ఔటర్‌పై ప్రమాదం.. తండ్రీకొడుకుల మృతి | Outer .. learned at risk died for sun and father | Sakshi
Sakshi News home page

ఔటర్‌పై ప్రమాదం.. తండ్రీకొడుకుల మృతి

Published Sat, Apr 19 2014 2:35 AM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

ఔటర్‌పై ప్రమాదం.. తండ్రీకొడుకుల మృతి - Sakshi

ఔటర్‌పై ప్రమాదం.. తండ్రీకొడుకుల మృతి

శంషాబాద్  రాంగ్ రూట్లో వచ్చిన కారు మరో కారును ఢీకొన డంతో తండ్రీకొడుకులు దుర్మరణం చెందారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని పెద్దగోల్కొండ సమీపంలోని ఔటర్ రింగురోడ్డుపై గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు.. రాజేంద్రనగర్ సర్కిల్ బుద్వేల్‌కు చెందిన పడగంట నర్సింహా(59), ఆయన పెద్దకొడుకు బాల్‌రాజ్(40), కోడలు సంధ్యారాణి, కూతురు లక్ష్మి, అల్లుడు ఆనంద్‌తో కలసి మారుతీ వ్యాగనార్ వాహనంలో గురువారం హయత్‌నగర్ మండలం మన్నెముత్యాలకుంటలోని బంధువుల శుభకార్యానికి వెళ్లారు. అర్ధరాత్రి తిరుగు ప్రయాణంలో బొంగుళూరు గేటు వద్ద ఔటర్‌పైకి చేరుకున్న వీరి కారు దారి తప్పింది. శంషాబాద్ వైపు రావాల్సి ఉండగా రాంగ్‌రూట్‌ను ఎంచుకున్నారు.

ఇదే సమయం లో నిజాంపేట నివాసి శాంత రాం, భార్య స్వరాజ్యలక్ష్మి, స్నేహితులు అనిల్, అనుదీప్, కార్తీక్‌తో కలసి సాంత్రో కారులో ఔటర్‌పై నుంచి విజయవాడ వెళ్తున్నాడు. అర్ధరాత్రి తర్వాత 2:30 గంటల సమయంలో పెద్దగోల్కొండ రోటరీ దాటగానే రాంగ్ రూట్లో వస్తున్న వ్యాగనార్ సాంత్రో కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యాగనార్ నడుపుతున్న బాల్‌రాజ్, ముందు సీట్లో కూర్చున్న ఆయన తండ్రి నర్సింహ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కారు లో ఉన్న ఆనంద్, లక్ష్మి, సంధ్యారాణి, కాళ్లకు తీవ్రగాయాల య్యాయి. సాంత్రో కారులోని అనుదీప్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియాకు తరలించారు. క్షతగ్రాతులను 108 వాహనంలో స్థానిక ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement