పెళ్లింట చావుబాజా | marriage time but Bridegroom died | Sakshi
Sakshi News home page

పెళ్లింట చావుబాజా

Published Tue, Apr 22 2014 3:03 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

పెళ్లింట చావుబాజా - Sakshi

పెళ్లింట చావుబాజా

కాసేపట్లో పెళ్లికొడుకు కాబోయే ముందు రోడ్డు ప్రమాదంలో మృతి
 
 చిట్యాల  పెళ్టింట చావుబాజా మోగింది.   కాసేపట్లో  పెళ్లికొడుకు కావాల్సిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ సంఘటన  నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. చిట్యాల మండలం శివనేనిగూడేనికి చెందిన నర్సింహ(25)కు, రామన్నపేట మండలం నీర్నేంలకు చెందిన యువతితో  23వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. పెళ్లిపనుల నిమిత్తం అతను సోమవారం రామన్నపేటకు వెళ్లాడు. 

తిరుగు పయనమవుతుండగా, సాయంత్రం పేట శివారు దాటుతుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో అతను మృతి చెందాడు. మంగళవారం పెళ్లికొడుకు కావాల్సిన బిడ్డ శవమై రావడంతో కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. ఒగ్గుకథలు చెబుతూ చుట్టుపక్కల గ్రామాల్లో కలవిడిగా ఉండే నర్సింహ మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement