narsimha
-
ఆహారాన్ని కల్తీ చేస్తే కఠినచర్యలు
సాక్షి, హైదరాబాద్: ఆహారాన్ని కల్తీ చేస్తే కఠినంగా వ్యవ హరిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో అనేక హోటళ్లలో నాసిరకం, కల్తీ, చెడిపోయిన ఆహారం బయటపడటంతో దానిపై మంత్రి ఆరా తీశారు. మంగళవారం సచివాలయంలో అధి కారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, హైదరాబాద్ బిర్యానీకి అంతర్జాతీయ గుర్తింపు ఉందని, దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి వ్యాపారవేత్త ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచుతున్నామని, హోటల్ యాజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.ప్రతి 6 నెలలకు వర్క్‌షాపు నిర్వహణ, అవగాహన సద స్సు నిర్వహిస్తామని, ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. హోటల్స్ యజమానులు చేసిన పలు విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించారు. సమావేశంలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్, డైరెక్టర్ ఫుడ్ సేఫ్టీ డాక్టర్ శివలీల, తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకట్‌రెడ్డి, ఇండియన్ రెస్టారెంట్స్ అసోసియేష న్ ప్రెసిడెంట్ సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరు తీవ్ర నిర్ణయం! బావిలో దూకి..
సంగారెడ్డి: ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇందులో మహిళ మృతదేహం లభ్యం కాగా, మరొకరి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన జహీరాబాద్ మండలంలోని కాశీంపూర్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. చిరాగ్పల్లి ఎస్ఐ.నరేశ్, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తమ్మళి మహాదేవి(35), భర్త శేఖర్ మద్యానికి బానిసయ్యాడు. ఎకరం పొలం అమ్మగా వచ్చిన డబ్బుతో ప్రతి రోజూ తాగేవాడు. దీంతో ఆరోగ్యం దెబ్బతింది. జీవితంపై విరక్తి చెందిన శేఖర్ రెండు నెలల క్రితం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి మహాదేవి డిప్రెషన్లోకి వెళ్లింది. మనోవేదనకు గురై నిత్యం బాధపడుతున్న ఆమె ఆదివారం గ్రామ శివారులోని ఎల్లమ్మ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు శవాన్ని బావిలో నుంచి తీసి జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి అత్త మామ, ఇద్దరు కుమారులు ఉన్నారు. తాగుడుకు బానిసై.. ఇదే గ్రామానికి చెందిన ఆలిగే నర్సింలు(44) తాగుడుకు బానిసై కుటుంబ సభ్యులతో నిత్యం గొడవపడేవాడు. వారం రోజుల నుంచి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటానని అంటుండేవాడు. ఆదివారం ఉదయం భార్యతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఎంతకూ ఇంటికి రాకపోవడంతో ఆచూకీ కోసం వెతుకుతుండగా గ్రామ శివారులోని సత్వార్ వ్యవసాయ బావి వద్ద బట్టలు, చెప్పులు కనిపించాయి. వీటి ఆధారంగా ఆత్మహత్య చేసుకున్నాడని భావించి భార్య నాగమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ నరేశ్, అగ్నిమాపక సిబ్బందితో కలిసి వెతికినా దొరకలేదు. బావిలో నిండుగా నీరు ఉండడంతో రెండు మోటార్లను ఏర్పాటు చేసి నీటిని తోడుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఇవి చదవండి: మార్నింగ్ వాక్ కు వెళ్లిన మహిళ అదృశ్యం! -
కుటుంబ కలహాలతో ఒకప్పుడు భార్య.. ఇప్పుడు భర్త.. తీవ్ర విషాదం!
మెదక్: కుటుంబ కలహాలతో ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గజ్వేల్, కుకునూరుపల్లి మండలంలోని లకుడారం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బొడిగ నర్సింలు (40) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. 13 ఏళ్ల కిందట కుటుంబ కలహాలతో ఆయన భార్య ఆత్మహత్య చేసుకుంది. దీంతో 8 ఏళ్ళ కిందట రెండో వివాహం చేసుకున్నాడు. ఇటీవల రెండో భార్యతో గొడవలు జరుగుతుండడం, వ్యవసాయం కోసం చేసిన అప్పుల కోసం మధనపడుతుండేవాడు. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: ఓ వ్యక్తి అడ్డుగా రావడంతో.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఒక్కసారిగా.. Follow the Sakshi TV channel on WhatsApp: -
డ్రైవింగ్‌లోనే గుండెపోటుకు గురై..
రాజేంద్రనగర్: పశువుల దాణా లోడ్‌తో వస్తున్న ఓ లారీ డ్రైవర్ గుండెపోటుకి గురై స్టీరింగ్‌పైనే మృతి చెందిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ ప్రాంతానికి చెందిన డ్రైవర్ కె.నర్సింహ్మ(49) సోమవారం రాత్రి పశువుల దాణాతో లారీని తీసుకొని నగరానికి బయలుదేరాడు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో శంషాబాద్ ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ సమయంలో తన భార్య నాగలక్ష్మికి ఫోన్ చేసి ఛాతీలో నొప్పిగా ఉందని, వాహనాన్ని నడపలేకపోతున్నానని చెప్పాడు. దీంతో భార్య కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలని చెప్పగా.. అలాగేనంటూ వాహనంతో ముందుకు కదిలాడు. గగన్‌పహాడ్ ఓవర్ బ్రిడ్జి దాటిన అనంతరం ఏజీ వర్సిటీ సబ్ రోడ్డు వద్దకు రాగానే గుండెనొప్పి తీవ్రం కావడంతో స్టీరింగ్‌పైనే పడి మృతి చెందాడు. లారీ రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును ఢీకొట్టి పుట్‌పాత్‌పైకి ఎక్కి నిలిచిపోయింది. కారు ఎయిర్బెలూన్లు తెరుచుకోవడంతో కారులో ఉన్న డ్రైవర్ రమేష్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
ఇబ్రహీంపట్నం: రంగారెడి జిల్లా ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం నేత మస్కు నర్సింహ(52) అనారోగ్యంతో మృతి చెందారు. ఘగర్, బీపీ లెవల్స్ పెరగడంతో పది రోజుల క్రితం ఆయన నిమ్స్‌లో చేరారు. గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతోపాటు ఉపిరితిత్తులు ఇన్ఫెక్షన్కు గురికావడంతో నర్సింహ ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొం దుతూ ఆదివారం అర్ధరాత్రి పన్నెండున్నర గంటల సమయంలో ఆయన కన్నుమూశారు. యాచారం మండలం చింతుల్ల గ్రామానికి చెందిన నర్సింహకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. విద్యార్థి దశ నుంచి రాజకీయల్లో ఆయన చురుకైన పాత్ర పోషించారు. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నుంచి సీపీఎం అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. కాగా, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సీతారాములు నిమ్స్ వద్ద నర్సింహ భౌతికకాయంపై ఎర్రజెండా కప్పి నివాళులు అర్పించారు. నర్సింహ మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ప్రజాసేవలో నిమగ్నమైన దళిత నేత చిన్నవయసులోనే మరణించడం బాధాకరమని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విచారం వ్యక్తం చేశారు. -
టీఆర్ఎస్వి ‘మత’ రాజకీయాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మతపరమైన రిజర్వేషన్ల పేరుతో రాజకీయం చేస్తున్నారని, మతపరమైన రిజర్వేషన్లు తెస్తామని చెబుతున్న టీఆర్ఎస్కు డీఎంకే నేత స్టాలిన్ మద్దతు ఇవ్వడాన్ని ఖండిస్తున్నామని బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు నర్సింహ యాదవ్ పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకించారని ఆయన గుర్తు చేశారు. పార్టీ నేతలు కె.వెంకటేశ్వర్లు, పార్టీ అధికార ప్రతినిధి రాకేశ్‌రెడ్డితో కలసి బుధవారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గీత కార్మికులకు చెట్లు పెంచుకోవడానికి 5 ఎకరాలు, యాదవులకు గొర్లు మేపుకోవడానికి 5 ఎకరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ తాను ఇచ్చిన మాటకు కట్టుబడి బీసీ సబ్ ప్లాన్ తేవాలన్నారు. కేసీఆర్ బీసీలకు అన్యాయం చేస్తున్నాడని, బీసీలను మోసం చేస్తున్న ఆయనను గద్దెదించే వరకు పోరాటం చేస్తామన్నారు. డిసెంబర్ ఒకటో తేదీన బీసీల హక్కులకై బీసీల సంగ్రామం నిర్వహిస్తామన్నారు. ప్రపంచ పారిశ్రామిక సదస్సు హైదరాబాద్‌లో జరగడం గర్వకారణమని, ప్రధాని మోడీ ఘనతవల్లే ఈ సదస్సు హైదరాబాద్‌లో జరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే పెట్టుబడులు వస్తాయని, రాష్ట్ర ప్రభుత్వాల వల్ల కాదని చెప్పారు. టీ–హబ్ వల్లే ప్రపంచ పారిశ్రామిక సదస్సు జరుగుతోందని మంత్రి కేటీఆర్ చెప్పడం సిగ్గుచేటని, టీ–హబ్ వల్ల ఎందరికి ఉపయోగం కలిగిందో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
ఒక్క ‘నమస్తే’తో దొరికిపోయాడు
►ఆ కవలలు రియల్ హీరోలు ►చిన్న అనుమానమే పెద్ద దొంగను పట్టించింది. ►ఈ సారి థాయ్ మసాజ్‌కు ప్లాన్ ►మూడుసార్లు పోలీసులకు బురిడీ సాక్షి, హైదరాబాద్ : బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కులో గత పదేళ్లుగా చైన్ స్నాచింగ్‌లు జరుగుతూనే ఉన్నాయి. టార్గెట్ చేస్తే కచ్చితంగా పని చేసుకెళ్లే ఓ చైన్‌స్నాచర్ పదేళ్లుగా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఎలాగైనా అతడిని పట్టుకోవాలని నిర్ణయించుకున్న పోలీసులు పార్కు బ్లూ ప్రింట్ తీసుకుని, దొంగతనాలు జరిగిన తీరుపై సమీక్షించారు.. అయినా ఖాకీలను బురిడీ కొట్టిస్తూ ఎప్పటికప్పుడూ తనదైన రీతిలో పని కానిచ్చేస్తున్నాడు. దీంతో అతడి కోసమే ప్రత్యేకంగా పార్కు చుట్టూ 60 కెమెరాలు ఏర్పాటు చేయడమేగాక పార్కులో ఉన్న మరో 25 కెమెరాలపై నిఘా ఉంచారు. అయినా స్నాచింగ్‌ల పర్వం కొనసాగుతూనే ఉండటంతో మరో 20 కెమెరాల ఏర్పాటుకు నిర్ణయించారు. అయితే ఇన్ని కెమెరాలకు చిక్కని నిందితుడు కేవలం ఒక ‘‘నమస్తే’’కు దొరికిపోయాడు. ఇద్దరు సినీ కవలలైన స్టంట్ మాస్టర్లు అతడిని పట్టించి రియల్ హీరోలుగా మిగిలారు.. వెస్ట్‌జోన్ డీసీపీ వెంకట్వేర్‌రావు మంగళవారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. కార్మికనగర్ ప్రాంతానికి చెందిన నర్సయ్య అలియాస్, నర్సింహ అలియాస్ రిషీ చిన్నా(25) కారు డ్రైవరుగా పని చేస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడిన కేబీఆర్ పార్కులో ఏడు చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడినట్లు తెలిపారు. నిందితుడి నుంచి ఏడు బంగారు గొలుసులు (250 గ్రాములు), ఒక సాంత్రో కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గతంలో మాదాపూర్, కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ చోరీలకు పాల్పడినప్పటికీ పోలీసులను బురిడీ కొట్టించి బయట పడినట్లు తెలిపారు. నిందితుడితోపాటు చోరీసొత్తును కొనుగోలు చేసిన ఓం నగర్ ప్రాంతానికి చెందిన సత్యనారాయణచారిని కూడా అరెస్ట్ చేసినట్లు డీసీపీ తెలిపారు. రిచ్‌గా ఉండాలని... నర్సింహ అలియాస్ రిషీచిన్నా చదివింది పదో తరగతి. విలాసవంతమైన జీవితం గడపాలని కలలుకనే అతను అందుకోసం చోరీల బాట పట్టాడు. 10వ తరగతి వరకు స్థానిక ఆలియా ప్రభుత్వ పాఠశాలలో చదివిన అతను దానికి సమీపంలోనే ఉన్న సుజాత హైస్కూల్లో చదివినట్లు చెప్పుకొనేవాడు. చేతిలో ఖరీదైన స్మార్ట్‌ఫోన్ పట్టుకుని బీటెక్ చదివానంటూ అందరినీ నమ్మించేవాడు. పబ్బులకు వెళ్లాలని, గర్ల్‌ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరగాలని, విదేశీ టూర్లు, బీచ్‌లకు వెళ్లాలని ప్లాన్ చేసుకునేవాడు. అదే ఆలోచన నర్సింహను రిషీగా మార్చింది. ఒక గర్ల్‌ఫ్రెండ్‌ను సొంతం చేసుకొనేలా చేసింది. కేబీఆర్ పార్క్ కొట్టిన పిండి నర్సింహకు పోలీసులు సేకరించిన కేబీఆర్ బ్లూప్రింట్ కంటే ఎక్కువగా పార్కు చుట్టూ ఉన్న కెమెరాలు, ఎక్కడి నుంచి వెళ్లాలి, ఎక్కడి నుంచి లోపలికి రావాలి అనే ప్రతి విషయం తెలుసు. దీంతో అతను కేబీఆర్ పార్కు చాలా సేఫ్ ప్లేస్‌గా భావించాడు. ఇక్కడే రెండు నెలల వ్యవధిలో స్నాచింగ్‌లకు పాల్పడేవాడు. ఇందుకోసం ప్రతి రోజూ పార్క్‌కు వచ్చేవాడు. వాకింగ్ చేసినట్లు నటిస్తూ రెక్కీ నిర్వహించేవాడు. తోటి వాకర్లకు అనుమానం రాకుండా మసలుకునేవాడు. పట్టించిన నమస్తే.. పార్కుకు వచ్చే నర్సింహ చేతిలో స్మార్ట్‌ఫోన్‌తో బిజీగా ఉన్నట్లు నటించేవాడు. అక్కడికి రెగ్యులర్‌గా వచ్చే వాకర్లను గుర్తుపెట్టుకొనేవాడు. ఈ నేపథ్యంలో అతను రోజూ పార్కుకు వస్తున్న కవల స్టంట్ మాస్టర్లకు నమస్తే పెట్టేవాడు. ఈ క్రమంలో అగస్టు 19న సుశీల దేవి అనే వృద్ధురాలి మెడలో నుంచి చైన్ లాక్కున అతను అక్కడి నుంచి బయటపడే ప్రయత్నంలో ఉండగా వారు ఎదురయ్యారు. ఎప్పటిలానే నర్సింహ వారికి నమస్తే పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొంచెం ముందుకు వచ్చిన వారికి స్నాచింగ్ జరిగిందని తెలియడం, ఆ సమయంలో అటువైపు అతనొక్కడే వెళ్లడంతో అతనిపై అనుమానం వచ్చింది. తాజాగా నాలుగు రోజుల క్రితం పార్కుకు వచ్చిన నర్సింహను గుర్తించిన వారు అక్కడే ఉన్న పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నర్సింహను అదుపులోకి తీసుకోగా, తాను బీటెక్ స్టూడెంట్‌నని తనకేమీ తెలియదంటూ తప్పించుకొనే ప్రయత్నం చేశాడు. పోలీసులు తమశైలిలో విచారించడంతో నేరం అంగీకరించాడు. థాయ్ మసాజ్‌కు వెళ్లాలని.. నర్సింహకు థాయ్‌లాండ్‌కు వెళ్లి అక్కడ మసాజ్ చేయించుకోవాలని కోరిక. ఈ నేపథ్యంలో అతను నాలుగు రోజుల క్రితం కేబీఆర్ పార్కుకు వచ్చాడు. అక్కడ స్నాచింగ్‌కు పాల్పడి తరువాత దసరాకు ముందు మరోసారి పంజా విసరాలని నిర్ణయించుకున్నట్లు విచారణలో వెల్లడించాడు. బంగారాన్ని డబ్బులుగా మార్చుకొని థాయిలాండ్‌కు వెళ్లి మసాజ్ చేయించుకోవాలనుకున్నట్లు తెలిపారు. మూడుసార్లు టోకరా.. కేపీహెచ్‌బీలోనూ అతను గతంలో రెండు ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డాడు. పోలీసులు అతడిని అనుమానంతో అదుపులోకి తీసుకోగా, తాను బీటెక్ స్టూడెంట్‌నని నమ్మించి బురిడీ కొట్టించాడు. మాదాపూర్‌లో చైన్‌స్నాచింగ్ కేసులోనూ అలాగే తప్పించుకున్నాడు. కేబీఆర్ పార్కులోనూ స్నాచింగ్‌కు పాల్పడి బంజారాహిల్స్ పోలీసులకు చిక్కిన సమయంలోనూ ఇలాగే చెప్పడంతో పోలీసులు నమ్మి వదిలేశారు. చివరికి ఇలా కేబీఆర్ పార్కులో వాకర్లా నటించి స్నాచింగ్‌లకు పాల్పడుతూ వాకర్లు ఇచ్చిన సమాచారంతో నాటకార్ నర్సింహ నాటకానికి తెరపడింది. సంబంధిత వార్త.. ఇంట్లో నర్సింహ.. బయట రిషి! -
ఇంట్లో నర్సింహ.. బయట రిషి!
‘కేబీఆర్ పార్క్’ స్నాచర్ విచారణలో ఆసక్తికర విషయాలు ► దసరా సందర్భంగా మరో స్నాచింగ్‌కు ప్లాన్ ► అంతలోనే పోలీసులకు చిక్కిన వైనం ► జల్సాలకు అలవాటుపడి స్నాచింగ్ బాట ► కుటుంబ సభ్యులకు తెలిసే చోరీలు సాక్షి, హైదరాబాద్: కేబీఆర్ పార్కులో 12 ఏళ్లుగా స్నాచింగ్‌లు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న స్నాచర్ నర్సింహ అలియాస్ రిషిని బంజారాహిల్స్ పోలీసులు విచారిస్తున్న కొద్దీ ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రతి రెండు నెలలకోసారి కేబీఆర్ పార్కులో స్నాచింగ్‌లకు పాల్పడటమే కాక.. జీహెచ్ఎంసీ వాక్‌వేకు వచ్చే ప్రేమ జంటలను బెదిరించి వారి నుంచి నగదు, నగలు తస్కరించేవాడని తేలింది. కార్మికనగర్ లో నివసించే నర్సింహ జల్సాలకు అలవాటు పడి స్నాచింగ్‌లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. చోరీ చేసిన నగలను జేబులో వేసుకుని పరారు కాకుండా పార్క్ గ్రిల్ దూకి అక్కడే ఓ బండ కిందనో, చెట్టు చాటునో దాచి వెళ్లిపోయేవాడు. రెండు, మూడు గంటల తర్వాత అక్కడికి వచ్చి వాటిని తీసుకెళ్లేవాడు. పొరపాటున పోలీసులకు దొరికినా వెతికితే తన వద్ద ఏదీ ఉండదని అలా చేసేవాడు. కుటుంబ సభ్యులకు తెలిసే నర్సింహ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నట్లు సమాచారం. నగలను తల్లికే ఇచ్చేవాడని, ఆమే వాటిని విక్రయించేదని తెలుస్తోంది. దసరా ఖర్చుల కోసం మరోసారి స్నాచింగ్ చేద్దామని ప్లాన్ వేస్తున్న సమయంలోనే నర్సింహ పోలీసులకు దొరికిపోయాడు. స్నాచర్ కోసం ముమ్మరవేట.. సెలబ్రిటీలు వాకింగ్ చేసే కేబీఆర్ పార్కులో ఏకంగా 12 స్నాచింగ్‌లు జరగడం, నిందితు డు కళ్లుగప్పి పారిపోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. దీంతో పోలీసులు పకడ్బందీ వ్యూహం పన్నారు. 15 మంది పోలీసులు గత 25 రోజులుగా సివిల్ డ్రెస్‌లో వాకర్లలాగా స్నాచర్ కోసం జల్లెడ పట్టారు. ఎవరిపైనైనా అనుమానం వస్తే వారిని వెంబడించేవారు. అంతేకాక పార్కు లోపల, జీహెచ్ఎంసీ వాక్‌వేలో 90 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దసరా పండుగ సందర్భంగా ఖర్చుల కోసం మళ్లీ స్నాచింగ్ జరిగే అవకాశం ఉంటుందని భావించిన పోలీసులు కేబీఆర్ పార్కు వద్ద బందోబస్తును పెంచారు. ఇంకోవైపు స్నాచర్ నర్సింహ కూడా ఎప్పటికప్పుడు తన రూట్ మార్చేసే వాడు. స్నాచింగ్‌కు రెండు రోజుల ముందు రెక్కీ నిర్వహించేవాడు. సెల్‌ఫోన్‌తో పార్క్ లోపలికి వెళ్లే నర్సింహ అక్కడే ఉన్న బెంచీ లపై కూర్చొని సెల్‌ఫోన్ ఆపరేట్ చేస్తున్నట్లు నటిస్తూ జంటగా వెళ్లే వారిని అనుసరించే వాడు. ఆ సమయంలో తనకు కాల్స్ రాకుండా.. ఎవరూ తనను ట్రేస్ చేయకుండా ఫోన్‌ను ఫ్లయిట్మోడ్లో పెట్టేవాడు. మోటుగా ఉందని పేరు మార్చేశాడు స్నాచర్ నర్సింహ తన స్నేహితుల వద్ద పేరును మార్చుకున్నాడు. అమ్మాయిల వద్ద నర్సింహ అంటే మోటుగా ఉంటుందని రిషి అని పెట్టుకున్నాడు. ఇతనికి ఒక గర్ల్‌ఫ్రెండ్ కూడా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ దసరాకు మరో దొంగతనం చేసి ఏదైనా టూర్ వెళ్లాలని నర్సింహ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈలోపుగానే పోలీసులకు చిక్కాడు. -
పూడ్చేసిన శవాన్ని మళ్లీ బైటకి తీసి..
అత్తాపూర్: కూతురు మృతిపై తండ్రి అనుమానం వ్యక్తం చేయడంతో ఖననం చేసిన వుృతదేహాన్ని మళ్లీ బైటకి తీసి పోస్ట్‌మార్టం నిర్వహించిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్ స్పెక్టర్ వి.ఉమేందర్ కథనం ప్రకారం.. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని బుద్వేల్ ఇంద్రనగర్ కాలనీకి చెందిన నవనీత(25), థామస్ భార్యాభర్తలు. నవనీత స్వీపర్‌గా విధులు నిర్వర్తించేది. అయితే ఈ నెల 15న నవనీత ఇంట్లో నిద్రలోనే మృతి చెందింది. సహజ మరణంగానే భావించిన కుటుంబసభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా నవనీత తండ్రి నర్సింహ తన కూతురు మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మంగళవారం మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టం నిర్వహించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
శంషాబాద్‌లో ఇద్దరి ఆత్మహత్య
శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో ఆదివారం రాత్రి జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారు. జవహర్ నగర్ పరిధిలోని బాలాజీ నగర్లో కుటుంబ కలహాల కారణంగా జ్యోతి అనే వివాహిత ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందింది. అలాగే, శంషాబాద్ మండలం తొండుపల్లిలో బి.నర్సింహ(46) చెట్టుకు ఉరేసుకుని తనువు చాలించాడు. ఆర్థిక ఇబ్బందులే ఇతని ఆత్మహత్యకు కారణమని గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
వ్యవసాయ యంత్ర పరికరాలకు రూ. 23.7 కోట్లు మంజూరు
లింగంపేట : ఆధునిక వ్యవసాయ యాంత్రీకరణ (యంత్ర పరికరాల కొనుగోలు)కోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ.23.7కోట్ల నిధులు మంజూరు చేసిందని, సన్న,చిన్నకారు రైతులు ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయశాఖ జిల్లా జాయింట్ డెరైక్టర్ నర్సింహా సూచించారు. గురువారం ఆయన లింగంపేటలోని రైతు డిపోలో పలు రకాలకు చెందిన పురుగుమందులను పరిశీ లించారు.ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయ రంగా న్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలనే యోచనతో రైతాంగానికి తెలంగాణ సర్కార్ 50 శాతం సబ్సిడీపై ఆధునిక యంత్ర పరికరాలను సరఫరా చేస్తుందన్నారు. రూ.లక్ష లోపు యంత్ర పరికరాలు కావాల్సిన రైతులకు సంబంధిత ఏడీఏ పరిధిలో రూ. లక్ష నుంచి రూ. కోటీ యాభై ల క్షల వరకు, జిల్లా కలెక్టర్ పరిధిలో నిధులను మంజూరు చేస్తామన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, జడ్పీచైర్మన్,జేడీఏ,డీఆర్డీఏ పీడీ,డ్వామా పీడీ,ఏడీ హార్టీ కల్చర్,అభ్యుదయ రైతు, మహిళాసంఘాల ప్రతినిధితో కమిటీ ఉంటుందన్నారు. వ్యవసాయానికి అవసరమైన వరినాట్లు వేసే యం త్రం,ట్రాక్టర్ లాంటి పెద్ద పరికరాలు పొందే రైతులను జిల్లా కమిటీ ఎంపి క చేస్తుందని తెలిపారు. మార్చి 31 లోగా యంత్ర పరికరాలు కావాల్సిన రైతులు మీసేవ కేంద్రాలలో ధరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచిం చారు. అత్యాధునిక యంత్ర పరికరాలను కొనుగోలు చేసే రైతులకు బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కూడా కల్పిస్తున్నామని చెప్పారు. జిల్లాలో ఎరువుల కొరత లేదు రబీపంటలకు అవసరమైన రసాయన ఎరువులు జిల్లా వ్యాప్తంగా పుష్కలంగా ఉన్నాయని, ఎక్కడాకూడా ఎరువుల కొరత లేదనీ జేడీఏ చెప్పా రు. జిల్లావ్యాప్తంగా 2ల క్షల 4వేల హెక్టార్ల విస్తీర్ణంలో రబీ పంటల సా గును లక్ష్యంగా నిర్ణయించగా నేటి వరకు కేవలం 56వేల హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతున్నాయన్నారు. పలు మండలాలలో వరి నాట్లు ఇప్పుడిప్పుడే వేస్తున్నారని, ఆరుతడి పంటల సాగు తగ్గిందని తెలిపారు. 50వేల హెక్టార్లలో సాగు కావాల్సిన శెనగ పంట కేవలం 10వేల హెక్టార్లలో సాగవుతోందన్నా రు. ఖరీఫ్‌లో తీవ్ర వర్షాభావం కారణంగా జిల్లావ్యాప్తంగా భూగర్భ జ లాలు అడుగంటి పోతున్నాయని అన్నారు. కామారెడ్డి డివిజన్లో 20 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు తగ్గాయని, రబీ సీజన్లో కరెంట్ కోతలు కూడా ఉంటాయన్నారు. -
ప్రాణం తీసిన ‘మిస్డ్‌కాల్’
కుత్బుల్లాపూర్: ఓ మిస్డ్ కాల్ అనుమానం రేపింది.. మహిళ మృతికి కారణమైంది.. ఈ సంఘటన పేట్ బషీరాబాద్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ప్రవీందర్‌రావు, బాధితులు తెలిపిన వివరాలు.. మెదక్ జిల్లా దుబ్బాక మండలం, ఎనగర్తి గ్రామానికి చెందిన కనకవ్వ(30)కు అదే మండలం ఆకారం గ్రామానికి చెందిన నర్సింహ(36)తో 2005లో వివాహం జరిగింది. ఎనిమిదేళ్ల పాటు స్వగ్రామంలోనే ఉన్న వీరు కుటుంబ కలహాల నేపథ్యంలో ఏడాది క్రితం రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ మండలం, గుండ్లపోచంపల్లికి వచ్చి నివాసముంటున్నారు. కనకవ్వ స్థానికంగా సీడ్స్ కంపెనీలో పనికి వెళ్తుండగా, నర్సింహ కారు డ్రైవర్. వీరికి నవ్వ(8) కుమార్తె ఉంది. భార్యపై అనుమానంతో నర్సింహ తరచు గొడవ పడుతుండేవారు. ఈ క్రమంలో శనివారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఆదివారం తెల్లవారు జామున 3.30 గంటలకు కనకవ్వ సెల్‌ఫోన్‌కు మిస్డ్ కాల్ వచ్చింది. దీంతో నర్సింహ ఆ కాల్ ఎక్కడ నుంచి వచ్చింది.. ఎవడు చేశాడంటూ ఆమెను చితకబాదాడు. పక్కనే ఉంటున్న అత్తగారి ఇంటికి తరిమి కొట్టాడు. కనకవ్వ సృ్పహ కోల్పోయింది. పేట్ బషీరాబాద్ ఆర్ఆర్ ఆస్పత్రికి తరలించగా తలకు తీవ్ర గాయాలు కావడంతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి విచారణ ప్రారంభించారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. నర్సింహను అదుపులోకి తీసుకున్నారు. రాత్రి సమయంలో వచ్చిన మిస్డ్ కాల్ నంబరు విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
దోపిడీ దొంగల కిరాతకం
చోరీకి వచ్చి దాడి.. ముగ్గురు మృతి, ఒకరికి తీవ్రగాయాలు రఘునాథపల్లి: వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలోని ఓ ఇంట్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ముగ్గురు కుటుంబ సభ్యులను కిరాతకంగా హత్య చేసి బంగారు ఆభరణాలతో పాటు నగదుతో ఉడాయించారు. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చెరుకు నర్సింహ అదే గ్రామంలో ఖిలాషాపురం క్రాస్ రోడ్డు వద్ద హోటల్ నిర్వహిస్తున్నాడు. ఇతని ఇంటికి కొంత దూరంలో సోదరుడు సత్తయ్య నివసిస్తున్నాడు. నర్సింహ సోదరుని వద్ద ఉంటున్న వారి తండ్రి ఆరురోజుల క్రితం మరణించాడు. సంప్రదాయాల ప్రకారం గురువారం ఐదవరోజు కార్యక్రమాలు నిర్వహించి రాత్రి నర్సింహ తన సోదరుడి ఇంటి వ ద్దనే భార్య రేణుకతో ఉండిపోయాడు. కుమారుడు హర్షవర్ధన్(08), కూతురు అఖిలానందిని(11), అత్త బూడిద లచ్చమ్మ (51), లచ్చమ్మ తల్లి లింగంపల్లి రాధమ్మ(71)లను ఇంటికి వెళ్లి పడుకోమని పంపాడు. వారు వచ్చి.. హోటల్లోని ఇంట్లో పడుకున్నారు. శుక్రవారం తెల్లవారు జామున దుండగులు ఇంటి వెనకాల తలుపును పైకి లేపి ఇంట్లో దూరారు. మధ్య గదిలో ఉన్న బీరువాను తెరుస్తుండగా అలికిడికి కుటుంబ సభ్యులు లేవడంతో వారిపై దాడికి తెగ బడ్డారు. కత్తి, రాడ్లతో దాడి చేయగా లచ్చమ్మతో పాటు మనుమరాలు అఖిలానందిని అక్కడికక్కడే రక్తపు మడుగులో మృతి చెందారు. అపస్మారక స్థితిలో ఉన్న రాధమ్మను వరంగల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలొదిలింది. తీవ్ర గాయాలతో ఉన్న హర్షవర్ధన్ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దొంగలు లచ్చమ్మ, రాధమ్మ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకోవడంతో పాటు బీరువాలోని తొమ్మిది తులాల బంగారం, రూ.90 వేల నగదు ఎత్తుకెళ్లారు. అంతకు ముందు అదే గ్రామానికి చెందిన ఎల్లయ్య ఇంట్లోకి దూరి రూ.11 వేల నగదు, మూడు గ్రాముల బంగారం అపహరించడంతో పాటు మరో రెండిళ్లను దోచుకోవడానికి యత్నించారు. వరంగల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కాంతారావు, రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాసు, అడిషనల్ ఎస్పీ కె.శ్రీకాంత్ సంఘటనా స్థలిని సందర్శించారు. -
పెళ్లింట చావుబాజా
కాసేపట్లో పెళ్లికొడుకు కాబోయే ముందు రోడ్డు ప్రమాదంలో మృతి చిట్యాల పెళ్టింట చావుబాజా మోగింది. కాసేపట్లో పెళ్లికొడుకు కావాల్సిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. చిట్యాల మండలం శివనేనిగూడేనికి చెందిన నర్సింహ(25)కు, రామన్నపేట మండలం నీర్నేంలకు చెందిన యువతితో 23వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. పెళ్లిపనుల నిమిత్తం అతను సోమవారం రామన్నపేటకు వెళ్లాడు. తిరుగు పయనమవుతుండగా, సాయంత్రం పేట శివారు దాటుతుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో అతను మృతి చెందాడు. మంగళవారం పెళ్లికొడుకు కావాల్సిన బిడ్డ శవమై రావడంతో కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. ఒగ్గుకథలు చెబుతూ చుట్టుపక్కల గ్రామాల్లో కలవిడిగా ఉండే నర్సింహ మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. -
ఔటర్‌పై ప్రమాదం.. తండ్రీకొడుకుల మృతి
శంషాబాద్ రాంగ్ రూట్లో వచ్చిన కారు మరో కారును ఢీకొన డంతో తండ్రీకొడుకులు దుర్మరణం చెందారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని పెద్దగోల్కొండ సమీపంలోని ఔటర్ రింగురోడ్డుపై గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు.. రాజేంద్రనగర్ సర్కిల్ బుద్వేల్‌కు చెందిన పడగంట నర్సింహా(59), ఆయన పెద్దకొడుకు బాల్‌రాజ్(40), కోడలు సంధ్యారాణి, కూతురు లక్ష్మి, అల్లుడు ఆనంద్‌తో కలసి మారుతీ వ్యాగనార్ వాహనంలో గురువారం హయత్‌నగర్ మండలం మన్నెముత్యాలకుంటలోని బంధువుల శుభకార్యానికి వెళ్లారు. అర్ధరాత్రి తిరుగు ప్రయాణంలో బొంగుళూరు గేటు వద్ద ఔటర్‌పైకి చేరుకున్న వీరి కారు దారి తప్పింది. శంషాబాద్ వైపు రావాల్సి ఉండగా రాంగ్‌రూట్‌ను ఎంచుకున్నారు. ఇదే సమయం లో నిజాంపేట నివాసి శాంత రాం, భార్య స్వరాజ్యలక్ష్మి, స్నేహితులు అనిల్, అనుదీప్, కార్తీక్‌తో కలసి సాంత్రో కారులో ఔటర్‌పై నుంచి విజయవాడ వెళ్తున్నాడు. అర్ధరాత్రి తర్వాత 2:30 గంటల సమయంలో పెద్దగోల్కొండ రోటరీ దాటగానే రాంగ్ రూట్లో వస్తున్న వ్యాగనార్ సాంత్రో కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యాగనార్ నడుపుతున్న బాల్‌రాజ్, ముందు సీట్లో కూర్చున్న ఆయన తండ్రి నర్సింహ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కారు లో ఉన్న ఆనంద్, లక్ష్మి, సంధ్యారాణి, కాళ్లకు తీవ్రగాయాల య్యాయి. సాంత్రో కారులోని అనుదీప్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియాకు తరలించారు. క్షతగ్రాతులను 108 వాహనంలో స్థానిక ఆస్పత్రికి తరలించారు. -
యాడికి బోయినా ఎలచ్చన్ల లొల్లే..
బాలరాజు: నర్సింహ పెదనాయినా.. యాడికి బోతానవే.. వారం రోజులైంది. నిన్ను జూసి.. ఏదైనా ముచ్చట జెప్తవేమోనని రోజూ ఒచ్చిపోతున్న. నువ్వేమో కనబడ్తలేవ్. నర్సింహ: ఏడ బిడ్డా.. పనికిబోక వారం రోజులైతాంది. ఎలచ్చన్లు గదా.. ఒకటా రెండా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ అన్నీ ఒక్కసారిగ వచ్చే.. మళ్లీ ఐదేండ్ల దాకా ఎలచ్చన్లు ఉండయి. గప్పటిదాకా మళ్లీ ఎవ్వరు పల్కరియ్యరు. అందుకే గిప్పుడే ఎలచ్చన్ల సిత్రాలు జూద్దామని బోయిన. బాలరాజు: అవును గదనే యాడజూసినా గివే ముచ్చట్లు జెప్పుకుంటున్రు. ఇగ పార్టీలల్ల ఉన్న పోరగాండ్లు పొద్దున బోయి రాతిరికి ఎప్పుడోస్తున్రో దెలుస్తలేదు. నర్సింహ: అవును బిడ్డా. ఈ ఎలచ్చన్లలో మనోడు గెల్వక బోతే ఐదేండ్లదాక ఎవ్వడూ దేకడంటూ పోరగాండ్లు వాళ్ల లీడరు కోసం తిర్గుతున్నరు. పార్టీలు గూడా అంతే. ఈ సారి ఎలచ్చన్ల గెల్వకపోతే పార్టీలకు ఠిఖానా ఉండది. బాలరాజు: అవునుగని జిల్లాల, మన నియోజకవర్గంల, మనమండల్ల యెట్లుందో జెప్పకపోతివి జర. నర్సింహ: ఏముందిరా.. అన్ని పార్టీలల్ల ఆగమాగం. జిల్లాల జూస్కుంటుంటే నిన్న మొన్నటిదాకా ఒక పార్టీలో ఉన్నోళ్లు వే రొగపార్టీకి - గా పార్టీల ఉన్నోళ్లు ఇంకో పార్టీలోకి దుంకుతున్నరు. టిక్కెట్లు ఇయ్యరేమోనని కొందరు.. గాలి ఎటు మళ్లిందో సూస్కుంట పార్టీలోకి ఉర్కేటోళ్లు కొందరు... మన జెడ్పీ పదవి జనరల్ ఆడోళ్లకు అయ్యింది గదా.. కొన్ని ఊర్లు జీహెచ్ఎంసీల గల్వకుంట కోర్డు అడ్డుబడింది. ఇగ జూస్కో... సూస్కుందాం అంటే సూస్కుందాం అనేటట్టు ఎలచ్చన ్లల్ల కొట్లాడ్తున్నరు. బాలరాజు: అదిసరేగని మన నియోజకవర్గం కథేందే.. నర్సింహ: మనది మేడ్చల్ కిందికి వస్తది గదా. నాలుగు మండలాల్ల జెడ్పీటీసీ ఎలచ్చన్లు జోరుమీద ఉన్నయి. ఇగ అన్ని పార్టీలోళ్లు డ్వాక్రా గ్రూపులనీ, ఆడబడుచుల లాంచనాలనీ, ఏదో తీర్గ వారిని మచ్చిక జేసుకునే పనిలో ఉన్నరు. ఇగ మొగొళ్లకేమో అది జేస్తం. ఇది జేస్తం అంటూ చెప్తున్నరు. జెడ్పీటీసీ, ఎంపీపీ సీట్లు గెల్చుకుంటే ఇక అటెన్క ఎమ్మెల్యే ఎలచ్చన్లలో ఎట్లజెయ్యాలనేది తెలుస్తదని అన్ని పార్టీలోళ్లు అనుకొంటుండ్రు. బాలరాజు: గమ్మతుగుంది గదనే.. మరి మన మండల్ల.. నర్సింహ: మన మండల్ల కాంగ్రెస్, టీడీపీలు కుస్తీ పట్లు పడ్తున్నయి. మోకా జూస్కొని టీఆర్ఎస్ గూడా కోషీష్జేస్తోంది. మండలంల గిట్ల పాగా వేస్తేనే వచ్చే ఎమ్మెల్యే ఎలచ్చన్లల్ల ఓట్లు రాలుతయని అందరూ సోచాయిస్తుండ్రు. ఇంగ.. ముందుగల్ల జెడ్పీటీసీ టిక్కటు ఎవరికిస్తరో ఆ తర్వాతనే మేము గూడా జెప్తమంటున్రు కాంగ్రెస్ -టీడీపోల్లు -సొంచాయించగా.. సొంచాయించగా.. టీడీపోళ్లు బండారు రమాదేవి అనే ఆమెకో.. లేదా చీర్యాల దుర్గమ్మకో టిక్కటు ఇయ్యాలని అనుకుంటుండ్రట. కాంగ్రెస్ పార్టోళ్లు నాగారం గ్రామానికి చెందిన మాధవికి, లేదా కీసరకు చెందిన పంతులమ్మ పద్మమ్మకు టిక్కటు ఇద్దామని అనుకుంటుండ్రట. ఐతారం కల్ల ఎవ్వరెవ్వరు నిలబడుతరో పురాగ తెలుస్తది. యాడ జూసినా ఎలచ్చన్ల కథే నడుస్తున్నది. బతిమాలుడు- బుజ్జగించుడు.. అయ్యా అప్పా అని దండాలు పెట్టుడు- ఒగటేమిటీ సినిమాలల్ల గూడా ఇంత ఖుషీ దొరకదు మనకు. ఇయన్నీ జూద్దామనే రోజూ బోతున్న బిడ్డా. బాలరాజు: పెదనాయనా.. నువ్వు చెప్తుంటే చిత్రంగుందే. సూస్తే ఇంకెట్లుం టదో.. నేను గూడా నీతో వస్తా.. పా.. - బి.అంజిరెడ్డి/కీసర