జనగామ , న్యూస్‌లైన్: వేగంగా వెళుతున్న రైలు నుంచి దూకి ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా జనగామ మండలం యశ్వంతాపూర్ రైల్వేస్టేషన్ సమీపంలో శనివారం జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన గుడిపుడి సాగర్(23), కోడి మౌనిక(22) సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు జనరల్ టికెట్ తీసుకుని హౌరా ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరారు. యశ్వంతాపూర్ సమీపంలో రైలులో నుంచి ముందుగా మౌనిక, ఆ తర్వాత సాగర్ దూకారు. సాగర్ సంఘటన స్థలంలోనే మృతిచెందగా, తీవ్రగాయాలపాలైన మౌనికను ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని రైల్వే పోలీసులు వెల్లడించారు.