జయ ఆరోగ్యం కోసం ఇద్దరు ఆత్మాహుతి
ఇద్దరు ఆత్మాహుతి
జయ అనారోగ్యానికి గురయ్యారని కలత చెంది చెన్నై తాంబరానికి చెంది న సద్గుణం (31) బుధవారం రాత్రి నడిరోడ్డుపై నిలబడి జయ ఆరోగ్యంపై వాస్తవాలు ప్రకటిం చాలని నినాదాలు చేస్తూ అకస్మాత్తుగా ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పటించుకున్నాడు. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో మృతి చెందాడు. అలాగే మధురై జిల్లా పేరయ్యూరుకి చెందిన అన్నాడీఎంకే కార్యకర్త రాజవేల్ (21) ఈనెల 4వ తేదీన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పుపెట్టుకున్నాడు.
తీవ్రగాయాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి ప్రాణాలు విడిచాడు.