సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మతపరమైన రిజర్వేషన్ల పేరుతో రాజకీయం చేస్తున్నారని, మతపరమైన రిజర్వేషన్లు తెస్తామని చెబుతున్న టీఆర్‌ఎస్‌కు డీఎంకే నేత స్టాలిన్ మద్దతు ఇవ్వడాన్ని ఖండిస్తున్నామని బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు నర్సింహ యాదవ్ పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకించారని ఆయన గుర్తు చేశారు. పార్టీ నేతలు కె.వెంకటేశ్వర్లు, పార్టీ అధికార ప్రతినిధి రాకేశ్‌రెడ్డితో కలసి బుధవారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
గీత కార్మికులకు చెట్లు పెంచుకోవడానికి 5 ఎకరాలు, యాదవులకు గొర్లు మేపుకోవడానికి 5 ఎకరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ తాను ఇచ్చిన మాటకు కట్టుబడి బీసీ సబ్ ప్లాన్ తేవాలన్నారు. కేసీఆర్ బీసీలకు అన్యాయం చేస్తున్నాడని, బీసీలను మోసం చేస్తున్న ఆయనను గద్దెదించే వరకు పోరాటం చేస్తామన్నారు. డిసెంబర్ ఒకటో తేదీన బీసీల హక్కులకై బీసీల సంగ్రామం నిర్వహిస్తామన్నారు.
ప్రపంచ పారిశ్రామిక సదస్సు హైదరాబాద్‌లో జరగడం గర్వకారణమని, ప్రధాని మోడీ ఘనతవల్లే ఈ సదస్సు హైదరాబాద్‌లో జరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే పెట్టుబడులు వస్తాయని, రాష్ట్ర ప్రభుత్వాల వల్ల కాదని చెప్పారు. టీ–హబ్ వల్లే ప్రపంచ పారిశ్రామిక సదస్సు జరుగుతోందని మంత్రి కేటీఆర్ చెప్పడం సిగ్గుచేటని, టీ–హబ్ వల్ల ఎందరికి ఉపయోగం కలిగిందో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment