కుటుంబ కలహాలతో ఒకప్పుడు భార్య.. ఇప్పుడు భర్త.. తీవ్ర విషాదం! | - | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలతో ఒకప్పుడు భార్య.. ఇప్పుడు భర్త.. తీవ్ర విషాదం!

Published Thu, Oct 19 2023 4:46 AM | Last Updated on Thu, Oct 19 2023 1:00 PM

- - Sakshi

నర్సింలు (ఫైల్‌)

మెదక్‌: కుటుంబ కలహాలతో ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గజ్వేల్‌, కుకునూరుపల్లి మండలంలోని లకుడారం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బొడిగ నర్సింలు (40) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. 13 ఏళ్ల కిందట కుటుంబ కలహాలతో ఆయన భార్య ఆత్మహత్య చేసుకుంది. దీంతో 8 ఏళ్ళ కిందట రెండో వివాహం చేసుకున్నాడు. ఇటీవల రెండో భార్యతో గొడవలు జరుగుతుండడం, వ్యవసాయం కోసం చేసిన అప్పుల కోసం మధనపడుతుండేవాడు. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com

చదవండి: ఓ వ్యక్తి అడ్డుగా రావడంతో.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఒక్కసారిగా..

Follow the Sakshi TV channel on WhatsApp:

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement