person death
-
‘ఓఆర్ఆర్’పై ఘోర రోడ్డు ప్రమాదం.. తల తెగిపడి వ్యక్తి మృతి
సాక్షి,హైదరాబాద్: శంషాబాద్ ఔటర్‌రింగ్‌రోడ్డు(ఓఆర్ఆర్)పై మంగళవారం(ఆగస్టు 6) ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. వేగంగా ఢీకొట్టడంతో ఆ వ్యక్తి కారు అద్దంలో ఇరుక్కుపోయాడు. ప్రమాద తీవ్రతకు వ్యక్తి తల తెగి కారు వెనకాల సీటులో పడిపోయింది. అద్దంలో ఇరుక్కుపోయిన వ్యక్తిని కారు కొంత దూరం వరకు లాక్కొని పోవడంతో తల తెగి పడింది. మృతుడు శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఉట్పల్లి గ్రామానికి చెందిన తోట్ల అంజయ్యగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చనిపోయాడనుకున్న వ్యక్తి.. బతికొచ్చాడు!
బషీరాబాద్: చనిపోయాడని ఓ వ్యక్తి అంత్య క్రియలకు బంధువులు అన్ని ఏర్పాట్లు చేసు కున్నారు. మృతదేహాన్ని పొలంలో ఖననం చేసేందుకు సిద్ధమయ్యారు. చివరకు పాడె ఎత్తే సమయానికి చనిపోయాడనుకున్న వ్యక్తి ఇంటి దగ్గర ఆటోలో దిగాడు. దీంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. ఈ విచిత్ర ఘటన వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నావంద్గీ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. సెల్‌ఫోన్ చోరీ చేసిన వ్యక్తి మరణించడంతో...గ్రామానికి చెందిన పిట్టల ఎల్లప్ప (40) బషీరాబాద్‌లో ఓ నాయకుడి దగ్గర పశువుల కాపరిగా పనిచేస్తుండే వాడు. మూడు రోజు లుగా పనికి వెళ్లలేదు. ఇంట్లోనూ చెప్పకుండా తాండూరు వెళ్లాడు. అక్కడ అడ్డకూలీ పనికి వెళ్లి రాత్రికి తాండూరు రైల్వే స్టేషన్లో పడుకునేవాడు. శుక్రవారం అతడి సెల్‌ఫోన్‌ను రైల్వేస్టేషన్లో ఓ వ్యక్తి దొంగిలించాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి వికారాబాద్ రైల్వే స్టేషన్లో రైలు కింద పడి ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు.మృతుడి దగ్గర లభించిన సెల్‌ఫోన్ ఆధారంగా రైల్వే పోలీసులు ఎల్లప్ప కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో భార్య ఎములమ్మ, బంధువులు, గ్రామస్తులు ఆదివారం ఉదయం వికా రాబాద్ ఆస్పత్రికి చేరుకున్నారు. తలలేని శరీరంపై పుట్టుమచ్చలు గుర్తుపట్టి తమకు సంబంధించిన వ్యక్తి అని చెప్పడంతో శవాన్ని అప్పగించారు. అంబులెన్సులో మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. కుటుంబీకులు, బంధువుల రోదనలతో ఇంట్లో వి షాదం నెలకొంది. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగానే ఎల్లప్ప తాపీగా ఆటోలో వచ్చి ఇంటి వద్ద దిగాడు. దీంతో ఎల్లప్ప సెల్‌ఫోన్ చోరీ చేసిన వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు గుర్తించి మృతదేహాన్ని తిరిగి రైల్వే పోలీసులకు అప్పగించారు. -
కొద్ది రోజుల్లో పెళ్లి..కానీ అంతలోనే
సాక్షి, లావేరు(శ్రీకాకుళం) : మరికొద్ది రోజుల్లో తన పెద్ద కుమార్తెకు పెళ్లి జరిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆనందంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇంతలోనే ఆ ఇంటి యజమాని వైఎస్సార్సీపీ నాయకుడు పడాల వెంకన్న(43) మృతి చెందడంతో ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ సంఘటన లావేరు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఈయన పెద్ద కుమార్తెకు విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కందివలస గ్రామానికి చెందిన తన బావమరిదితో ఈ నెల 25న వివాహం చేసేందుకు ముహూర్తం నిశ్చయించాడు. ఈ నేపథ్యంలో కిడ్నీ, లివర్ సంబంధిత వ్యాధులతో వెంకన్న బాధపడుతున్నాడు. గురువారం రాత్రి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో తన ఇంటి వద్దే మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెళ్లికార్డులు పంచడంతోపాటు పెళ్లి పనుల్లో నిమగ్నమైన సమయంలో ఇంటి యజమాని మరణించడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఇక మాకు దిక్కెవరూ అంటూ మృతదేహంపై పడి రోదిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. వైఎస్సార్సీపీ నాయకులు పరామర్శ వైఎస్సార్సీపీ నాయకుడు పడాల వెంకన్న మృతి చెందడంతో పార్టీ సీనియర్ నాయకులు మహదాసు రాంబాబు, లంకలపల్లి గోపి, లంకలపల్లి నారాయణరావు, వట్టి సత్యనారాయణ, పడాల పాపారావు, లంకలపల్లి చిన్నారావు, సగరపు విశ్వనాథం, లంకలపల్లి భాస్కరరావు, తలారి నాగయ్య, ఇనుకోటి చిన్న, పైడి దాము, ఇనపకురి చలపతి, కొండక ప్రసాద్, తదితరులు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలియజేశారు. -
దైవదర్శనానికి వెళుతూ.. మృత్యు ఒడిలోకి..
రెలైక్కబోతూ కిందపడి వ్యక్తి మృతి నెల్లూరు రైల్వేస్టేషన్లో ఘటన మృతుడు తిరుమలగిరి వాసి రేగొండ : మండలంలోని తిరుమలగిరి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి బయల్దేరిన ఓ వ్యక్తి కదులుతున్న రైలు ఎక్కబోతూ కిందపడి మృతిచెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు రైల్వేస్టేషన్లో మంగళవారం జరిగింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. తిరుమలగిరికి చెందిన మాచర్ల రాజు(35) హ నుమాన్ మాలధారణ వేసుకొని 41 రోజుల దీక్ష చేశాడు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మాల విరమణ కోసం కుటుంబ సమేతంగా విజయవాడకు సోమవారం వెళ్లాడు. మంగళవారం విజయవాడలోని కనదుర్గమ్మ ఆల యంలో మాల విరమణ చేశాడు. అనంతరం రాజు కుమారుడు వెంకటేష్ తల నీలాలను తిరుపతిలో తీసేందుకు విజయవాడ నుంచి కృష్ణ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరారు. ఈ క్రమంలోనే పిల్లలకు దాహం వేస్తుందని చెప్పడంతో రాజు నెల్లూరు రైలు స్టేషన్లో రైలు ఆగగానే రైలు దిగి వెళ్లాడు. రాజు నీళ్ల బాటిల్ తీసుకోవడంలో కొంతజాప్యం జరిగింది. దీంతో రైలు కదలడంతో రాజు పరుగెత్తుకుంటూ వచ్చి ఎక్కేందుకు ప్రయత్నించాడు. రైలు వేగం పెరగడంతో ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యూరుు. వెంటనే రాజు కుటుంబ సభ్యులు చైన్ లాగి రైలు ఆపి నెల్లూరు ఆస్పత్రిలో చేర్పించగా గంటలోనే మృతిచెందాడని భార్య రజిత రోదిస్తూ తెలిపింది. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు, తల్లి ఉన్నారు. -
వ్యక్తి దారుణ హత్య
కరీంనగర్: హైదరాబాద్ వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గణేష్‌నగర్‌లో జరిగింది. కాలనీకి చెందిన పడమటింటి భాస్కర్ (32) గురువారం రాత్రి హత్యకు గురయ్యాడు. పెళ్లి సంబంధం కోసం వివరాలు తీసుకురమ్మని స్నేహితుడు ఫోన్ చేయడంతో ఇంటి నుంచి బయలుదేరిన బాస్కర్ శుక్రవారం ఉదయం శవమై కనిపించాడు. అలకాపురి వద్ద గుర్తుతెలియని దుండగులు అతన్ని కత్తులతో పొడిచి ఆపై బండరాయితో మోది అతి కిరాతకంగా చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యక్తి దారుణ హత్య
హైదరాబాద్: ఓవ్యక్తి దారుణహత్యకు గురైన సంఘటన జవహర్ నగర్ లోని అంబేద్కర్ కాలనీలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. దుండగులు బండరాయితో తలపై బలంగా మోది హత్య చేశారు. వివరాలు...స్థానికంగా ఉండే నల్ల రామచందర్ (45) అనే వ్యక్తి పెయింటర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. బుధవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఆయనను బండరాయితో మోదడంతో మృతి చెందాడు. స్తానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు కారణాలు తెలియ రాలేదు. (జవహర్‌నగర్) -
వ్యక్తి దారుణ హత్య
ఓ వ్యక్తి దారుణహత్యకు గురైన సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా గద్వాల పట్టణంలోని విద్యుత్తు ఉపకేంద్రం సమీపంలో బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఓ వ్యక్తిని బండరాయితో మోది హత్య చేశారు. ముఖాన్ని గుర్తుపట్టడానికి వీలులేకుండా చిద్రం చేశారు. అయితే స్థానికులు మృతుడిని గద్వాల మండలంలోని నదీ అగ్రహారం గ్రామానికి చెందిన దాదావలి(45) గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాదావలి హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలు ఇంకా తెలియరాలేదు.