two suicide
-
కుటుంబ కలహాలతో ఇద్దరి ఆత్మహత్య
తలుపుల : మండల పరిధిలోని ఓబులరెడ్డిపల్లికి చెందిన వెంకటరమణ కుమారుడు వెంకటనారాయణ(40) కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ చంద్రశేఖర్ శనివారం తెలిపారు. ఆయన కథనం మేరకు.. ఓబులరెడ్డిపల్లికి చెందిన వెంకటనారాయణ తన అత్తగారి ఊరైన చెర్వుమోరపల్లి సమీప పొలాల్లో పరుగుల మందు తాగి ఇంటికి వచ్చారు. బంధువులు వైద్యసేవల నిమిత్తం కదిరికి, అక్కడి నుంచి అనంతపురం తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలోనే మరణించాడు. ఆయనకు భార్య రాధమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బెళుగుప్పలో మహిళ బెళుగుప్ప : మండల కేంద్రంలోని బీసీ కాలనీలో కుటుంబ కలహాలతో లక్ష్మి(22) అనే మహిళ శుక్రవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తండ్రి రామాంజినేయులు ఫిర్యాదు మేరకు... రాయదుర్గం మండలం టి.వీరాపురం గ్రామానికి చెందిన రామాంజినేయులు పెద్ద కూతురైన లక్ష్మిని ఆరు సంవత్సరాల క్రితం బెళుగుప్ప బీసీ కాలనీలోని శివకు ఇచ్చి వివాహం చేశారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయంలో దినసరి కాంట్రాక్టు కార్మికుడిగా జీవనం సాగించే శివ కొంతకాలంగా జీతం సక్రమంగా ఇంట్లో ఇచ్చేవాడు కాదు. ఈ విషయమై వారి మధ్య వచ్చిన వివాదం ముదిరింది. శుక్రవారం సాయంత్రం గొడవ పెద్దదవడంతో లక్ష్మి మనస్థాపానికి గురైంది. ఆ రాత్రి చీర దూలానికి వేలాడదీసి ఉరి వేసుకుని మతి చెందింది. వీరికి నాలుగు సంవత్సరాల కుమారుడు, తొమ్మిది నెలల కూతురు ఉన్నారు. విషయం తెలుసుకున్న ఇన్చార్జి స్టేషన్ ఆఫీసర్ ఎస్ఐ విజయ్‌నాయక్, తహశీల్దార్ వెంకటాచలపతి శనివారం మతురాలి ఇంటికెళ్లి పరిశీలించారు. మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్ఐ తెలిపారు. -
జయ ఆరోగ్యం కోసం ఇద్దరు ఆత్మాహుతి
ఇద్దరు ఆత్మాహుతి జయ అనారోగ్యానికి గురయ్యారని కలత చెంది చెన్నై తాంబరానికి చెంది న సద్గుణం (31) బుధవారం రాత్రి నడిరోడ్డుపై నిలబడి జయ ఆరోగ్యంపై వాస్తవాలు ప్రకటిం చాలని నినాదాలు చేస్తూ అకస్మాత్తుగా ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పటించుకున్నాడు. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో మృతి చెందాడు. అలాగే మధురై జిల్లా పేరయ్యూరుకి చెందిన అన్నాడీఎంకే కార్యకర్త రాజవేల్ (21) ఈనెల 4వ తేదీన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పుపెట్టుకున్నాడు. తీవ్రగాయాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి ప్రాణాలు విడిచాడు. -
కూతురి మృతిని తట్టుకోలేక తల్లి ఆత్మహత్య
హిందూపురం అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కూతురు మరణాన్ని తట్టుకోలేకపోయిక ఓ కన్నతల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన అనంతపురం జిల్లా హిందూపురం ముద్దిరెడ్డిపల్లెలో ఆదివారం జరిగింది. అనారోగ్యం కారణంగా ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. దీంతో కూతురు చనిపోవడాన్ని జీర్ణించుకోలేని ఓ తల్లి ఉరేసుకుని బలవన్మరణం చెందింది. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
శంషాబాద్‌లో ఇద్దరి ఆత్మహత్య
శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో ఆదివారం రాత్రి జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారు. జవహర్ నగర్ పరిధిలోని బాలాజీ నగర్లో కుటుంబ కలహాల కారణంగా జ్యోతి అనే వివాహిత ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందింది. అలాగే, శంషాబాద్ మండలం తొండుపల్లిలో బి.నర్సింహ(46) చెట్టుకు ఉరేసుకుని తనువు చాలించాడు. ఆర్థిక ఇబ్బందులే ఇతని ఆత్మహత్యకు కారణమని గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
పురుగుల మందు తాగి ఇద్దరి ఆత్మహత్య
కారణాలు తెలియవంటున్న పోలీసులు కేసు నమోదు నరసారెడ్డిపల్లె(చెన్నూరు) : చెన్నూరు మండలం ఉప్పరపల్లె పంచాయతీ నరసారెడ్డిపల్లె సమీపంలోని వ్యవసాయ పొలాల్లో పురుగుల మందు తాగి మంగళవారం ఇద్దరు మృతి చెందారు. చెన్నూరు ఎస్ఐ, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతకొమ్మదిన్నె మండలం విశ్వనాథపురానికి చెందిన షేక్ ఖాదర్‌వలి(40), వీరబల్లి మండలం బొంగవాండ్లపల్లెకు చెందిన తంగెళ్ల వెంకటసుబ్బమ్మ(38)లకు ఆరేళ్లుగా వివాహేతర సంబంధం ఉండేది. వీరు మండలంలోని ఉప్పరపల్లె గ్రామంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని కూలిపని చేసుకొంటూ జీవించేవారు. మూడేళ్ల క్రితం ఊరొదిలి వెళ్లారు. వెంకటసుబ్బమ్మకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు కడపలో ఉంటూ హోటళ్లలో పని చేస్తున్నారు. వీరి మధ్య ఎలాంటి కలహాలు ఏర్పడ్డాయో ఇద్దరు కలిసి నరసారెడ్డిపల్లె సమీపంలోని బీడుపొలాల్లోకి సోమవారం రాత్రి చేరుకొని పురుగుల మందు తాగారు. ఉదయం ఉపాధి పనులకు వెళ్లిన ఉప్పరపల్లె, దుగ్గనపల్లె కూలీలు వీరి మృతదేహాలను గుర్తించి వీఆర్ఏ ఏసురాజుకి సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ హనుమంతు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని మృతికి కారణాలపై విచారిస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
రైలు కిందపడి ఇద్దరి ఆత్మహత్య
జహీరాబాద్ (మెదక్ జిల్లా): సొంత గ్రామానికి వెళ్లలేక రెండో భార్యతో కలసి భర్త రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా జహీరాబాద్ సమీపంలోని బీదర్ రైల్వే గేటువద్ద ఆదివారం చోటు చేసుకుంది. మృతులు మహారాష్ట్రకు చెందిన వారు. వికారాబాద్ రైల్వే పోలీసుల కథనం మేరకు.. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా, నీలంగ తాలూకా శిలవంతవాడి గ్రామానికి చెందిన వడ్డెర దాసప్ప (28), అనూషలకు ఓ కుమార్తె, ఒక కుమారుడు ఉన్నాడు. దాసప్ప కూలీ పనులు చేసుకుని జీవనం సాగించే వాడు. అయితే దాసప్పకు ఇంటికి సమీపంలో ఉంటున్న శన్నూబీ (25)తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. గ్రామస్తులకు విషయం తెలియడంతో మందలించారు. అయినా.. ఇరువురు ఆరు నెలల క్రితం వివాహం చేసుకుని గ్రామం నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. దాసప్ప వద్ద లభించిన డైరీలో ‘మేం ఆత్మహత్య చేసుకుంటున్నాం. మా ఇద్దరి మృతదేహాలను ఒకే గోతిలో పాతి పెట్టండి’ అని సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ శివలింగం సంఘటనా స్థలాన్ని సందర్శించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
రైలునుంచి దూకి ఇద్దరి ఆత్మహత్య
జనగామ , న్యూస్‌లైన్: వేగంగా వెళుతున్న రైలు నుంచి దూకి ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా జనగామ మండలం యశ్వంతాపూర్ రైల్వేస్టేషన్ సమీపంలో శనివారం జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన గుడిపుడి సాగర్(23), కోడి మౌనిక(22) సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు జనరల్ టికెట్ తీసుకుని హౌరా ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరారు. యశ్వంతాపూర్ సమీపంలో రైలులో నుంచి ముందుగా మౌనిక, ఆ తర్వాత సాగర్ దూకారు. సాగర్ సంఘటన స్థలంలోనే మృతిచెందగా, తీవ్రగాయాలపాలైన మౌనికను ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని రైల్వే పోలీసులు వెల్లడించారు.