లింగంపేట : ఆధునిక వ్యవసాయ యాంత్రీకరణ (యంత్ర పరికరాల కొనుగోలు)కోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ.23.7కోట్ల నిధులు మంజూరు చేసిందని, సన్న,చిన్నకారు రైతులు ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయశాఖ జిల్లా జాయింట్ డెరైక్టర్ నర్సింహా సూచించారు. గురువారం ఆయన లింగంపేటలోని రైతు డిపోలో పలు రకాలకు చెందిన పురుగుమందులను పరిశీ లించారు.ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయ రంగా న్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలనే యోచనతో రైతాంగానికి తెలంగాణ సర్కార్ 50 శాతం సబ్సిడీపై ఆధునిక యంత్ర పరికరాలను సరఫరా చేస్తుందన్నారు.
రూ.లక్ష లోపు యంత్ర పరికరాలు కావాల్సిన రైతులకు సంబంధిత ఏడీఏ పరిధిలో రూ. లక్ష నుంచి రూ. కోటీ యాభై ల క్షల వరకు, జిల్లా కలెక్టర్ పరిధిలో నిధులను మంజూరు చేస్తామన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, జడ్పీచైర్మన్,జేడీఏ,డీఆర్‌డీఏ పీడీ,డ్వామా పీడీ,ఏడీ హార్టీ కల్చర్,అభ్యుదయ రైతు, మహిళాసంఘాల ప్రతినిధితో కమిటీ ఉంటుందన్నారు. వ్యవసాయానికి అవసరమైన వరినాట్లు వేసే యం త్రం,ట్రాక్టర్ లాంటి పెద్ద పరికరాలు పొందే రైతులను జిల్లా కమిటీ ఎంపి క చేస్తుందని తెలిపారు. మార్చి 31 లోగా యంత్ర పరికరాలు కావాల్సిన రైతులు మీసేవ కేంద్రాలలో ధరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచిం చారు. అత్యాధునిక యంత్ర పరికరాలను కొనుగోలు చేసే రైతులకు బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కూడా కల్పిస్తున్నామని చెప్పారు.
జిల్లాలో ఎరువుల కొరత లేదు
రబీపంటలకు అవసరమైన రసాయన ఎరువులు జిల్లా వ్యాప్తంగా పుష్కలంగా ఉన్నాయని, ఎక్కడాకూడా ఎరువుల కొరత లేదనీ జేడీఏ చెప్పా రు. జిల్లావ్యాప్తంగా 2ల క్షల 4వేల హెక్టార్ల విస్తీర్ణంలో రబీ పంటల సా గును లక్ష్యంగా నిర్ణయించగా నేటి వరకు కేవలం 56వేల హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతున్నాయన్నారు. పలు మండలాలలో వరి నాట్లు ఇప్పుడిప్పుడే వేస్తున్నారని, ఆరుతడి పంటల సాగు తగ్గిందని తెలిపారు. 50వేల హెక్టార్లలో సాగు కావాల్సిన శెనగ పంట కేవలం 10వేల హెక్టార్లలో సాగవుతోందన్నా రు. ఖరీఫ్‌లో తీవ్ర వర్షాభావం కారణంగా జిల్లావ్యాప్తంగా భూగర్భ జ లాలు అడుగంటి పోతున్నాయని అన్నారు. కామారెడ్డి డివిజన్‌లో 20 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు తగ్గాయని, రబీ సీజన్‌లో కరెంట్ కోతలు కూడా ఉంటాయన్నారు.
వ్యవసాయ యంత్ర పరికరాలకు రూ. 23.7 కోట్లు మంజూరు
Published Fri, Dec 19 2014 2:11 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement