పూడ్చేసిన శవాన్ని మళ్లీ బైటకి తీసి.. | Postumartam to deadly body in attapoor | Sakshi
Sakshi News home page

పూడ్చేసిన శవాన్ని మళ్లీ బైటకి తీసి..

Published Tue, Sep 27 2016 10:49 PM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM

Postumartam to deadly body in attapoor

అత్తాపూర్‌: కూతురు మృతిపై తండ్రి అనుమానం వ్యక్తం చేయడంతో ఖననం చేసిన వుృతదేహాన్ని మళ్లీ బైటకి తీసి పోస్ట్‌మార్టం నిర్వహించిన సంఘటన రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్ స్పెక్టర్‌ వి.ఉమేందర్‌ కథనం ప్రకారం.. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలోని బుద్వేల్‌ ఇంద్రనగర్‌ కాలనీకి చెందిన నవనీత(25), థామస్‌ భార్యాభర్తలు. నవనీత స్వీపర్‌గా విధులు నిర్వర్తించేది. అయితే ఈ నెల 15న నవనీత ఇంట్లో నిద్రలోనే మృతి చెందింది.

సహజ మరణంగానే భావించిన కుటుంబసభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా నవనీత తండ్రి నర్సింహ తన కూతురు మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మంగళవారం మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టం నిర్వహించారు. కేసు దర్యాప్తులో ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement