machine tools
-
పారిశ్రామిక వృద్ధి అర శాతమే..!
న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగం నవంబర్‌లో పేలవ పనితీరును ప్రదర్శించింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) ఈ నెలల్లో కేవలం 0.5 శాతంగా (2017 ఇదే నెలతో పోల్చి) నమోదయ్యింది. సూచీలోని తయారీ, వినియోగ రంగాల్లో అసలు వృద్ధి నమోదుకాకపోగా, క్షీణ రేటు నమోదయ్యింది. భారీ యంత్ర పరికరాల డిమాండ్‌ను సూచించే క్యాపిటల్ గూడ్స్‌లో కూడా ఇదే ధోరణి నెలకొంది. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) శుక్రవారం విడుదల చేసిన నవంబర్ పారిశ్రామిక ఉత్పత్తి లెక్కల్లో ముఖ్యమైన అంశాలు... మొత్తం సూచీలో 77.63 శాతం వాటా కలిగిన తయారీ రంగంలో నవంబర్‌లో వృద్ధిలేకపోగా –0.4 శాతం క్షీణత నమోదుచేసుకుంది. 2017 ఇదే నెలలో ఈ రేటు 10.4 శాతం. ఈ విభాగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 10తప్ప మిగిలినవి ప్రతికూల వృద్ధిరేటును నమోదుచేసుకున్నాయి. డిమాండ్‌కు ప్రతిబింబమైన క్యాపిటల్ గూడ్స్ విభాగంలో కూడా వృద్ధిలేకపోగా –3.4 శాతం క్షీణత నమోదయ్యింది. 2017 ఇదే నెలలో ఈ రంగం వృద్ది రేటు 3.7 శాతం. కన్జూమర్ డ్యూరబుల్స్ రంగంలో కూడా 3.1 శాతం వృద్ధి రేటు 0.9 శాతం క్షీణతలోకి జారింది. కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్ విషయంలో కూడా 23.7 శాతం భారీ వృద్ధిరేటు 0.6% క్షీణతలోకి పడిపోవడం గమనార్హం. మైనింగ్ వృద్ధి రేటు 1.4% నుంచి 2.7 శాతానికి పెరిగింది. విద్యుత్ రంగంలో ఉత్పత్తి 3.9% నుంచి 5.1%కి ఎగసింది. 2017 నవంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ది రేటు 8.5%. ప్రస్తుతం నమోదయిన తక్కువ స్థాయి వృద్ధి రేటు 2017 జూన్ తరువాత ఎప్పుడూ నమోదుకాలేదు. ఆ నెల్లో పారిశ్రామిక రంగంలో అసలు వృద్ధిలేకపోగా –0.3 శాతం క్షీణత నమోదయ్యింది. 2018 అక్టోబర్‌లో వృద్ధిరేటును 8.1 శాతం నుంచి 8.4 శాతానికి పెంచడం విశేషం. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ పర్లేదు... కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య పారిశ్రామిక ఉత్పత్తి (2017 ఇదే కాలంతో పోల్చి) 3.2 శాతం నుంచి 5 శాతానికి పెరిగింది. ఆర్థిక సంవత్సరం మొత్తంగా 5 నుంచి 6 శాతం శ్రేణిలో ఈ రేటు ఉంటుందని అంచనా -
యంత్రం.. యాతనే!
♦ యాంత్రీకరణకు సరికొత్త విధానం ♦ రాయితీ యంత్ర పరికరాలకు డీబీటీ ♦ కొనుగోలు చేయాలంటే ఖరీదు మొత్తం ముందే చెల్లించాలి ♦ రాయితీ సొమ్ము తర్వాత రైతు ఖాతాకు జమ ♦ జీఎస్టీ అమలుతో మారనున్న రాయితీ యంత్ర పరికరాల రేట్లు కడప అగ్రికల్చర్ : వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలులో ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అమలు చేయబోతోంది. ఇప్పటివరకు యంత్ర పరికరం కొనుగోలులో రాయితీ పోను మిగిలిన సొమ్ము నగదు రూపంలో గానీ, డీడీ రూపంలోగానీ కంపెనీకి చెల్లిస్తే యాంత్రీకరణ పరికరం రైతుకు చేరేది. ఇక నుంచి డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పద్ధతి ద్వారా యంత్ర పరికరాల కొనుగోలులో నేరుగా రైతు ఖాతాకే రాయితీ జమ అవుతుంది. ఈ విధానంలో రైతు ముందుగా యంత్రం ఖరీదు మొత్తం చెల్లించాల్సి ఉంది. ఆ మొత్తం యంత్రం కొనుగోలు చేసే డీలర్ అకౌంట్‌కు జమచేయాలి. ఆ తర్వాత ప్రభుత్వం ప్రకటించిన రాయితీ సొమ్ము తిరిగి రైతు ఖాతాకి జమచేస్తారు. అంటే ఇప్పుడు వంట గ్యాస్‌కు అమలు చేస్తున్న విధానాన్ని వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి అమలు చేయబోతున్నారు. యాప్ ద్వారానే ఆన్లైన్ దరఖాస్తు సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్(ఎస్ఎంఎఎం) పథకం అమలుకు ప్రభుత్వం కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా రైతులు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. రైతు కావాల్సిన కంపెనీని ఎంపిక చేసుకుని ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. పైగా జిల్లాకు కేటాయించిన వ్యవసాయ రాయితీ పరికరాలను ఆయా మండలాలకు కేటాయిస్తారు. ఆ మండలాలకు కేటాయించిన యంత్రాలకే రైతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఒకవేళ రైతు కోరుకున్న వ్యవసాయ పరికరంగానీ, యంత్రంగానీ లేకపోయిన ఆల్ రెడీ ఇతర రైతులు దరఖాస్తు చేసుకుని ఉన్నా లేదా ఆ మండలానికి కేటాయించిన పరికరాలు అయిపోయినా రైతు వెనుదిరగాల్సిందే. నూతన యాప్‌పై శిక్షణ డీబీటీ ద్వారా అమలు చేసే యాంత్రీకరణ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు కొత్తగా అమలు చేయబోయే యాప్‌పై వ్యవసాయ శాఖ టెక్నికల్ ఏథోలకు త్వరలో శిక్షణ ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఈ యాప్ అమలుపై అటు రైతులకు, ఇటు వ్యవసాయాధికారులకు అవగాహన కల్పిస్తారు. అనంతరం వ్యవసాయ పరికరాలు కావాల్సిన రైతులు నేరుగా కొత్త యాప్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయశాఖ టెక్నికల్ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టే ఈ విధానం గురించి రైతులకు తెలిస్తే వ్యతిరేకత వచ్చే అవకాశం లేకపోలేదు. ఇప్పటివరకు రాయితీ సొమ్ము పోను మిగతా సొమ్ము చెల్లించి యంత్రాలు కొనుగోలు చేయలేక రైతులు సతమతమవుతున్నారు. కొత్త విధానంలో యం త్రం రేటు మొత్తం ముందుగా చెల్లించి కొనుగోలు చేయాలంటే రైతులకు కష్టమే అవుతుంది. చిన్న, సన్నకారు రైతులతో పాటు ఎస్సీ, ఎస్టీ రైతులు సబ్సిడీ యంత్రాలకు దూరమవుతారు. యంత్ర పరికరాలకు మారనున్న రేట్లు ఈ ఏడాది జూలై నుంచి అమలవుతున్న జీఎస్టీతో గతంలో ఉన్న యంత్ర పరికరాల ధరలు మారనున్నాయి. విత్తనం గొర్రు, ఎరువులు, విత్తనం ఒకేసారి విత్తే గొర్రు, తొమ్మిది చెక్కల గొర్రు, పదకొండు చెక్కల గొర్రు, రెండు మడకల పరికరం, వరికోత మిషన్, ఫవర్ వీడర్, తైవాన్ స్ప్రేయర్, ట్రాక్టన్ మౌన్‌టెడ్ స్ప్రేయర్, రోటోవేటర్ తదితర పరికరాలతో పాటు చిన్న, పెద్ద ట్రాక్టర్ల రాయితీ రేట్లు మారనున్నాయి. జీఎస్టీ విధానంలో జాప్యం వలన రాయితీ రేట్లు ఖరారు కాలేదు. వాటి విధివిధానాలు అమలు చేస్తున్నట్లు సమాచారం అయితే ఉందని జిల్లా వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. కానీ పూర్తి వివరాలు ఇంత వరకు రాలేదని అధికారులు అంటున్నారు. జిల్లాకు రూ.90కోట్ల ప్రతిపాదనలు 2017–18 లో ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ రాయితీ పరికరాలను అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జిల్లా వ్యవసాయశాఖ ఎస్ఎంఎఎం స్కీం కింద రూ.33 కోట్లు, రాష్ట్రీయ కృషి వికా>స్ యోజన కింద రూ.3కోట్లు, ఎస్డీపీ కింద రూ. 27 కోట్లతో ప్రతిపాదనలు పంపింది. ఇందులో రాష్ట్రప్రభుత్వం నిధులు 40 శాతం, కేంద్ర నిధులు 60శాతం ఉన్నాయి. వ్యవసాయ పరికరాల కొనుగోలులో జనరల్ కేటగిరి కింద 50శాతం రాయితీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 70 శాతం రాయితీ అమలు చేయనున్నారు. -
మరమ్మతుల సేద్యం !
చిలకలూరిపేటరూరల్ : రైతులకు ఆధునిక సేద్యాన్ని దూరం చేస్తున్నారు. వ్యవసాయంలో పూర్తి స్థాయి యాంత్రీకరణను ప్రోత్సహించాల్సిన పాలకులు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా వ్యవసాయ యంత్ర పరికరాలు అందుబాటులో లేక రైతులు ఏటా సాగులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాత పరికరాలకు మరమ్మతులు చేయించుకుని సేద్యానికి నడుం కడుతున్నారు. యంత్ర పరికరాలు కావాలని ఖరీఫ్ సీజన్లో వందలాది మంది రైతులు చేసుకున్న దరఖాస్తులకు రబీ వచ్చినా మోక్షం కలగకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. సాక్షాత్తూ వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట ప్రాంతంలోనే పరిస్థితి ఇలాఉంటే, ఎక్కడికి వెళ్లి ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. నియోజకవర్గంలోని చిలకలూరిపేట, నాదెండ్ల, యడ్లపాడు మండలాల పరిధిలో 90 వేల ఎకరాల్లో రైతులు ప్రధానంగా పత్తి, మిర్చి, పొగాకు, కూరగాయలు సాగు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పత్తి, మిర్చి పొలాల్లో పురుగుమందు పిచికారి చేసేందుకు అవసరమైన తెవాన్ స్ప్రేయర్లు అందుబాటులో లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం రెండేళ్ల నుంచి వీటిని మంజూరు చేయడం లేదని రైతులు వాపోతున్నారు. మూలనపడిన పాత స్ప్రేయర్లను బయటకు తీసి మరమ్మతులు చేయించుకుని వాడుతున్నట్టు చెబుతున్నారు. అర్జీలు స్వీకరించని మీ సేవ కేంద్రాలు ... మీ సేవ కేంద్రాల ద్వారా అర్జీలు అందిస్తే వ్యవసాయ పరికరాలు అందిస్తామని నెల కిందట చెప్పిన అధికారులు నేటికీ ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. కనీసం రైతుల దరఖాస్తులను మీ సేవ కేంద్రాల్లో అనుమతించడం లేదు. ఇదిలావుంటే, వ్యవసాయ పరికరాల అందజేతలో టీడీపీకి చెందిన రైతులకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ అధికారులు స్వీకరించిన అర్జీలలో టీడీపీ నాయకులు, ఆ పార్టీకి చెందిన రైతుల దరఖాస్తులను మాత్రమే అధికారులు పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. రైతులు ప్రధానంగా వినియోగించే పరికరాలు .. వ్యవసాయ యంత్ర పరికరాలను ప్రభుత్వం 50 శాతం రాయితీపై అందిస్తోంది. మిగిలిన 50 శాతాన్ని రైతు భరించి కొనుగోలు చేసుకోవాలి. ప్రధానంగా టు స్ట్రోక్, ఫోర్ స్ట్రోక్ తైవాన్, ట్రాక్టర్ స్ప్రేయర్, పవర్‌స్ప్రేయర్, పోర్టబుల్ స్ప్రేయర్, మొబైల్ స్ప్రేయర్, బ్రష్ కట్టర్, ట్రాన్స్‌ప్లాంటర్, ఫెర్టిలైజర్ డ్రిల్, రోటోవేటర్-36,42 బ్లేడ్, ట్రాక్టర్ స్ప్రేగన్స్ తదితర పరికరాలు రైతులకు అవసరమవుతాయి. వీటిని వాడడం వల్ల సాగు ఖర్చు తగ్గడంతోపాటు సమయం కూడా ఆదా అవుతోంది. అయితే వీటిని అందజేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ సమస్యతోనే... వ్యవసాయ యంత్ర పరికరాలు అందుబాటులో లేకపోవడంపై మండల వ్యవసాయాధికారి వి.వాణీశ్రీని ప్రశ్నించగా, మీ సేవ ద్వారా ఆన్లైన్ అందుబాటులోకి రాకపోవడం వల్ల రైతుల నుంచి అర్జీలు స్వీకరించడం లేదన్నారు. రైతులు కోరుతున్న ప్రతి ఒక్క పరికరానికి మీ సేవ కేంద్రం ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉందన్నారు. టీడీపీకి చెందిన రైతులకు ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. దరఖాస్తు చేసుకున్న రైతులు అందరికీ మంజూరు చేస్తామన్నారు. -
వ్యవసాయ యంత్ర పరికరాలకు రూ. 23.7 కోట్లు మంజూరు
లింగంపేట : ఆధునిక వ్యవసాయ యాంత్రీకరణ (యంత్ర పరికరాల కొనుగోలు)కోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ.23.7కోట్ల నిధులు మంజూరు చేసిందని, సన్న,చిన్నకారు రైతులు ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయశాఖ జిల్లా జాయింట్ డెరైక్టర్ నర్సింహా సూచించారు. గురువారం ఆయన లింగంపేటలోని రైతు డిపోలో పలు రకాలకు చెందిన పురుగుమందులను పరిశీ లించారు.ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయ రంగా న్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలనే యోచనతో రైతాంగానికి తెలంగాణ సర్కార్ 50 శాతం సబ్సిడీపై ఆధునిక యంత్ర పరికరాలను సరఫరా చేస్తుందన్నారు. రూ.లక్ష లోపు యంత్ర పరికరాలు కావాల్సిన రైతులకు సంబంధిత ఏడీఏ పరిధిలో రూ. లక్ష నుంచి రూ. కోటీ యాభై ల క్షల వరకు, జిల్లా కలెక్టర్ పరిధిలో నిధులను మంజూరు చేస్తామన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, జడ్పీచైర్మన్,జేడీఏ,డీఆర్డీఏ పీడీ,డ్వామా పీడీ,ఏడీ హార్టీ కల్చర్,అభ్యుదయ రైతు, మహిళాసంఘాల ప్రతినిధితో కమిటీ ఉంటుందన్నారు. వ్యవసాయానికి అవసరమైన వరినాట్లు వేసే యం త్రం,ట్రాక్టర్ లాంటి పెద్ద పరికరాలు పొందే రైతులను జిల్లా కమిటీ ఎంపి క చేస్తుందని తెలిపారు. మార్చి 31 లోగా యంత్ర పరికరాలు కావాల్సిన రైతులు మీసేవ కేంద్రాలలో ధరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచిం చారు. అత్యాధునిక యంత్ర పరికరాలను కొనుగోలు చేసే రైతులకు బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కూడా కల్పిస్తున్నామని చెప్పారు. జిల్లాలో ఎరువుల కొరత లేదు రబీపంటలకు అవసరమైన రసాయన ఎరువులు జిల్లా వ్యాప్తంగా పుష్కలంగా ఉన్నాయని, ఎక్కడాకూడా ఎరువుల కొరత లేదనీ జేడీఏ చెప్పా రు. జిల్లావ్యాప్తంగా 2ల క్షల 4వేల హెక్టార్ల విస్తీర్ణంలో రబీ పంటల సా గును లక్ష్యంగా నిర్ణయించగా నేటి వరకు కేవలం 56వేల హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతున్నాయన్నారు. పలు మండలాలలో వరి నాట్లు ఇప్పుడిప్పుడే వేస్తున్నారని, ఆరుతడి పంటల సాగు తగ్గిందని తెలిపారు. 50వేల హెక్టార్లలో సాగు కావాల్సిన శెనగ పంట కేవలం 10వేల హెక్టార్లలో సాగవుతోందన్నా రు. ఖరీఫ్‌లో తీవ్ర వర్షాభావం కారణంగా జిల్లావ్యాప్తంగా భూగర్భ జ లాలు అడుగంటి పోతున్నాయని అన్నారు. కామారెడ్డి డివిజన్లో 20 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు తగ్గాయని, రబీ సీజన్లో కరెంట్ కోతలు కూడా ఉంటాయన్నారు. -
అన్నదాతకు తీపి కబురు
సాక్షి, ఏలూరు : సాగు ఖర్చులు పెరిగిపోయి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న అన్నదాతలకు ఇదో తీపి కబురు. కూలీలు దొరక్కపోవడమో లేక ఎక్కువ కూలి అడుగుత ున్నారనో వ్యవసాయ పనులను సకాలంలో పూర్తిచేసుకోలేకపోతున్న ైరైతులకు, రైతు మిత్ర గ్రూపులకు వ్యవసాయ శాఖ 50 శాతం రాయితీపై యంత్ర పరికరాలు సరఫరా చేయనుంది. ఇప్పటివరకూ రైతు మిత్ర గ్రూపులకు మాత్రమే కల్పిస్తున్న ఈ ప్రయోజనాన్ని ఇకనుంచి రైతులకూ అందించనున్నారు. దీనికోసం జిల్లాకు రాష్ట్ర బడ్జెట్ కింద రూ.417.95 లక్షలు, ఆర్కేవీవై కింద రూ.465.29 లక్షలను ప్రభుత్వం కేటాయించింది. ఈ మొత్తాన్ని జిల్లాలోని 12 వ్యవసాయ డివిజన్లకు.. అక్కడి నుంచి మండలాలకు కేటాయించారు. ట్రాక్టర్ల సాయంతో నడిపే పనిముట్లు, కల్టివేటర్లు, డిస్క్హెరొలు, లెవె లింగ్ బ్లేడ్లు, ఎంబీ నాగళ్లు, రోటోవేటర్లు, వరికోసే యంత్రాలు, రిపర్లు, మొక్కజొన్న ఆడే యంత్రాలు మొదలైన వాటిని రైతులు ఇకనుంచి వ్యక్తిగతంగా సబ్సిడీపై పొందవచ్చు. తైవాన్ స్ప్రేయర్లు, చేతి పంపులు, చిన్న ట్రాక్టర్లు, పవర్ టిల్లర్స్, డీజిల్ ఇంజిన్స్, టార్పాలిన్ వంటివి కూడా వ్యక్తిగతంగా తీసుకోవచ్చు. రైతుమిత్ర గ్రూపులు (ఆర్ఎమ్జీఎస్), జాయింట్ లయబిలిటీ గ్రూపు (జేఎల్‌జీ)లకు ప్రతి పంటకు సంబంధించిన యంత్ర సముదాయాన్ని ప్యాకేజీ రూపంలో ఇస్తారు. దీనిలో వరి, మొక్కజొన్న, పొగాకు, వేరుశనగ పంటలలో ప్రటట పంటకు మొదటి నుండి చివరి వరకు అవసరమయ్యే అన్ని పరికరాలను ఒక ప్యాకేజీ రూపంలో 50 శాతం సబ్సిడీపై గ్రూపునకు అందజేస్తారు. దీనిని కస్టమ్ హైరింగ్ సెంటర్ (సీహెచ్సి) అంటారు. గ్రూపు సభ్యులు వీటిని గ్రామంలోని రైతులకు అద్దెకు ఇవ్వవచ్చు. అదేవిధంగా గ్రూపులకు ఆ గ్రా మంలో అవసరమయ్యే ట్రాక్టర్‌తో నడిచే పని ముట్లను కూడా ప్యాకేజీలో 50 శాతం సబ్సిడీతో అందజేస్తారు. దీనిని ఇంప్లిమెంట్ సర్వీస్ స్టేషన్ (ఐఎస్ఎస్) అంటారు. దీనిద్వారా గ్రామ రైతులకు పనిముట్లు అందుబాటులో ఉం టాయి. పైన తెలిపిన పరికరాలు కావాల్సిన రైతులు గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి లేదా మండల వ్యవసాయాధికారిని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు వీడీవీ కృపాదాస్ సూచించారు.