15 మండలాల్లో విత్తన పంపిణీ ప్రారంభం
Published Wed, May 31 2017 12:21 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
- మొదటి రోజు వేరుశనగకు డిమాండ్ అంతంతమాత్రమే
- 730 క్వింటాళ్లు మాత్రమే పంపిణీ
- కందులు, మినుము తదితర విత్తనాల ధరలు ఖరారు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా వ్యాప్తంగా 15 మండలాల్లో సోమవారం విత్తనాల పంపిణీ ప్రారంభమైంది. కందులు, మినుములు తదితర వాటికి సోమవారం నాటిì కి ధరలు రాకపోవడం వల్ల పలు మండలాల్లో విత్తనాలు పంపిణీ మొదలు కాలేదు. మంగళవారం అన్ని రకాల విత్తనాలకు ధరలు సబ్సిడీలు ఖరారు కావడంతో బుధవారం జిల్లా వ్యాప్తంగా విత్తనాల పంపిణీ మొదలయ్యే అవకాశం ఉంది. మొదటి రోజు వేరుశనగకు డిమాండ్ అంతగా కనిపించలేదు. వర్షాలు లేకపోవడం, సబ్సిడీపై ఇస్తున్నా మార్కెట్ ధర కంటే అధికంగా ఉండడంతో వేచిచూసే ధోరణిలో రైతులున్నట్లు తెలుస్తోంది. మొదటి రోజు 15 మండలాల్లో పంపిణీ ప్రారంభం కాగా కేవలం 730 క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ అయినట్లు తెలుస్తోంది. కర్నూలు మండలానికి సంబంధించి ఈ.తాండ్రపాడు, గొందిపర్ల, పంచలింగాల, దేవమాడ గ్రామాలకు మొదటి రోజు షెడ్యూల్ ఇవ్వగా ఒక్క రైతు కూడా రాకపోవడం గమనార్హం.
Advertisement