్యుడు వినోద్ అతనికి ఫోన్లో వాట్సాప్ ద్వారా సందేశం పంపాడు. ఈ సందేశంలో తప్పులు ఉండడంతో అక్కడకు చేరుకున్న మున్నా.. వినోద్‌ను అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య చిన్న వివాదం రేగింది. ఈ సమయంలో అక్కడే ఉన్న స్నేహితులు వీరిద్దరికీ సర్దిచెప్పే ప్రయత్నంలో వివాదం ముదిరింది. గొడవ పెద్దది కావడంతో తండావాసులు అక్కడకు రాగా.. రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సర్దిచెప్పారు. గురువారం ఉదయం మరోసారి రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. దీంతో కొంత మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్సై సురేష్, స్థానిక సర్పంచ్ లాలీచందర్ తండాకు వెళ్లి ఇరు వర్గాలతో మాట్లాడారు. ఘర్షణకు దారి తీసిన వివరాలు సేకరించి, ఇరువర్గాలను శాంతింపజేశారు. ఇరువురి ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పెద్దషాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం: ఒకరి మృతి
శంషాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దషాపూర్ వద్ద జాతీయరహదారిపై బుధవారం ఉదయం గొలుసుకట్టు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా లారీ ఢీకొంది. ఈ ఘటనలో బస్సులోని ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. బస్సును కోళ్ల లోడుతో వెళ్తున్న మినీ లారీ వేగంగా వచ్చి ఢీకొనగా అందులోని క్లీనర్ శివ(24) తీవ్ర గాయాలతో మృతిచెందాడు. కోళ్ల లారీని మరో రెండు లారీలు వెనుక నుంచి ఢీకొట్టాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలిని పర్యవేక్షించారు. -
ఔటర్‌పై ప్రమాదం.. తండ్రీకొడుకుల మృతి
శంషాబాద్ రాంగ్ రూట్లో వచ్చిన కారు మరో కారును ఢీకొన డంతో తండ్రీకొడుకులు దుర్మరణం చెందారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని పెద్దగోల్కొండ సమీపంలోని ఔటర్ రింగురోడ్డుపై గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు.. రాజేంద్రనగర్ సర్కిల్ బుద్వేల్‌కు చెందిన పడగంట నర్సింహా(59), ఆయన పెద్దకొడుకు బాల్‌రాజ్(40), కోడలు సంధ్యారాణి, కూతురు లక్ష్మి, అల్లుడు ఆనంద్‌తో కలసి మారుతీ వ్యాగనార్ వాహనంలో గురువారం హయత్‌నగర్ మండలం మన్నెముత్యాలకుంటలోని బంధువుల శుభకార్యానికి వెళ్లారు. అర్ధరాత్రి తిరుగు ప్రయాణంలో బొంగుళూరు గేటు వద్ద ఔటర్‌పైకి చేరుకున్న వీరి కారు దారి తప్పింది. శంషాబాద్ వైపు రావాల్సి ఉండగా రాంగ్‌రూట్‌ను ఎంచుకున్నారు. ఇదే సమయం లో నిజాంపేట నివాసి శాంత రాం, భార్య స్వరాజ్యలక్ష్మి, స్నేహితులు అనిల్, అనుదీప్, కార్తీక్‌తో కలసి సాంత్రో కారులో ఔటర్‌పై నుంచి విజయవాడ వెళ్తున్నాడు. అర్ధరాత్రి తర్వాత 2:30 గంటల సమయంలో పెద్దగోల్కొండ రోటరీ దాటగానే రాంగ్ రూట్లో వస్తున్న వ్యాగనార్ సాంత్రో కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యాగనార్ నడుపుతున్న బాల్‌రాజ్, ముందు సీట్లో కూర్చున్న ఆయన తండ్రి నర్సింహ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కారు లో ఉన్న ఆనంద్, లక్ష్మి, సంధ్యారాణి, కాళ్లకు తీవ్రగాయాల య్యాయి. సాంత్రో కారులోని అనుదీప్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియాకు తరలించారు. క్షతగ్రాతులను 108 వాహనంలో స్థానిక ఆస్పత్రికి తరలించారు. -
బంగారం స్మగ్లింగ్‌లోనూ చైనా మార్కు
హైదరాబాద్‌పై కన్నేసిన చైనా మాఫియా నాలుగు దేశాల మీదుగా ఇక్కడకు తరలింపు కేజీ బంగారానికి రూ.లక్షకు పైగా కమీషన్ అమాయకులకు తెలియకుండా కూడా రవాణా ఆధారాలు సేకరించిన కస్టమ్స్ అధికారులు హైదరాబాద్: జనవరి 12న ఐదు కేజీలు... 15న ఒక కేజీ... ఫిబ్రవరి 10న అరకేజీ... 28న రెండున్నర కేజీలు... మార్చి 4న కేజీన్నర... 13న ఆరున్నర కేజీలు... 20న 1.9 కేజీలు... ఏప్రిల్ 1న ఆరున్నర కేజీలు... శుక్రవారం కిలోన్నర... శనివారం 685 గ్రాములు... ఈ ఏడాది ఇప్పటివరకు శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం జాబితా ఇది. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో చైనాకు చెందిన కొందరు సూత్రధారులు ఈ అక్రమ రవాణాను వ్యవస్థీకృతంగా నడుపుతున్నారని తేలింది. దీనికి సంబంధించిన కీలక ఆధారాలను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు సేకరించారు. పరారీలో ఉన్న హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు రిసీవర్ల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. భారత మార్కెట్లో బంగారం ధర పెరగడంతో పాటు దిగుమతి సుంకం పైకి, రూపాయి విలువ కిందికి చేరడమే ఈ మాఫియాకు కలిసి వస్తోందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. గణనీయంగా పెరిగిన ధరలు, పన్నులతో... దేశంలో పసిడికి ఉన్న డిమాండ్‌కు త గ్గట్టు ఉత్పత్తి జరగట్లేదు. ఈ కారణంగానే దిగుమతిపైన ఆధారపడాల్సి వస్తోంది. ఫలితంగా రూపాయి మారకం విలువకు బంగారం ధరలతో లింకు ఉంటోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.8 గ్రాములు) బంగారం 1,900 డాలర్లు ఉండగా... ఇక్కడ 10 గ్రాములు రూ.26 వేల వరకు ఉండేది. ప్రస్తుతం ఆ ధర 1,300 డాలర్లకు పడిపోయినా దేశీయ మార్కెట్లో రూ.30 వేలను తాకుతోంది. దీనికి కారణం అప్పట్లో డాలర్‌తో ఉన్న రూపాయి మారకం విలువ ప్రస్తుతం 20 శాతం మేర పడిపోవడమే. ఆయా దేశాల నుంచి పసిడిని కొనుగోలు చేసినవారు అధికారికంగా ఇక్కడకు తీసుకురావాలన్నా పరోక్ష పన్ను విధానంతో లాభసాటి కావట్లేదు. గతంలో 10 గ్రాముల బంగారానికి దిగుమతి సుంకం రూ.350 ఉండేది. ఇటీవల 10 గ్రాముల పసిడికి ఉన్న ఖరీదును ప్రతి 15 రోజులకు సరాసరి తీసుకుని ఆ మొత్తంపై 10 శాతం చెల్లించేలా ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది. దీంతో కనీసం రూ.మూడు వేల వరకు పన్ను పడుతోంది. ఇవన్నీ అక్రమ రవాణా పెంచడానికి కారణమయ్యాయి. కమీషన్ పేరు చెప్పి, విషయం చెప్పకుండా... హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ఇటీవల ఇంటర్నేషనల్ సర్వీసులు బాగా పెరిగాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళ, తమిళనాడు వాసులు కూడా ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో చైనా మాఫియా బంగారం అక్రమ రవాణాకు హైదరాబాద్‌నే కేంద్రంగా చేసుకుంది. ఆయా దేశాల్లో కార్మికులుగా పని చేస్తూ, విజిటింగ్ వీసాలపైన వెళ్లి వస్తున్న వారిని చైనా ముఠా అక్కడి విమానాశ్రయాల్లో కాపుకాసి గుర్తిస్తున్నారు. బంగారాన్ని వివిధ రూపాల్లోకి మార్చి, అనేక రకాలుగా పార్సిల్ చేసి వారికి అప్పగిస్తున్నారు. కొందరికి కేజీ బంగారానికి రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు కమీషన్ ఇస్తామంటూ ఆశచూపుతుండగా... మరికొందరికి బంగారమని చెప్పకుండా పార్సిల్స్ రూపంలో ఇస్తూ హైదరాబాద్‌లో తమ వారికి ఇవ్వాల్సిందిగా చెప్పి పంపిస్తున్నారు. కస్టమ్స్ అధికారులకు వీరు పట్టుబడితే అక్కడితో లింకు తెంపేస్తున్నారు. విమానాశ్రయం దాటి బయటకు వచ్చిన నేపథ్యంలో ఇక్కడి రిసీవర్లకు చేర్చి దందా చేపడుతున్నారు. రిసీవర్లుగా ముగ్గురు గుర్తింపు... ఇటీవల పట్టుబడిన వారిని విచారించిన కస్టమ్స్ అధికారులు ఈ అంశాలతో పాటు కీలకమైన ఆధారాలను సేకరించారు. ఆయా దేశాల నుంచి చైనా మాఫియా పంపిస్తున్న బంగారాన్ని హైదరాబాద్‌కు చెందిన రిసీవర్లుగా భావిస్తున్న రాజుభయ్యా, షకీల్, జిలానీ తీసుకుంటున్నారని తే లింది. వీరు బాహ్యవిపణిలో విక్రయించి వచ్చే లాభాల్లో ఒప్పందం చేసుకున్న మొత్తం హవాలా రూపంలో చైనాలోని సూత్రధారులకు పం పుతున్నారని తేలింది. ఈ వ్యవహారంపై లోతుగా ఆరా తీస్తున్న కస్టమ్స్ అధికారులు పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో నిఘా కట్టుదిట్టం చేశారు. -
అమ్మో.. దొంగలు
జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస చోరీలతో జనం బెంబేలెత్తుతున్నారు. పది రో జుల వ్యవధిలోనే రెండుసార్లు దుండగులు ఒకే తరహాలో తెగబడ్డారు. రెండు నెలల క్రితం జిల్లాలో వరుసగా జరిగిన ‘మెరుగు’ దొంగల కేసులో ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. తాజాగా దోపిడీ దొంగలు రెచ్చిపోవడంతో జనం ఆందోళనకు గురవుతున్నారు. ఈ నెల 12న అర్ధరాత్రి శంషాబాద్ మండలంలోని పెద్దగోల్కొండలో దేవయ్య గౌడ్ ఇంట్లోకి చొరబడ్డ దొంగలు కత్తులతో బెదిరించి ఆయన భార్యాకుమార్తెల నుంచి 30 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలతో పాటు ఇంట్లో ఉన్న రూ. 50 వేల నగదును దోచుకుపోయిన విషయం తెలిసిందే. ఈ నెల 1న అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు శంకర్పల్లి మండలంలోని పత్తేపూర్ గ్రామంలో గొల్ల రాములు ఇంటి తలుపులను రాళ్లతో బద్దలుకొట్టి లోపలికి చొరబడ్డారు. కుటుంబీకులపై కత్తులతో దాడి చేసి కళ్లలో కారంపొడి చల్లి 11 తులాల బంగారం, రూ. 20 వేలు చోరీ చేసి ముగ్గురి తీవ్రంగా గాయపరిచారు. పెద్దగోల్కొండలో దొంగలు కత్తులతో బెదిరించి అందిన కాడికి దోచుకుపోయారు. రాయలసీమ ముఠా పనేనా..? రెండు చోట్ల దోపిడీకి పాల్పడింది రాయలసీమ ముఠానేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరుస దోపిడీలతో పోలీసులు ఈ కేసులను సవాలుగా తీసుకుని విచారణ చేస్తున్నారు. పాత నేరస్తుల నుంచి దోపిడీకి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. దోపిడీ దొంగలు మాట్లాడిన భాష, దోపిడీ తీరును నిశితంగా విచారణ చేస్తున్నారు. పెద్దగోల్కొండలో దొంగలు దోపిడీ తర్వాత అర కిలో మీటరు దూరం వరకు తూర్పు దిక్కుగా వెళ్లినట్లు డాగ్ స్క్వాడ్ ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా దొంగలు తెలుగు, హిందీతో పాటు వారి కోడ్ భాషలో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారని సమాచారం. రెండు చోట్ల కూడా దుండగులు దోపిడీకి ముందుగా తాము ఎంచుకున్న ఇళ్లకు పొరుగున్న ఉన్న ఇళ్ల తలుపులకు గ డియపెట్టడం గమనార్హం. మరుగున పడిన ‘మెరుగు’ కేసులు.. బంగారు, వెండి ఆభరణాలకు మెరుగు పెడతామంటూ జనాన్ని నమ్మించి దొంగలు గతంలో జిల్లాలో చోరీలకు తెగబడ్డారు. జనవరి నెలలో పది రోజుల వ్యవధిలో మూడు చోట్ల ఇదే తరహాలో దొంగతనాలు జరిగాయి. జనవరి 21న మొయినాబాద్ మండలంలోని సురంగల్‌లో, 28న శంషాబాద్ మండలం శంకరాపురంలో, 29న శామీర్‌పేట్ మండలం బొమ్మరాశిపేటలో దుండగులు 18 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఇత్తడి, వెండి, బంగారు ఆభరణాలకు మెరుగు పెడతామంటూ బైక్‌లపై గ్రామాల్లో తిరుగుతూ అమాయక మహిళల వద్ద చోరీలు చేశారు. ’మెరుగు’ చోరీలు జరిగి రెండు నెలలు గడుస్తున్నా కేసుల్లో పురోగతి లేదని తెలుస్తోంది. పెద్దగోల్కొండ ఘటనపై శంషాబాద్ సీఐ వేణుగోపాల్‌ను వివరణ కోరగా కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా దుండగులను పట్టుకునేందుకు పోలీసులు రెండు బృందాలను రంగంలోకి దించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. -
సెలయేర్లలో ఇసుకాసురులు!
శంషాబాద్ రూరల్, న్యూస్‌లైన్: ముచ్చింతల్, పెద్దతూప్ర గ్రామాల శివారులో ఎగువ భాగంలోని వరదనీటిని పాల్మాకుల చెరువులోకి చేరవేసే రెండు వాగులు అన్యాక్రాంతమయ్యాయి. కొన్నేళ్లుగా ఈ వాగుల్లో చేపడుతున్న ఇసుక తవ్వకాలు, ఫిల్టర్ ఇసుక తయారీతో సాగునీటి వనరులు దెబ్బతినే పరిస్థితి తలెత్తింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగు కట్ట తెగి వరదంతా సమీప పొలాలను ముంచెత్తింది. పెద్దతూప్ర శివారులో ఉన్న ఎల్లంబాయి వాగులోకి మహేశ్వరం మండలం కల్వకోల్, చిన్నతూప్ర వైపు నుంచి వరదనీరు వస్తోంది. ఎంకమ్మగూడెం, అమీర్‌పేట్ వైపు నుంచి వరద నీరు ముచ్చింతల్ వాగులోకి చేరుతోంది. ఈ రెండు వాగులు ముచ్చింతల్ సమీపంలో కలిసి అక్కడి నుంచి పాల్మాకుల చెరువులోకి వరదనీరు వెళ్తుంది. ఎంకమ్మగూడెం, ముచ్చింతల్ వాగులను అనుసరించి ఉన్న పొలాలను కొందరు అక్రమార్కులు ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. వాల్టా చట్టానికి తూడ్లు పొడుస్తూ యథేచ్ఛగా తవ్వకాలు చేపడుతున్నారు. దీంతో సాగునీటి వనరులు దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జోరుగా ఇసుక ఫిల్టర్లు.. రెండు వాగులను అనుసరించి ఉన్న పొలాల వద్ద ఇసుక ఫిల్టర్లు ఏర్పాటు చేసి పొలాలను అక్రమార్కులు తవ్వేస్తున్నారు. వానాకాలంలో కురిసిన వర్షాలతో కొన్ని రోజులు ఇసుక తవ్వకాలకు అడ్డంకిగా మారినా.. ఇటీవల ఫిల్టరు ఇసుక తయారీ జోరందుకుంది. రాత్రి వేళల్లో ఫిల్టర్ ఇసుక తయారు చేస్తూ లారీల్లో రవాణా చేస్తున్నారు. ఇసుకకు స్థానికంగా డిమాండ్ ఉండడంతో అక్రమార్కుల వ్యాపారం మూడు ట్రాక్టర్లు.. ఆరు లారీలుగా వర్ధిల్లుతోంది. ఇసుక తవ్వకాలు, ఫిల్టర్ ఇసుక తయారీ కేంద్రాలపై అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో అక్రమార్కులకు అడ్డూ అదుపూ లేకుండాపోతోంది. వాగు సమీపంలోని మట్టిని నీటితో వడపోసి ఇసుకను తీస్తున్నారు. ఇందుకోసం వాగులోని నీళ్లను, ఉచిత కరెంటును వినియోగిస్తున్నారు. మట్టి, ఇసుక తవ్వకాల కోసం ఏకంగా జేసీబీలను వినియోగిస్తున్నారంటే ఎంతగా బరి తెగిస్తున్నారో అవగతమవుతుంది. మరో వైపు వాగులపై ఏర్పాటు చేసిన చెక్‌డ్యాంలను కూల్చివేయడం గమనార్హం. వాగు మార్గమే మారింది.. ఇసుక తవ్వకాలతో ఎల్లంబాయి వాగు మార్గమే మారిపోయింది. వాగు పక్కన భారీ గోతులు తీసి మట్టి, ఇసుక తవ్వకాలు చేపట్టారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదనీరు రావడంతో వాగు కట్ట తెగిపోయింది. దీంతో వరదనీటి ప్రవాహ మార్గం మారి నీరంతా పొలాల్లోంచి పాల్మాకుల చెరువులోకి చేరింది. సుమారు వంద ఎకరాల విస్తీర్ణంలో ఎక్కడ చూసినా భారీ గోతులు కనిపిస్తున్నాయి. ముచ్చింతల్, ఎల్లంబాయి వాగులు అనుసంధానమయ్యే చోట వాగు విస్తీర్ణం కుంచించుకుపోవడమే కాకుండా వాగును మట్టితో పూడ్చివేశారు. దీంతో వరదనీటి ప్రవాహ మార్గం మారి పొలాలు దెబ్బతింటున్నాయి. మరో వైపు పొలాల్లో తవ్వకాలు చేపట్టడంతో ఏళ్ల నాటి చెట్లు, వృక్షాలు నేలకొరిగిపోతున్నాయి. తవ్వకాలలో ఏర్పడిన భారీ గుంతలు ప్రమాదకరంగా మారాయి. వాగుల పరిసరాల్లో సంచరించడానికి వీలులేనంతగా గుంతలు ఏర్పడ్డాయి. అక్రమార్కులు ఇంతలా రెచ్చిపోతున్నా సంబంధిత అధికారులకు మాత్రం చీమ కుట్టినట్లైనా లేకపోవడం వెనుక ఆంతర్యమేమిటో అంతుచిక్కని విషయం. -
శంషాబాద్‌లో ముంబై డాన్సర్‌పై అత్యాచారం
శంషాబాద్: హైదరాబాద్ సమీపంలో ఉన్న రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో దారుణ సంఘటన జరిగింది. షకిల్ అహ్మద్ అనే వ్యక్తి, అతని మిత్రులు ముంబైకి చెందిన ఓ డాన్సర్‌పై అత్యాచారం చేశారు. గత డిసెంబర్ 31న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలు ఈ విషయం గురించి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని శంషాబాద్ పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
పట్టుకోండి చూద్దాం..
శంషాబాద్, న్యూస్‌లై న్: ‘శత కోటి అపాయాలకు అనంతకోటి ఉపాయాలు’ అన్న చందంగా ఉంది స్మగ్లర్ల తెలివి. సుంకం ఎగ్గొట్టేందుకు విదేశాల నుంచి బంగారాన్ని దుస్తుల్లో దాచుకొని తీసుకొస్తున్నారు. హైదరాబాద్ విపణిలో బంగారానికి మంచి డిమాండ్ ఉండడంతో స్మగ్లర్లు దుబాయ్ టూ హైదరాబాద్ మార్గంలో అక్రమ మార్గంలో కిలోల కొద్ది బంగారాన్ని తరలిస్తున్నారు. ఇటీవల కస్టమ్స్ అధికారుల వలకు చిక్కిన స్మగ్లర్ల తీరే ఇందుకు నిదర్శనం. విజిటింగ్ వీసాలపై ప్రత్యేకంగా దుబాయ్, యూఏఈ, బ్యాంకాక్‌లకు వెళుతున్న స్మగ్లింగ్ ముఠాలు అక్కడి బంగారానికి కస్టమ్స్ సుంకం చెల్లించకుండా నగరంలోని మార్కెట్‌కు తరలిస్తున్నారు. మన దేశంలో బంగారానికి మంచి డిమాండ్ ఉన్న నగరాల్లో హైదరాబాద్ ప్రధానమైంది. నగరంలో ప్రస్తుతం 24 క్యారట్ బంగారం 10 గ్రాముల ధర దాదాపు రూ. 31 వేల వరకు ఉంది. దుబాయ్‌లో అదే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 430 యూఎస్ డాలర్లు ఉంది. నగర మార్కెట్‌తో పోలిస్తే పది గ్రాముల బంగారానికి సుమారు ఆరువేల తేడా ఉంది. దీనికి తోడు దుబాయ్ నుంచి తీసుకొస్తున్న బంగారం బిస్కెట్ల రూపంలో ఉండడంతో నగర మార్కెట్లో దానికి మంచి డిమాండ్ ఉంటుంది. నగల షాపులతో పాటు నగరంలో పాతబస్తీలోని మార్కెట్లో దుబాయ్ బంగారానికి మంచి క్రేజ్ ఉండడంతో పెద్ద ఎత్తున స్మగ్లింగ్ సాగుతున్నట్లు నిఘావర్గాలు దృష్టి సారిస్తున్నాయి. బంగారాన్ని అక్రమ రవాణా చేయడానికే కొందరు పనిగట్టుకుని విదేశాలకు వెళ్లి వస్తునట్లు ఇప్పటికే ఎయిర్ ఇంటలిజెన్స్ అధికారులు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసింది. ఈక్రమంలో ఇటీవల పలువరు కస్టమ్స్ అధికారులకు చిక్కారు. రెండు నెలలు.. ఆరు ఘటనలు ఆగస్టు నుంచి ఇప్పటి వరకు బంగారాన్ని అక్రమ మార్గంలో తరలిస్తూ ఆరుగురు పట్టుబడ్డారు. వీరిలో మహిళలూ ఉన్నారు. వీరంతా కస్టమ్స్ సుంకంపై అవగాహన లేని వారేమి కాదని అధికారులు ఆరోపిస్తున్నారు. ఎక్కువ మొత్తంలో బంగారం తరలించిన వారు తాము వేసుకునే దుస్తుల్లో ప్రత్యేకంగా సంచులు ఏర్పాటు చేసుకున్నారు. దుస్తులు లేదా షూ హిల్స్ భాగంతో పాటు లోదుస్తుల్లో బంగారాన్ని తరలిస్తూ నిందితులు పట్టుబడ్డారు. ఆగస్టు 21న పాతబస్తీ ప్రాంతానికి చెందిన రషీద్ సుమారు మూడు కేజీల బంగారాన్ని లో దుస్తులు, షూలో పెట్టుకుని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. కొంతకాలానికి మరో ఇద్దరు ప్రయాణికులు అరకిలో బంగారంతో పాటు కాస్మోటిక్స్ వస్తువులతో బుక్కైన విషయం తెలిసిందే. ఆరు రోజుల క్రితం బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తితో పాటు నగరానికి చెందిన దంపతుల వద్ద కూడా సుమారు మూడు కేజీల బంగారం బయటపడింది. ఆ మరుసటి రోజే హైదరాబాద్‌కు చెందిన తల్లీకూతుళ్ల నుంచి కస్టమ్స్ అధికారులు మరో అర కేజీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా శుక్రవారం ఉదయం బ్యాంకాక్ నుంచి ఓ వ్యక్తి కేజీ బంగారంతో పాటు రంగురాళ్లు తీసుకొచ్చి అధికారులకు చిక్కాడు. ఇప్పటికైనా స్మగ్లర్లు తమ పంథా మర్చుకోవాల్సిన అవసరం ఉంది. -
డబ్బుల కోసం రియల్టర్ నిర్బంధం
శంషాబాద్ రూరల్, న్యూస్‌లైన్: అప్పు వసూలు కోసం ఓ రియల్టర్‌ను నిర్బంధించిన సంఘటన మండల పరిధిలో బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ కేసులో ఓ హెడ్‌కానిస్టేబుల్ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు బుధవారం నలుగురు నిందితులను రిమాండుకు పంపారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని పెద్దషాపూర్‌కు చెందిన జి. మల్లేష్‌యాదవ్, హైదరాబాద్ కుషాయిగూడ మల్కాపూర్‌లో ఉండే రియల్టర్ బుచ్చిరెడ్డిలు పరిచయస్తులు. వీరికి డబ్బులు అవసరమయ్యాయి. పెద్దషాపూర్లో ఉన్న మల్లేష్ పొలం తాలూకు పత్రాలను తాకట్టు పెట్టి నగరంలోని కొత్తపేటలో ఉండే సుధాకర్ వద్ద ఏడాది క్రితం రూ. 30 లక్షలు అప్పుగా తెచ్చుకున్నారు. మల్లేష్ రూ.16 లక్షలు, బుచ్చిరెడ్డి రూ.14 లక్షలు తీసుకున్నారు. ఈ డబ్బులకు నెలానెలా వడ్డీతో చెల్లించాల్సి ఉండగా కొన్ని నెలల నుంచి బుచ్చిరెడ్డి తప్పించుకు తిరుగుతున్నాడు. మల్లేష్‌యాదవ్ మొత్తం డబ్బులను సుధాకర్‌కు చెల్లించి తన భూమి పత్రాలను తెచ్చుకున్నాడు. తనకు రావాల్సిన డబ్బుల కోసం బుచ్చిరెడ్డిని పలుమార్లు అడిగినా ఇవ్వకుండా రేపుమాపు అంటూ తప్పించుకుంటున్నాడు. ఈక్రమంలో డబ్బులను వసూలు చేయడానికి మల్లేష్‌యాదవ్ ఓ పథకం వేశాడు. ఇందుకోసం ఆయన శంషాబాద్ పోలీసుస్టేషన్లో పని చేసే ఓ హెడ్ కానిస్టేబుల్ సహాయం తీసుకున్నాడు. శంషాబాద్ సీఐని మాట్లాడుతున్నాను.. పోలీస్ స్టేషన్‌కు రావాలి అంటూ హెడ్‌కానిస్టేబుల్ చేత మూడు రోజుల కిందట ఫోన్ చేయించాడు. దీంతో ఈనెల 21న బుచ్చిరెడ్డి తన కారులో డ్రైవర్ రమేష్‌తో కలిసి శంషాబాద్ బస్టాప్ వద్దకు వచ్చాడు. అక్కడ వారిని మల్లేష్యాదవ్తో పాటు సదరు హెడ్ కానిస్టేబుల్ కలుసుకున్నారు. సీఐ రావడానికి కొంత సమయం పడుతుందని హెడ్‌కానిస్టేబుల్ చెప్పారు. దీంతో పథకం ప్రకారం బుచ్చిరెడ్డిని డ్రైవర్‌తో పాటు మల్లేష్‌యాదవ్ పెద్దషాపూర్లో ఉన్న తన ఫాంహౌస్‌కు తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత ఇద్దరిని ఓ గదిలో నిర్భందించారు. ఇందుకోసం మల్లేష్ తన కుమారుడు అశోక్‌యాదవ్, జూకల్కు చెందిన వాజిద్, నగరంలోని సంతోష్‌నగర్ నివాసి శోభన్‌బాబు(ఓ పత్రికలో యాడ్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగి) సహాయం తీసుకున్నాడు. బయటకు తెలిసిందిలా.. డబ్బులు ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేదిలేదంటూ బుచ్చిరెడ్డికి మల్లేష్‌యాదవ్ తన సహచరులతో స్పష్టం చేసి ఇబ్బందులకు గురిచేశాడు. ఈ నెల 22న బుచ్చిరెడ్డిచేత అతని కుటుంబ సభ్యులకు ఫోన్ చేయించి డబ్బులు తీసుకురావాలని చెప్పించారు. దీంతో వారు అదే రోజు శంషాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మంగళవారం అర్ధరాత్రి పెద్దషాపూర్‌లోని ఫాంహౌస్‌పై దాడి చేసి బుచ్చిరెడ్డి, డ్రైవర్ రమేష్‌ను విడిపించారు. ఈ కేసులో నిందితులైన నలుగురిని అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు పంపారు. హెడ్ కానిస్టేబుల్ పాత్రపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చే స్తున్నట్లు పోలీసులు తెలిపారు.