ఓవ్యక్తి దారుణహత్యకు గురైన సంఘటన జవహర్ నగర్ లోని అంబేద్కర్ కాలనీలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.
హైదరాబాద్: ఓవ్యక్తి దారుణహత్యకు గురైన సంఘటన జవహర్ నగర్ లోని అంబేద్కర్ కాలనీలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. దుండగులు బండరాయితో తలపై బలంగా మోది హత్య చేశారు. వివరాలు...స్థానికంగా ఉండే నల్ల రామచందర్ (45) అనే వ్యక్తి పెయింటర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
బుధవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఆయనను బండరాయితో మోదడంతో మృతి చెందాడు. స్తానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు కారణాలు తెలియ రాలేదు.
(జవహర్‌నగర్)