శంషాబాద్‌లో ఇద్దరి ఆత్మహత్య
Published Mon, Aug 8 2016 11:28 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో ఆదివారం రాత్రి జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారు. జవహర్ నగర్ పరిధిలోని బాలాజీ నగర్‌లో కుటుంబ కలహాల కారణంగా జ్యోతి అనే వివాహిత ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందింది. అలాగే, శంషాబాద్ మండలం తొండుపల్లిలో బి.నర్సింహ(46) చెట్టుకు ఉరేసుకుని తనువు చాలించాడు. ఆర్థిక ఇబ్బందులే ఇతని ఆత్మహత్యకు కారణమని గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Advertisement
Advertisement